ఇస్లాం అంటే ఏమిటి?
‘ఇస్లాం’ అన్న పదం అరబీ భాషలోని ‘సల్మున్’ (శాంతి), ‘సిల్మున్'(విధేయత) అన్న పదాల నుండి ఉద్భవించింది. ఆధ్యాత్మికంగా చూస్తే ‘మనల్ని మనం దైవానికి సమర్పించు కోవటం ద్వారా ఇహపరాల్లో శాంతి సాధిం చడం’. ‘ముహమ్మదీయ ధర్మం, ముహమ్మ డనిజం, ముహమ్మదీయులు’అనడం పొరపాటు. ఎందుకంటే ఈ పదాలు దైవాన్ని కాక, ముహమ్మద్ (స)ని ఆరాధిస్తారన్న అపోహ కల్గి స్తాయి. అరబీ భాషలో ‘అల్లాహ్‌ా’ అంటే ‘సర్వో న్నతుడైన దైవం’ అని అర్థం. ముస్లిములే కాక అరబ్బు క్రిష్టియన్లు కూడా దేవుణ్ణి ‘అల్లాహ్‌ా’ అనే పిలుస్తారు. ఇస్లాం కొత్త మతమేమి కాదు. దైవం అనాదిగా తన ప్రవక్తల ద్వారా మానవాళికి అందజేస్తూ వచ్చిన ధర్మమే ఇస్లాం. ప్రపంచ జనాభాలో ఐదవ వంతు ప్రజలైన ముస్లిములకు ఇస్లాం ఓ ధర్మం మాత్రమే కాదు జీవన విధానం కూడా. శాంతి, కరుణ, క్షమాగుణం బోధించే ధర్మాన్ని ముస్లిములు ఆచరిస్తున్నారు.
ముస్లిములంటే ఎవరు?
‘ముస్లిం’ అంటే ‘ఇస్లాం అనుసరిస్తున్న వ్యక్తి’ లేదా తనను దైవానికి అర్పించుకున్న వ్యక్తి’ అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా-దేశము, ఖండము, తెగ, జాతి, సంస్కృతీ అన్న తేడా లేకుండా నూట డెబ్భయి కోట్ల మంది ముస్లి ములున్నారు. ప్రపంచ ముస్లిం జనాభాలో కేవలం 18% మంది మాత్రమే అరబ్ దేశాల్లో జీవిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభాకల దేశం ఇండోనేషియా. ఆసియా, ఆఫ్రికాల్లో కూడా ముస్లిములు చెప్పుకోదగ్గ సంఖ్యలో నివసిస్తున్నారు. సోవియట్ యూని యన్, చైనా, ఉత్తర అమెరికా, దక్షణ అమె రికా,యూరొప్‌లలో ముస్లిములు అల్ప సంఖ్యా కులు.
ముస్లిములు ఏమి నమ్ముతారు?
ముస్లిములు ఈ విశ్వ సృష్టికర్త, పోషకుడు, ఏకైక దైవం అల్లాహ్‌ాను నమ్ముతారు. దైవం తాను సృష్టించిన దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా మానవాళికి అందించిన ధర్మ గ్రంథా లను నమ్ముతారు. తీర్పుదినాన ప్రతి వ్యక్తి తన కర్మలకు జవాబు చెప్పుకోవలసి ఉంటుందన్న విషయాన్ని నమ్ముతారు. ఇహంలోనూ, మర ణానంతరం కూడా మనిషి జీవితంపై పూర్తి అధికారం దైవానికి ఉందని నమ్ముతారు. ఆదం (అ) మొదలుకొని- నూహ్‌ా, ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్‌హాఖ్, యాకూబ్ , యూసుఫ్, అయ్యూబ్, మూసా, హారూన్, దావూద్, సులైమాన్, ఇల్యాస్, యూనుస్, యహ్యా, ఈసా అలైహిముస్సలామ్-మొదలైన ప్రవక్తలందరినీ నమ్ముతారు. దైవం తన అంతిమ సందేశాన్ని, అంతకు ముందు ప్రకటించిన సందేశాల సారాన్ని దైవదూత జిబ్రీల్ (అ) ద్వారా చివరి ప్రవక్త ముహమ్మద్(స)కు అందజేశారు.
ఎవరైనా ముస్లిం కావొచ్చా?
”అల్లాహ్‌ా తప్ప ఆరాధనీయులు ఎవరూ లేరు. ముహమ్మద్(స) అల్లాహ్‌ా అంతిమ ప్రవక్త” అని విశ్వాస ప్రకటన చేసిన వారంతా ముస్లి ములు అవుతారు. ఈ ప్రకటన ద్వారా దైవ ప్రవక్తలు, వారు తెచ్చిన ధర్మ గ్రంథాలను తాను నమ్ముతానని విశ్వాసి చాటుకుంటాడు.
కాబా అంటే ఏమిటి?
కాబా అనేది ప్రార్థనా స్థలం. దైవం 4000 ఏళ్ళకు పూర్వం అక్కడ దైవారాధన నిమిత్తం ఒక గృహం నిర్మించమని ఇబ్రాహీమ్(అ)కు, ఇస్మాయీల్(అ) ఆదేశించాడు. ఆ కట్టడాన్ని రాతితో నిర్మించారు. చాలామంది ఆదం(అ) స్థాపించిన ప్రార్థనాలయంపై ఈ కట్టడం నిర్మించబడిందని భావిస్తారు. ఆ ప్రదేశానికి దైవారాధన కోసం రమ్మని మానవాళిని పిల వాల్సిందిగా ఇబ్రాహీమ్(అ)ను అల్లాహ్‌ా ఆదేశిం చాడు.
ఇప్పటికీ పవిత్ర హజ్ యాత్రికులు అక్కడికి వెళ్ళినప్పుడు నాటి ఇబ్రాహీమ్ పిలుపుకు ప్రతిస్పందనగా ‘ఓ ప్రభువా, మేము నీ సేవలో హాజరయ్యాము’ అని నినదిస్తుంటారు.
ముహమ్మద్ (స) ఎవరు?
క్రీ.శ. 570 సంవత్సరంలో ముహమ్మద్ (స) మక్కా నగరంలో జన్మించారు. అప్పటికి ఇంకా ఐరోపా ఖండంలో క్రైస్తవ ధర్మం వ్యాపించ లేదు. ముహమ్మద్ (స) లోకంలోకి అడుగు పెట్టక ముందే తండ్రి అబ్దుల్లాహ్‌ా గతించారు. అనతికాలంలోనే ఆయన తల్లి ఆమినా కూడా చనిపోయారు. తర్వాత ఆయనను తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్, వారి అనంతరం బాబాయి అబూ తాలిబ్ పెంచి పెద్ద జేశారు. ఆయన పెరిగి పెద్దయ్యాక సత్యసంధతకు, విశ్వసనీయ తకు మారుపేరయ్యారు. అందుకనే వివాదాలు పరిష్కరించి తీర్పు చెప్పాల్సిందిగా ప్రజలు ఆయనను కోరేవారు. ఆయన ప్రశాంతచిత్తు డనీ, ఆధ్యాత్మిక చింతన చేసేవారని చరిత్రకా రులు అభివర్ణిస్తారు.
ముహమ్మద్ (స) ఎంతో ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తిగా ఎదిగారు. ఆయనకు సమాజం లోని చెడుల పట్ల ఏహ్యభావం ఉండేది. మక్కా సమీపంలోగల ‘జబలె నూర్’ (కాంతి శిఖరం) దగ్గరలో ఉన్న ‘హిరా’ గుహలో తరచూ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు.
ఆయన ఎలా పవ్రక్త అయ్యారు?
తన 40వ ఏట దైవదూత జిబ్రీల్ (అ) కనిపించి దైవగ్రంథం ఖుర్‌ఆన్‌లోని వాక్యాలు ముహమ్మద్ ప్రవక్తకు వినిపించారు. ఈ విధంగా అల్లాహ్‌ా ఖుర్‌ఆన్ గ్రంథాన్ని మానవాళికి బోధించే నిమిత్తం ముహమ్మద్ ప్రవక్త(స)కు 23 సంవత్సరాలలో జిబ్రీల్ ద్వారా అందజేశాడు.
జిబ్రీల్ (అ) నుంచి విన్న వాక్యాలని ఆయన తు.చ. తప్పకుండా పునరుచ్ఛరించేవారు. దైవం తెలిపిన సత్యాన్ని గురించి ప్రజలకు బోధించేవారు. దీని కారణంగా సత్య విరోధులు ఆయన శిష్యులను వేధించటం, పీడించటం మొదలు పెట్టారు. క్రీ.శ. 622వ సంవత్సరంలో అల్లాహ్‌ా ముహ మ్మద్ (స) ప్రవక్తనూ, ఆయన శిష్యులనూ వలస వెళ్ళమని ఆదేశించాడు.దీనినే ‘హిజ్రత్’ (వలస) అంటారు. మక్కా నగరం నుంచి ఉత్త రాన 260 మైళ్ళ దూరంలో ఉన్న మదీనాకు వారు హిజ్రత్ చేశారు. ఇక్కడ నుండే ముస్లిముల ‘హిజ్రీ శకం’ (ఇస్లామీయ క్యాలెండర్) మొదలయ్యింది.
వలస వెళ్ళినప్పటి నుండి ఇస్లాం స్వీకరించేవారి సంఖ్య అతి వేగంగా పెరగసాగింది. అనతి కాలంలోనే చుట్టు ప్రక్కల వందలాది పట్టణాల్లో అత్యధిక ప్రజలు ముస్లిములయ్యారు. మక్కాలోని సత్యవిరోధలు చేసిన అన్ని దాడులు, యుద్ధాలు, కుతంత్రాలను అధిగమించి ఇస్లాం ప్రబల శక్తిగా మారింది. తరువాత ప్రవక్త(స), ఆయన అనుచరులు మక్కా నగరాన్ని హస్తగతం చేసుకొన్నారు. ఓటమిపాలైన తమ పాత శత్రువులను వారు నిండు మనస్సుతో క్షమించి అక్కడ ఇస్లాం ధర్మాన్ని స్థిరపరిచారు. ప్రవక్త ముహమ్మద్(స) తన 63వ ఏట చనిపోయారు. అప్పటికే అరేబియాలోని అత్యధిక ప్రాంతంలో ఇస్లాం వ్యాపించింది. ప్రవక్త(స) చనిపోయిన శతాబ్దిలోనే ఇస్లాం ధర్మం స్పెయిన్, పశ్చిమ చైనా, తూర్పున దూరతీరాలకు వ్యాపించింది.
పప్రంచంపై ఇస్లాం వ్యాప్తి పభ్రావం
ఇస్లాం వేగవంతంగా వ్యాపించడానికి గల ప్రధాన కారణం ధర్మ సిద్ధాంతాలు సరళంగా ఉండటమే. దేవుడు ఒక్కడేననీ, అతడినే ఆరాధించమని ఇస్లాం ధర్మం ప్రబోధిస్తుంది. మనిషి తన మేధస్సును, ఆలోచనాశక్తిని ఉపయోగించాలని పదే పదే ప్రోత్సహిస్తుంది.
”జ్ఞానాన్ని సముపార్జించడం ప్రతి ముస్లిం (స్త్రీ పురుషుల) విధి” అని ప్రవక్త ముహమ్మద్(స) అన్నారు. ఇస్లాం వ్యాపించిన చోట్లలో కొన్ని సంవత్సరాల్లోనే గొప్ప నాగరికతలు, విశ్వవిద్యాలయాలు వెలిశాయి. ప్రాక్ పశ్చిమ ఆలోచనల సమ్మేళనం, పాత కొత్త ధోరుణుల మేలు కలయిక కారణంగా, ముస్లిం దేశాలలో వైద్య, గణిత,భౌతిక,ఖగోళ వాస్తు కళలు, సాహిత్యం, చారిత్రక రంగాలలో ఎంతో ప్రగతి వచ్చింది. అల్‌జిబ్రా వంటి కఠిన గణిత పద్ధతులు, అరబీ అంకెలు, ‘సున్నా’ విలువ వంటివి ముస్లింల ద్వారానే మధ్య యూరొప్‌కు వ్యాపించాయి. యూరొప్ సాహస యాత్రికులు ఆధునిక పరికరాలు రూపొందించడానికి మార్గం సుగమమయింది. అలాంటి అత్యాధునిక పరికరాల్లో ఆస్ట్రోలాబ్, క్వాడ్‌రంట్, నావి కాపటం వంటివి కూడా ఉన్నాయి.