Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

కన్నవారి సేవలోనే కరుణామయుని ప్రసన్నత

పరలోకంలో దైవప్రీతికి పాత్రులై స్వర్గం లభించాలంటే తల్లిదండ్రులను గౌరవించడం తప్పనిసరి. తల్లిదండ్రుల సంతోషంలోనే దైవసంతోషం ఇమిడి ఉంది. తల్లిదండ్రులను గౌరవించకుండా, దైవప్రసన్నతను పొందడం అసాధ్యం. కళ్ల ముందు కనబడే తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారి అవసరాలు తీర్చకుండా, వారిని సంతోషపెట్టకుండా, దైవప్రసన్నతను పొందాలనుకోవడం దుస్సాహసం

పరలోకంలో దైవప్రీతికి పాత్రులై స్వర్గం లభించాలంటే తల్లిదండ్రులను గౌరవించడం తప్పనిసరి. తల్లిదండ్రుల సంతోషంలోనే దైవసంతోషం ఇమిడి ఉంది. తల్లిదండ్రులను గౌరవించకుండా, దైవప్రసన్నతను పొందడం అసాధ్యం. కళ్ల ముందు కనబడే తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారి అవసరాలు తీర్చకుండా, వారిని సంతోషపెట్టకుండా, దైవప్రసన్నతను పొందాలనుకోవడం దుస్సాహసం

‘తల్లిదండ్రులే మీ స్వర్గం, తల్లిదండ్రులే మీ నరకం’ అని ప్రవచించారు దైవప్రవక్త (స). వారి పట్ల సత్ప్రవర్తన కలిగి, వారి సేవలో తరిస్తే స్వర్గానికి అర్హులవుతారు. వారి పట్ల అవిధేయత కనబరిచి, వారిని పట్టించుకోకపోతే నరకానికి ఆహుతి అవుతారు అని అర్థం. ఎవరైతే కన్నవారి మనసు కష్టపెట్టకుండా, వారి సేవ చేస్తారో, అలాంటి సంతానానికి స్వర్గం లభిస్తుంది, వారి ఆయుష్షు పెరుగుతుంది… అని ముహమ్మద్ ప్రవక్త (స) సెలవిచ్చారు.

పరలోకంలో దైవప్రీతికి పాత్రులై స్వర్గం లభించాలంటే తల్లిదండ్రులను గౌరవించడం తప్పనిసరి. తల్లిదండ్రుల సంతోషంలోనే దైవసంతోషం ఇమిడి ఉంది. తల్లిదండ్రులను గౌరవించకుండా, దైవప్రసన్నతను పొందడం అసాధ్యం. కళ్ల ముందు కనబడే తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారి అవసరాలు తీర్చకుండా, వారిని సంతోషపెట్టకుండా, దైవప్రసన్నతను పొందాలనుకోవడం దుస్సాహసం. వృద్ధ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోకుండా; వృద్ధాశ్రమాలకు, అనాధాశ్రమాలకు విరాళాలిచ్చి పుణ్యం సంపాదించుకున్నాను అనుకోవడం అవివేకం. తల్లిదండ్రుల్ని కాదని ఎంత గొప్ప సత్కార్యం చేసినా అది ఏ విధంగానూ ఉపకరించదు.

ఒకసారి ఒక వ్యక్తి ముహమ్మద్ ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘దైవప్రవక్తా! నా సేవకు, సత్ప్రవర్తనకు అందరికంటే ఎక్కువగా అర్హులెవరు?’ అని ప్రశ్నించాడు. సమాధానంగా ‘నీ తల్లి’ అన్నారు ప్రవక్త. ఆ వ్యక్తి అదే ప్రశ్నను పునరావృతం చేశాడు. మళ్లీ, ‘నీ మాతృమూర్తే’ అని సమాధానం చెప్పారు ముహమ్మద్ ప్రవక్త(స). ఆ వ్యక్తి మళ్లీ అదే ప్రశ్నను రెట్టించాడు. ప్రవక్త మూడవసారి కూడా ‘అందరికన్నా ఎక్కువ హక్కుదారు నీ తల్లే’ అని చెబుతూ, నాలుగవసారి ప్రశ్నకు మాత్రం ‘నీతండ్రి’ అని సమాధానం చెప్పారు. ప్రవక్తవారి ఈ ప్రవచనం వల్ల తల్లిదండ్రుల ప్రాముఖ్యం, ముఖ్యంగా మాతృమూర్తి గొప్పదనం, ఆమెకు ఉన్న విశేషస్థానం అర్థమవుతుంది. అంతేకాదు, తల్లిపాదాల కింద స్వర్గమున్నదని, తల్లిని సేవించనిదే, ఆమె ప్రేమను పొందనిదే స్వర్గానికి వెళ్లలేరని కూడా ప్రవక్తమహనీయులు సెలవిచ్చారు.

మరో సందర్భంలో ప్రవక్త మహనీయులు, ‘దైవం నీ పట్ల ప్రసన్నుడు కావాలంటే, ఆయన సంతోషం నీకు లభించాలంటే, నువ్వు నీ తండ్రిమాట వినాలి, ఆయనను ప్రసన్నం చేసుకోవాలి’ అని ఉపదేశించాడు. తల్లిదండ్రులమాట వినకుండా జీవితం గడుపుతూ ఎన్ని మంచిపనులు చేసినా తల్లిదండ్రులు ప్రసన్నం కానంతవరకు దైవం కూడా నీ మంచిపనుల్ని, నీ సత్కార్యాలను అంగీకరించడు. కనుక ప్రతిఒక్కరూ తల్లిదండ్రులకు విధేయత చూపుతూ, వారి మార్గదర్శకంలో నడుచుకుంటే, కన్నవారు సంతోషిస్తారు, ైదె వం కూడా ప్రసన్నుడై ఇహపర జీవితాల్లో సాఫల్యం ప్రసాదిస్తాడు.

 

Related Post