కర్తవ్యం పిలుస్తోంది!

ప్రపంచం మొత్తం మన వైపే చూస్తుంది. మన నడిచే బాటగానీ, మనం మాట్లాడే మాట గానీ, మన నడక గానీ, నడవడిక గానీ కేవలం మన గురించి మాత్రమే చెప్పదు, మనం నమ్ముతున్న ధర్మం గురిమచి కూడా చెబుతుంది. చెట్టును చూడకండి, పండును చూడకండి, పువ్వును చూడకండి విత్తును మాత్రమే చూడండి అంటే కుదురు తుందా చెప్పండి. అలాగే ముస్లింలను చూడకండి, వారి ప్రవర్తనను చూడకండి ఇస్లాంను మాత్రమే వారి నుండి వేరు పర్చి చూడండి అంటే లోకం ఎలా హర్షిస్తుంది చెప్పండి!

ప్రపంచం మొత్తం మన వైపే చూస్తుంది. మన నడిచే బాటగానీ, మనం మాట్లాడే మాట గానీ, మన నడక గానీ, నడవడిక గానీ కేవలం మన గురించి మాత్రమే చెప్పదు, మనం నమ్ముతున్న ధర్మం గురిమచి కూడా చెబుతుంది. చెట్టును చూడకండి, పండును చూడకండి, పువ్వును చూడకండి విత్తును మాత్రమే చూడండి అంటే కుదురు తుందా చెప్పండి. అలాగే ముస్లింలను చూడకండి, వారి ప్రవర్తనను చూడకండి ఇస్లాంను మాత్రమే వారి నుండి వేరు పర్చి చూడండి అంటే లోకం ఎలా హర్షిస్తుంది చెప్పండి!

అల్‌హమ్దులిల్లాహ్‌ మనం ఐదు పూటల క్రమం తప్పకుండా నమాజు చదువుతున్నాం. రమజాను ఉపవాసాలుమటున్నాము. జకాత్‌ చెల్లిస్తున్నాము. స్తోమత ఉంటే హజ్‌ కూడా నిర్వర్తిస్తున్నాము. అంతే కాదు సున్నత్‌,నఫిల్‌ ప్రార్థనల్ని ఈ భావన మీదో, నాదో కాదు, దాదాపు  ముస్లింలందరిది. అయినా మనం వెనుకబాటుతనాన్ని ఎమదుకు గురయి ఉన్నట్లు? అల్లాహ్‌ాను మన నిజ ఆరాధ్య దైవంగా, ముహమ్మద్‌ (స) వారిని అంతిమ దైవప్రవక్తగా,ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని అంతిమ దైవగ్రంథంగా విశ్వసిస్తున్నాము. నేటి మన జనాభా ప్రపంచంలో రెండవ స్థానం కలిగి ఉంది. మన దగ్గర అనేక రాజ్యాలున్నాయి. అయినా మనం అపఖ్యాతికి, అపకీర్తికి ఎందుకు గురవుతున్నాము? నిజం చెప్పాలంటే నేడు సయితంమానవాళి గర్వించే మానవ రత్నాలు అనేక మంది మన మధ్య ఉన్నారు. అయినా మన స్థితి మారకపోవడానికి కారణం ఏమిటి? ఎవరికి కారణాలు వారికుండొచ్చు. అయితే, ఓ ముఖ్య కారణం మనం మన అసలు కర్తవ్యాన్ని మరచిపోయాము. దేని కోసమయితే అల్లాహ్‌ మనల్ని పుట్టించాడో. దేని కోసమయితే మనందరిని ఉనికిలోకి తీసుకురావడం జరిగిందో ఆ అసలు కర్తవ్యాన్నే మనం మరచి పోయాము. ఆ మన కర్తవ్యం ఏమిటంటారా? మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజంవారు. మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్న వారు. (ఆల్ ఇమ్రాన్: 110 )”

మన చేతిలో ఓ విలువయిన గడియారమో, విలువైన స్మార్ట్‌ ఫోనో ఉందనుకోండి. దాని ఉపయోగం అదే స్థాయిలో ఉంది గనకే మనం దాన్ని అంత పైకం చెల్లించి కొన్మాము. మన చేతికి కట్టుకున్నాము. మన జేబులో పెట్టుకున్నాము. ఎవరు దాన్ని ముట్టుకున్నా తట్టుకోలేము. అదే ఆ గడియారంగానీ, ఆ స్మార్ట్‌ పోన్‌గానీ బొత్తిగా పని చేయడం మానేస్తే, ఇక అది పనే చేయదని తెలిస్తే మనం దాన్ని ముల పడేయడానికి ఒక్క నిమియం ఖూడా ఆలోచించం. కారణం అది  తన కర్తవ్యాన్ని సజావుగా నిర్వర్తించడం లేదు గనక. అలాగే అల్లాహ్‌ా మనల్ని ప్రజలందరి శ్రేయార్థం ఉనికిలోకి తీసుకు వచ్చాడు. మనం మన కర్తవ్యాన్ని వస్మిరిస్తే, మనం మన బాధ్యతను మరచిపోతే అల్లాహ్‌ మనల్ని కీర్తి పీఠాల మీద కుర్చోబెడతాడని అనుకోలేము. సమాజాన్ని అన్ని విధాల చెడుల నుమడి కాపాడాల్సిన మనమే వ్యవసన పరులుగా మారిపోతే, కాంకా దాసులు రూపొందితే, అల్లాహ్‌ా ఆదేశాలకన్నా స్వయం ప్రయోజనాలకే, స్వార్థాలకే ఎకక్కు ప్రాధాన్యత ఇస్తే మన స్థితి దుర్గతి కాకుండా సుగతి అవుతుందా చెప్పండి!

పాలు త్రాగే పసికందునికి తెలీదు నిప్పును ముట్టుకుంటే అది కాలుస్తుందని. అది కూడా ఏదో ఆడుకునే వస్తువే అనుకొని ముట్టుకోబోతాడు, మనం ఏం చేస్తాం? ఆపే రపయత్నం ఛేస్తాం. ఓ కళ్ళు లేని కబోది నడిచి వెళుతున్న దారిలో ఓ పెద్ద గుంతుంది…హెచ్చరిమచకపోతే గుంతలో పడిపోయే ప్రమాదముంది… ఏం చేస్తాం? వేల్ళి ఆపుతాము. అలా చేయడం కనీస మానవత్వంగా భావిస్తాము. మరి మన సోదరుడే, మానవుడే సత్యమేదో, అసత్యమేదో, పత్యమేదో పైత్యమేదో తెలియక మార్గం మరచి జీవిస్తూ శాశ్వత నరకాగ్నికి ఆహతి చేసుకుంటూ ఉంటే చూస్తు ఊరుకుంటున్నామెందుకు? రేపు అల్లాహ్‌ నా ఈ దాసుడు, మీ సోదరుడు నడుస్తున్న బాట నరక బాట, అతను నరకాగ్ని ఆహుతి అవుతాడు అన్న విషయం తెలిసి కూడా మీరు అతన్నెందుకు ఆపలేదు అని అల్లాహ్‌ా మనల్ని నిలదీస్తే మన వద్ద దానికి సమాధానం ఏమిటి?

మనందరి ప్రవక్త సర్వలోక కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) తన గురించి ఏమన్నారో తెలుసా? – ”నా ఉపమానం ఎలాంటి దంటే, నిప్పు రాజేయబడి ఉంది…ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి అందులో పడబోతున్నారు…నేను మాత్రం వారి నడుములు పట్టి వారిని దాన్నుండి కాపాడే ప్రయత్నం చేస్తున్నాను”.

నేడు అనేక మంది వారి నిజ ఆరాధ్య దైవం ఎవరో తెలియక, సృష్టికి , సృష్టితాలకు మధ్య తేడాను గుర్తించలేక తన లాంటి,తనకన్నా హీన స్థాయిలో, బలహీన స్థాయిలో ఉన్న సృష్టితాలను దైవంగా భావించి ఎంతో శ్రద్ధాభక్తుల నివాళులర్పిస్తున్నారు. వారి జివితాలో కోరి నరకం పాలు చేసుకుంటున్నారు. వారిని ఆ భయానక అగ్ని గుండం నుండి కాపాడాల్సి బాధ్యత మనది కాదా? విగ్రహారాధన విషం నిండిన వారి జీవితాల్లో తౌహీద్‌ అమృతాన్ని నింపాల్సిన బాధ్యత మనపై లేదా? ఆలోచించండి!

అన్నీ తెలిసిన అల్లాహ్‌ దైవదూత జిబ్రయీల్‌ (అ)ను ఉద్దేశించి – ఫలానా నగరాన్ని తలక్రిందులు చేయండి అని అన్నాడు. అందుకాయన – ప్రభూ! ఆ నగరంలో ఫలానా ని దాసుడు ఉన్నాడు. ఒక్క ఘడియ కోసం కూడా అతను నీ ధ్యానం పట్ల అశ్రద్ధ వహించలేదు’ అని విన్నవంచుకున్నాడు. సమాధానంగా  – ఆ నగరాన్ని అతనపై తిప్పి పడేయండి. ఆ నగరంలో అన్ని అఘాయిత్యాలు జరిగుతున్నా ఏనాడు అతను భృకుటి ముడిచింది లేదు. ఏ నాడు వారిని సంస్కరీమచే ప్రయత్నం చేసింది లేదు. కనుక శిక అతన్నుండే మొదలు పెట్టండి.

ప్రవక్త (స) వారి ఈ ప్రవచనం మనందరి కోసం కనువిప్పు కావాలి. నేడు 170 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న మనం ప్రతి ఐదుగురిలో ఒకరిగా ఉండొచ్చు కానీ, మిగతా 550 కొట్ల మంది ప్రజల గురిమచి ఎవరు ఆలొచించాలి?వారిని సన్మార్గం వైపునకు మనం కాకాపోతే ఎవరు ఆహ్వానించాలి? దైవప్రసన్నతా మార్గంలో సాగే ఈ గెలుపోటములతో పని లేదు. అంతిమ శ్వాస వరకూ అల్లాహ్‌ సందేశాన్ని మానవాళి మొత్తానికి అందిస్తూ పోవడమే. ఎందరో ప్రవక్త జీవితాంతం శ్రమించినా వారిని విశ్వసిమచిన వారి సంఖ్య బహు అరుదు. అయినా వారు నిరాశ చెందలేదు. చివరి కణం వరకూ అల్లాహ్‌ా వైపనకు మానవాళిని ఆహ్వానిస్తూనే ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనమొక దాయీగానే జీవించాలి. చూడండి! ప్రవక్త యూసుఫ్‌ (అ) చేయని నేరానికి జైలుకెళ్ళారు. అలా అణి నిరాశనిస్పృహకు లోను కాలేదు. అక్కడున్న జైలు ఖైదీలకు ధర్మబోధ చేస్తూ – చెల్లాచెదురుగా పడి  ఉన్న చిల్లర దైవాలు మేలా?సర్వశక్తిమంతుడయిన ఏకైన ఆరాధ్య దైవం అల్లాహ్‌ మేలా? (యూసుఫ్: 39)

మనం ముస్లిములం అని చెప్పుకునే మనం పరొకంగా ఇస్తున్న సందేశమ ఏమిటంటే, ‘మేము ఇస్లాం ధర్మ రాయబారులం అని. మన జీవితం ఇస్లాం ధార్మనికి దర్పణం అని. ఇది మనకు అర్థమయినా, అర్థం కాకపోయినా ఇదే వాస్తవం. ముస్లిం అతను ధనికుడయినా, నిరుపేదయినా, రాజయినా, ప్రజ అయినా, అరబ్బు అయినా,అరబ్బేతరుడయినా, నిండు యవ్వనస్థుడయినా, పండు ముసలి అయినా అందరూ ఇస్లాం ప్రతినిధులే. మన నడక,నడవడిక వల్ల, మన మాట, బాట వల్ల ఇస్లాం ధర్మానికి మేలయినా జరుగుతోంది. లేదా కీడయినా జరుగుతోంది.

ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్‌ సమస్త మానవాళి కోసం ఆమోదించాడు. అది తప్ప వేరే ధర్మం ఆయన వద్ద చెల్లజాలదు అని మనం తరచూ చెబుతుంటాము కదా! మరి ప్రపంచం మొత్తం మన వైపే చూస్తుంది. మన నడిచే బాటగానీ, మనం మాట్లాడే మాట గానీ, మన నడక గానీ, నడవడిక గానీ కేవలం మన గురించి మాత్రమే చెప్పదు, మనం నమ్ముతున్న ధర్మం గురిమచి కూడా చెబుతుంది. చెట్టును చూడకండి, పండును చూడకండి, పువ్వును చూడకండి విత్తును మాత్రమే చూడండి అంటే కుదురు తుందా చెప్పండి. అలాగే ముస్లింలను చూడకండి, వారి ప్రవర్తనను చూడకండి ఇస్లాంను మాత్రమే వారి నుండి వేరు పర్చి చూడండి అంటే లోకం ఎలా హర్షిస్తుంది చెప్పండి! కాబట్టి మనం మారనంత వరకు,మనం మన కర్తవ్యాన్ని సజావుగా నిర్వర్తిమచనంత వరకూ అల్లాహ్‌ కూడా మన స్తితిని మార్చడు – ఇదే ఆయన మాట – ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బి ఖౌమిన్‌ హత్తా యుగయ్యిరూ మా బిఅన్ఫుసిహిమ్‌” ‘జాతి అది ఏదయినా సరే అది స్వతహాగా తన మనోమయ స్థితిని మార్చుకోనంత వరకు అల్లాహ్‌ా కూడా ఆ జాతి దుర్గతి సుగతిగా మార్చడు”. (రాద్: 11)

ఈ విషయంలో మరింత జాప్యం జరి గితే మాత్రం అల్లాహ్‌ మనల్ని తుదముట్టించి ఈ ధర్మప్రచార బాధ్యతను మనకన్నా మెరుగ్గా నెరవేర్చే వారిని తీసుకు వస్తాడు. ఆ తర్వాత వారు మాత్రం మనలా కర్తవ్యం మరచిన వ్యక్తులయి ఉండరు. ఇప్పటికీ మీమచి పోయిందేమీ లేదు – దయా సాగరుడయిన అల్లాహ్‌ా ఇలా పిలుపునిస్తున్నాడు:  – తమ ఆత్మలపై అన్నాయానికి ఒడిగట్టి ఓ నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్‌ా పాపాలన్నింటిని మన్నిస్తాడు”.  (జుమర్: 53 )

Related Post