కారుణ్య హృదయం

కరుణ, దయ, జాలి, సానుభూతి అన్న విషయాలకు హృదయంలో స్థానం లేదంటే అలాంటివారు దైవం దృష్టిలో దౌర్భాగ్యులు, దురదృష్టవంతులు అని అర్థం. ఎందుకంటే, ఒక దౌర్భాగ్యుడి హృదయంలో మాత్రమే కారుణ్య గుణానికి స్థానం లేకుండా ఉంటుంది. ఒక వ్యక్తి తన హృదయ కాఠిన్యత గురించి ముహమ్మద్ ప్రవక్తకు విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త, ‘అనాథల తల నిమురు, దీనులకు అన్నంపెట్టు’ అని ఉపదేశించారు.

కారుణ్యం దేవుని ప్రత్యేక సుగుణం. దానిని దైవం తన దాసులకు ప్రసాదించాడు. ఏ వ్యక్తిలో ఏ మేరకు ఈ గుణప్రభావం ఉంటుందో, ఆ మేరకు అతడు శుభకరుడు, దైవకారుణ్యానికి అర్హుడు. అలాగే ఎవరు ఏ మేరకు కఠిన హృదయులో వారు ఆ మేరకు దైవకారుణ్యానికి దూరంగా ఉంటారు. ఎవరి హృదయంలోనైతే సాటి మనుషుల పట్ల, ఇతర జీవజాలం పట్ల కారుణ్యం, సానుభూతి ఉండదో, అలాంటివారిని దైవం తన ప్రత్యేక కరుణకు దూరంగా ఉంచుతాడని ముహమ్మద్‌ప్రవక్త సెలవిచ్చారు. కారుణ్యమనే గుణం దౌర్భాగ్యుని హృదయంలో నుండి తప్ప మరెవరి హృదయం నుండీ తీసి వేయబడదని ప్రవచించారు.

కరుణ, దయ, జాలి, సానుభూతి అన్న విషయాలకు హృదయంలో స్థానం లేదంటే అలాంటివారు దైవం దృష్టిలో దౌర్భాగ్యులు, దురదృష్టవంతులు అని అర్థం. ఎందుకంటే, ఒక దౌర్భాగ్యుడి హృదయంలో మాత్రమే కారుణ్య గుణానికి స్థానం లేకుండా ఉంటుంది. ఒక వ్యక్తి తన హృదయ కాఠిన్యత గురించి ముహమ్మద్ ప్రవక్తకు విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త, ‘అనాథల తల నిమురు, దీనులకు అన్నంపెట్టు’ అని ఉపదేశించారు.

హృదయకాఠిన్యత లేదా శిలాహృదయం నిజంగానే ఒక మానసిక రుగ్మత. మానవుడి దౌర్భాగ్యానికి స్పష్టమైన నిదర్శనం. దీన్ని దూరం చేసుకోవడంలోనే మానవ ఔన్నత్యం ఇమిడి ఉంది. అందుకే ఒక వ్యక్తి తన ఆత్మరుగ్మతను, హృదయానికి పట్టుకున్న రోగాన్ని దైవప్రవక్తకు నివేదించుకుని, దీనికి సరైన చికిత్సను సూచించమని కోరాడు.

దానికి ఆయన రెండు విషయాలు ఉపదేశించారు. అందులో ఒకటి అనాథల తల నిమరడం, అంటే వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని, వారి అవసరాలు తీర్చడం. కన్నవారిని కోల్పోయిన ఆ లోటును తీర్చలేకపోయినా, మేమున్నామన్న భరోసా ఇవ్వగలగడం. ఆత్మీయతతో వారి అక్కరను నెరవేర్చగలగడం. అలాగే రెండవది, ఆకలిగొన్న పేదవారి ఆకలి తీర్చడం. అందుకే ప్రవక్త, ‘‘నీ తోటివాడు, నీ పొరుగువాడు ఆకలితో అలమటిస్తుంటే, నువ్వు అతడిని పట్టించుకోకుండా భోజనం చేశావంటే, నీలో విశ్వాసం గాని, మానవత్వం గాని లేనట్లే’’ అని హెచ్చరించారు. ప్రవక్త మహనీయులు సూచించిన ఈ చికిత్సావిధానం నిజానికి మానసిక వైద్యవిధానంతో సంబంధం కలిగి ఉంది.

ఏ మనిషైనా తన హృదయంలో ఏదైనా ఒక స్థితిని జనింపచేసుకోవాలనుకుంటే, అతను దాని ప్రభావంతో సంబంధమున్న కార్యాలను ఆచరించాలి. తద్వారా కొంతకాలానికైనా ఆ స్థితి అతని హృదయంలో జనించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయులు ఉపదేశించారు. కనుక అనాథలను ఆదరించడం, అన్నార్తుల క్షుద్బాధను తీర్చడం… ఈ రెండూ సత్కార్యాలు. కారుణ్యహృదయానికి, జాలిగుండెకు ఇవి ప్రతీకలు. ఇలాంటి సత్కార్యాల ద్వారానే దైవానుగ్రహాలకు, ఆయన ప్రత్యేక కరుణకు పాత్రులై, ఇహపరాల్లో సాఫల్యం పొందే అవకాశం ఉంటుంది.

Related Post