‘మధ్యే మార్గం’-నేడు సంఘ సంస్కర్తల, ధర్మ పండితుల, రాజకీయ నాయ కుల, ఆస్తికుల, నాస్తికుల, జాతీయ-అంతర్జాతీయ సంస్థల నోళ్ళ మీద నాను తున్న ఏకైక పదం. ఎవరు ఏ అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నారో ఆయా వ్యక్తుల మేధకే అప్పగించి అసలు మధ్యే మార్గం దేన్నాంరో, మధ్యస్థ సమాజం ఏదో తెలుసుకుమదాం!
మధ్యే మార్గం అంటే, రెండు వ్యతిరేక విషయాలలో ఏ ఒక్క వైపు మొగ్గకుండా, ఏ ఒక్కదానికీ ప్రభావితం కాకుండా, మరే ఒక్క విషయాన్ని విస్మరించకుండా సమతూకాన్ని పాిస్తూ సమస్యకు సరైన పరిష్కారం వెతకడం. ‘సమతులనం’లో న్యాయం అన్నది అత్యంత కీలమయిన పాత్ర పోషిస్తుంది, పోషించాలి. గత జాతుల, జన పదాల పరిణామం వల్ల మనకు అవగతమయ్యేదేమిటంటే, వారిలో సమతుల్యం, సమతూకం లోపించడం వల్లనే అవి చేదు ఫలాన్ని చవి చూడాల్సి వచ్చింది. అందుకనే అల్లాహ్‌ా మనుషుల్ని నీతిమంతులు, సుశిక్షితులుగా చేసి వారి జీవితాలను పునీతం చేయడానికి అంతిమ దైవ ప్రవక్త (స) ముహమ్మద్ (స) వారికి ఇస్లాం అనే మధ్యే మార్గాన్ని ప్రసాదించి ప్రభవింపజేశాడు. దాన్ని నమ్మి నడుచుకునే సముదాయాన్ని ‘మధ్యస్థ సముదాయం’గా, ‘న్యాయశీల సమాజం’గా అభివర్ణించడం జరిగింది. ”అదే విధంగా మేము మిమ్మల్ని మధ్యస్థ సమా జంగా చేశాము. మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త మీపై సాక్షిగా ఉండటం కోసం”. (దివ్యఖుర్‌ఆన్-2: 143)
ముస్లింలు చేసే దుఆలలో అయిదు పూటల నమాజులో చేసే దుఆ ‘ఇహ్‌ాది నస్సిరాతల్ ముస్తఖీమ్ – (దేవా!) మాకు రుజు మార్గం చూపించు’ (ఫాతెహ;౬ ) అన్నది ప్రధానమయినది. ఇలా వేడుకోమని ఎందుకు అనడం జరిగిందంటే మనిషి నిత్యం రెండు అతివాదాల నడుమ కొట్టుమ్టిడుతుాండు. అతను సవ్యమయిన బాటన, మధ్యే మార్గాన నడవాలంటే స్వీయ అన్వేషణతోపాటు దేవుని కృపాకటాక్షాలు సయితం తోడవ్వాలి, అప్పుడే అతను సత్యాన్ని కను గొనడమే కాక సత్య బాటన చివరి శ్వాస వరకు స్థిరంగా నిలబడ గలడు. పూర్వం ఈ మధ్యే మార్గాన్ని అల్లాహ్‌ా యూదులు మరియు క్రైస్తవులకు అనుగ్రహించాడు. కానీ వారిలో ఒకరు – యూదులు తెలిసి మార్గభ్రష్టులయి దైవాగ్రహానికి గురయితే, మరొకరు- క్రైస్తవులు తెలియక మార్గం తప్పి దైవానుగ్రహానికి దూరం అయ్యారు. ఆది మానవుడు ప్రవక్త ఆదమ్ (అ) మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వరకూ ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తలు అనుసరించి, మానవాళికి ప్రబోధించిన మార్గమే ఇస్లాం. కనుకనే సమస్త మానవాళిని ఉద్దేశించి అల్లాహ్‌ా ఇలా ఉపదేశిస్తున్నాడు: ”నిశ్చయంగా నా రుజు మార్గం ఇదే. కనుక మీరు దీనిపైనే నడవండి. వేరే మార్గాలను అనుసరించకండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తొలగించి వేరు పరుస్తాయి. మీ ప్రభువు మీకు చేసిన హితోపదేశం ఇదే. మీరు వక్ర వైఖరిని దూరంగా మసలుకుాంరని ఆశించ బడుతోంది”. (దివ్యఖుర్‌ఆన్-6: 153) ఇక ఇస్లాం మనిషికి బోధించే మధ్యే మార్గానికి సంబంధించిన కొన్ని కోణాలను తెలుసకుందాం.
విశ్వాసంలో మధ్యే మార్గం:
ఇస్లాం బోధించే విశ్వాసాలు, ఆచరణలు సమస్తం సమతుల్యం గలవే. ఇస్లాం మానవాళిని ఒకే ఒక్క నిజ ఆరాధ్యుని వైపునకు ఆహ్వానిస్తుంది. అందులో నాస్తిక భావానికి చోటు లేదు. బహుదైవ భావనకు స్థానం లేదు. ఈ రెండు అతి వాదాల నడుమ ఆది నిర్ధేశించే మధ్యే మార్గం సృష్టికి కర్త ఉన్నాడు, ఆయన ఒక్కడే; ఆయనే అల్లాహ్ అన్నది.
ప్రవక్తలు, పుణ్య పురుషులు, దైవ దూతల విషయంలో మధ్యే మార్గం:
పుణ్య పురుషులు, దైవప్రవక్తలు, దైవ దూతల విషయంలో లేని పవిత్రతను వారికి అంట గట్టడంగానీ, ఉన్న గౌరవాన్ని ఊడబెరకడంగానీ ఇస్లాం చేయదు. దేవుడు ఏ స్థితిలోనయితే వారిని ఉంచాడో ఆ నిజ స్థితిలోనే వారిని గుర్తిస్తుంది. ఏ స్థానంలోనయితే అల్లాహ్‌ా వారిని కూర్చోబ్టెాడో ఆ స్థాయి గౌరవం మాత్రమే వారికిస్తుంది. ఇస్లాంలో కేవలం మనిషి పంచేంద్రియాల పరిధిలోకొచ్చే విశ్వాసాలు మాత్రమే లేవు. అలాగని అన్నీ హేతువుకందని విష యాలూ కావు.
ఆరాధనలో మధ్యే మార్గం:
ఇస్లాం సన్యాస సహిత ధర్మమూ కాదు, అలాగని ప్రపంచానికి మాత్రమే ప్రధాన్యతనిచ్చే జీవన విధానమూ కాదు. ఇహం-పరలోక పంట పొలం అం టుంది ఇస్లాం. అది ఇహపరాల మేలు కలయిక గల ఏకైక ధర్మం. ఇమామ్ అలీ (ర) ఇలా అన్నారు: ”విశ్వాసికి మూడు వేళలు ఉన్నాయి. ఒక వేళలో అతను తన ప్రభువు వేడుకుాండు. ఒక వేళలో అతను జీవనోపాధి కోసం పరిశ్రమిస్తాడు. ఒక వేళలో తన స్వయం సంస్కరణ కోసం, స్వీయ కుటుంబ సుశిక్షణ కోసం కేయిస్తాడు”. ఇహం మరియు పరానికి మధ్య సమతుల్యాన్ని పాటించే సూక్తులు ఖుర్‌ఆన్‌లో అనేకం ఉన్నాయి:
”అల్లాహ్ నీకు ప్రసాదించిన దానితో పరలోక స్థానాన్ని కూడా అన్వేషించు. మరియు నీ ప్రాపంచిక భాగాన్ని కూడా మరువకు”. (అల్ ఖసస్: 77)
”ప్రజల్లొ కొందరు- ప్రభూ! మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు. పరలోకంలోనూ మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు” అని ప్రార్తిస్తారు. (అల్ బఖరహ్: 201)
”తన ఇహాన్ని బాగు చేసుకునే నిమిత్తం తన పరాన్ని పాడు చేసుకున్న వాడు బుద్ధిమంతుడు కాదు” అని ఓ సందర్భంలో అంటే, ”తన పరం కోసం ఇహాన్ని పూర్తిగా త్యజించేవాడు, తన పరాన్ని బాగు చేసుకునే నిమిత్తం ఇహాన్ని పూర్తిగా విడనాడే వాడు మీలో ఉత్తముడు కానేరడు. రెండింకి సమతూకాన్ని పాటించేందుకు ప్రయత్నించాలి. పరానికి చేర్చే సాధనమే ఇహం. కాబ్టి ప్రజల మీద భారంగా తయారవ్వకండి” అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స).
ఇదే నియమాన్ని అల్లాహ్‌ా సకల ఆరాధనలకు వర్తింపజేశాడు. నమాజు గురించి ఆదేశిస్తూ – ”ఓ విశ్వాసులరా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ (పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్‌ా ధ్యానం వైపునకు త్వర పడండి. క్రయావిక్రయాలను వదలి పెట్టండి. మీరు గనక తెలుసుకోగలితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది”. (జుముఅహ్‌ా: 9) తర్వాత ఇలా అనబడింది: ”మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి, అల్లాహ్‌ా అనుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”. (జుముఅహ్: 10)
మహారాధన అయిన హజ్జ్ గురించి ప్రస్తావిస్తూ – ”ఆ తర్వాత మీరు వాిని తినండి. దుర్భర స్థితిలో ఉన్న అగత్యపరులకు కూడా తినిపించండి”. (హజ్జ్: 28)
నడవడికలో మధ్యే మార్గం:
ఇస్లాం మానవ సమాజ అభ్యుదయానికి పనికొచ్చే ఉన్నత నైతిక ప్రమాణాలను బోధిస్తుంది. అది దౌర్జన్యాన్ని ఎండ గ్టినట్లే పిరికితనాన్ని సయితం నిరశిస్తుంది. ఈ రిెంకి మధ్య గల ధీర గుణాన్ని బోధిస్తుంది. అది దుబారా ఖర్చుకి నిరసించినట్లే, పిసనారితనాన్ని సయితం ఎండ గడుతుంది. ఈ రిెంకీ మధ్య ఉన్న మంచి గుణం దానశీలతను అది ప్రోత్స హిస్తుంది.
ధర్మశాస్త్రంలో మధ్యే మార్గం:
శిక్షా బహుమానాల విషయంలో సయితం ఇస్లాం మధ్యే మార్గాన్ని అనుసరి స్తుంది. యూదులు లేని పోని ఆంక్షల్ని తమపై విధించుకున్న కారణంగా వారిలో నిషేధితాలు అధికమయ్యాయి. క్రైస్తవులు అనవసరమయిన వెసులు బాటు వెంపల్రాటలో గత శాస్త్రాల్లోని అనేక నిషేధిత విషయాలను ధర్మసమ్మ తం చేసుకున్నారు. ఇస్లాం మనిషి మనుగడకు అవసరమయిన వాిని ధర్మ సమ్మతం చేసింది. మనిషి మనుగడకు గొడ్డలిపెట్టు కాగలిగే వాిని నిషేధిం చింది. హలాల్, హరామ్‌లను నిర్ణయించే ఆధికారాన్ని అది మనిషికి ఇవ్వ లేదు. అది కేవలం అల్లాహ్‌ా అధికారం అంటుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఆ ప్రవక్త వారిని మంచిని చెయ్యమని ఆదేశిస్తాడు. చెడుల నుండి వారి స్తాడు. పరిశుద్ధ వస్తువులను ధర్మసమ్మతంగా ప్రకిస్తాడు. అశుద్ధమైన వాిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు”. (అరాఫ్: 157) ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్లాం అదేశించని మంచి లేదు. ఇస్లాం వారించని చెడు లేదు. ఇస్లాం కేవలం నైతిక కోణాన్ని మాత్రమే తీసుకోదు. సామాజిక కోణాల్ని సయితం అది తీసుకుంటుంది. వివాహ విషయాన్ని తీసుకున్నట్లయితే, కొందరు లెక్కలేనంత మందిని వివాహమాడొచ్చు అని తీర్మానించుకుంటే, మరికొందరు అసలు వివాహ అవసరమే లేదు, ఉన్నా ఎవరికి ఎంత అవసరం ఏర్పడినా ఒక్క భార్యతోనే సరి పెట్టుకోవాలి అంటారు. ఇస్లాం ఈ రెంటికి మధ్య మధ్యే మార్గాన్ని సూచిస్తుంది.
ఆర్థిక రంగంలో మధ్యే మార్గం:
ఇస్లాం వృధా ఖర్చుని నిషేధించినట్లే పిసినిగొట్టుతనాన్ని సయితం నిషేధి స్తుంది. ఖుర్‌ఆన్‌లోని పలు ఆయతులు ఈ విషయాన్ని విశద పర్చాయి. ”వారు ఖర్చు పెట్టే సమయంలో కూడా అటు మరీ దుబారా ఖర్చు చేయ కుండా, ఇటు మరీ పిసినారితనం కూడా చూపకుండా రెండికీ మధ్య సమతూకాన్ని పాిస్తారు”. (అల్ ఫుర్‌ఖాన్: 67) వేరోక చోట ఇలా ఆదే శించబడింది:”నీ చేతిని నీ మెడకు క్టి ఉంచకు. అలాగని దానిని విచ్చలవిడి గానూ వదలి పెట్టకు. అలా నువ్వు చేశావంంటే నిందల పాలవుతావు. దిక్కు మాలిన స్థితికి లోనయి కూర్చుాంవు”. (ఇస్రా; 29)
అలాగే వ్యాపార లావాదేవీల్లో కొలచి ఇచ్చినా, తూకం చేసి ఇచ్చినా పూర్తిగా ఇవ్వాలని, మోసానికి పాల్పడ రాదని ఉపదేశిస్తుంది. పుచ్చుకునేటప్పుడు పూర్తిగా పుచ్చుకుని, ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇచ్చే ఈ జాఢ్యం ఎంత భయంకరమయినదంటే దాని వాతన పడిన జాతులు ఆర్థిక దోపిడికి, శ్రమ దోపిడి పాల్పడి నైతికంగా దీవాలా తీయడమే కాక, ఒక్కో సందర్భంలో ఆయా భాధిత ప్రజల ఆగ్రహ జ్వాలల్లో మాడి మసవుతూ ఉంారు. అందుకే అల్లాహ్‌ా ఇలా తాకీదు చేశాడు: ”కాబ్టి మీరు కొలతలు, తూనికలలో ఖచ్చి తంగా వ్యవహరించండి. ప్రజలకు వారి వస్తులను తగ్గించి ఇవ్వకండి. సంస్క రణ జరిగిన తర్వాత భూమిలో అల్లకల్లోలాన్ని సృష్టించకండి. మీరే గనక విశ్వాసులే అయితే ఇందులోనే మీ మేలు ఉంది”. (అల్ ఆరాఫ్: 85) అంతే కాదు అలా చేసే వారికి వినాశనం తప్పదని హెచ్చరిస్తుంది కూడా: ”కొలతల్లో, తూనికల్లో తగ్గించి ఇచ్చేవారు నాశనమవుదురు గాక! వారు ప్రజల నుండి కొలచి తీసుకున్నప్పుడు మాత్రం పూర్తిగా-ఖచ్చితంగా తీసుకుాంరు. కానీ వారికి కొలచి గానీ, తూకం వేసిగానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు”. (అల్ ముతఫ్ఫిఫీన్: 1-3)
వ్యక్తిగత విషయంలో మధ్యే మార్గం:
ఈమాన్ మరియు ఆమల్ – విశ్వాసం మరియు ఆచరణ అవిభాజ్యాలు. ఒకదాన్ని వదిలి మరొకి లేదు. విశ్వాస రహిత ఆచరణ, ఆచరణ రహిత విశ్వాసం రెండూ ఫల శూన్యమే. విశ్వాస రహిత ఆచరణ, ఆచరణ రహిత విశ్వాసం మనిషిని కాంక్షా దాసునిగా మార్చి వేస్తాయి. అతను ఏది చేసినా తన మనో వాంఛల్ని అనసరించి చేస్తాడు. అందులో ధర్మానికి, దైవాభీష్టానికి తావుండదు. మనిషి సంఘంలోని భాగం గనక సంఘానికి సేవ చేసుకోవాలి. సంఘాన్ని తన చుట్టు తిప్పుకునే ధోరణిని వీలైనంత త్వరగా స్వస్థి పలకాలి. దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”జ్ఞానం మూడు రకాలు. అది తప్పితే మిగతాది వ్యర్థం. యుక్తితో కూడిన మాట. ప్రయోజనకరమయినా ఆచరణ. న్యాయ బద్ధమయిన విధి”. ఇక ఎవరయితే మాటలకు-చేతలకు మధ్య వైరుధ్యం కలిగి ఉంటూ నీతులు చెబుతూ నీచంగా బతుకుతారో అలాిం వారిని ఇస్లాం గ్టిగానే మంలించింది: ”ఓ విశ్వాసులారా! మీరు చేయని దాని గురించి ఎందుకు చెబుతారు. మీరు చేయని దాన్ని గురించి చెప్పడం అల్లాహ్‌ా సమక్షంలో ఎంతో గర్హించదగినది”. (అస్ సఫ్ప్: 2,3) అలాగే స్వీయ సంస్కరణలో పడి సమాజాన్ని విస్మరించడం, సమాజ సంస్కరణలో పడి స్వయాన్ని ఖాతరు చేయక పోవడం – రెండింనీ ఇస్లాం ఖండిస్తుంది. ఏక సమయంలో మనిషి స్వీయ సంస్కరణ, పోషణపై కూడా పాటు పడాలి. అదే సమయంలో సంఘ సంస్కరణ, పోషణను సయితం విస్మరించ కూడదు.
యాజమాన్య హక్కు;
పెట్టుబడి దారి వ్యవస్థ మనిషి జీవితాన్ని మాత్రమే కేంద్ర బిందువుగా చేసి అతన్ని పచ్చి స్వార్థపరునిగా మార్చి వేస్తే, కమ్యూనిజం సమాజాన్ని మాత్రమే కేంద్ర బిందువుగా పేర్కొంటుంది. ఈ సిద్ధాంతాలు పరిస్థితుల్ని బ్టి రూపొం దాయి అనడంలో సందేహం లేదు. వీటిలో ఒకటి అతి వృష్టి అయితే మరొకటి అనావృష్టి. ఇస్లాం ఈ రెండు అతి వాదాలకి నడుమ మధ్యే మార్గాన్ని సూచిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ మరియు సమాజ ప్రయోజనాల్ని నడమ సమ తూకాన్ని పాటించాల్సిందిగా ఆదేశిస్తుంది. అది మనిషి వ్యక్తిగత ఆస్తి పాస్తులు కలిగి ఉండే అధికారాన్ని అంగీకరించడంతోపాటే అవి అతనికి దైవం ప్రసాదించిన అమానతుగా పేర్కొంటుంది. వాటిని ప్రజా సంక్షేమ మార్గాల్లో ఖర్చు పెట్ట వలసిందిగా పురిగొల్పుతుంది. ఇస్లాం మనిషి రక్తం చిందించడాన్ని నిషేధించి అతనికి జీవించే హక్కునిచ్చింది. మనిషి మానాన్ని పవిత్రమయినదిగా ప్రకించి మనిషికి దక్కాల్సిన గౌరవాన్ని అతనికిచ్చింది. మనిషి ధనాన్ని అన్యుల కోసం నిషేధించి అతనికి యాజమాన్య హక్కు ప్రసా దించింది. మనిషి గృహ, కుటుంబ జీవనానికి పవిత్రతను ఇచ్చి అతని ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వెసులుబాటును అందించింది. ఇస్లాం లో ప్రతి వ్యక్తి కాపలాదారుడే. అతని పోషణ క్రింద ఉన్న వారి గురించి అతన్ని ప్రశ్నిచడం జరుగుతుంది.
పరస్పర సంబంధాలలో మధ్యే మార్గం:
ఇస్లాం పరస్పర సంబంధాలను స్పష్టమయిన పునాదుల మీద నిర్మించ గోరుతుంది. అందులో గుడ్డి అభిమానానికి తావు లేదు. వ్యర్థ వైరానికి చోటు లేదు. ప్రజలు కేవలం అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ పరస్పరం అభిమా నించుకోవాలంటుంది. అలా అభిమానించుకోవడం విశ్వాసపు అత్యుత్తమ స్థాయిగా పేర్కొంటుంది. ”నీ సోదరుడు దుర్మారుగడయినా, దౌర్జన్యానికి గురయిన బాధితుడయినా అతనికే వత్తాసు పలుకు” అన్న అజ్ఞాన కాలపు నానుడికి అది ఇచ్చిన కొత్త భాష్యం – ”నీ సోదరుడు భాధితుడయితే నువ్వు అతని పక్షాన నిలబడి అతనికి బలాన్నివ్వు, ఒకవేళ నీ సోదరు దౌర్జన్యపరు డయి ఉంటే అతను ఆ దుర్మార్గానికి పాల్పడకుండా అతని చెయ్యి పట్టుకొని ఆపు” అన్నది. ఒక్క మాటలోచెప్పాలంటే, రంగం అది ఆర్థికమయినా, ఆధ్యాత్మికమయినా, జాతీయమయినా, అంతర్జాతీయం అయినా, వ్యక్తిగతం అయినా సామాజికం అయినా అన్ని రంగాల్లో, అన్ని అంగాల్లో అందరూ ఆచరించగిగే మధ్యే మార్గాన్ని ఇస్లాం బోధిస్తుంది. అది సర్వకాల, సర్వావస్థల యందు సమస్త మానవాళికి సరయిన దిశా నిర్దేశం చేసి సాఫల్య బాటన నడిపించి ఇహపరాల్లో తిరుగు లేని విజేతలుగా నిలబెడతుంది. అటువిం బృహత్తర ధర్మంలో, మహత్తర జీవన విధానంలో మళ్ళీ మధ్యే మార్గానికై దారులు వెతకడం ఎంత అవివేకమో బుద్ధిజీవులకు తెలియనిది కాదు.