”ఆదం (అ) సంతతికి చెందిన ప్రతి ఒక్కరితోనూ తప్పు జరుగు తుంది. కానీ; తప్పు చేసే వారందరిలోకెల్లా ఉత్తములు తమ తప్పుల దిద్దు బాటుకు ప్రయత్నించినవారు” అన్నారు మహనీయ ముహమ్మద్ (స). తప్పులు అందరి వల్లా దొర్లుతుంటాయి. అది మానవ సహజం. కాని తప్పులను గుర్తించడం, వాటిని సరిదిద్దుకోవడం మాత్రం కొంద రికే సాధ్యం. తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాప పడి, క్షమించమని అల్లాహ్‌ాను వేడుకుంటారు సుగుణవంతులు. తాము చేసినది తప్పే అయినా అర్థరహిత వాదనకు దిగుతూ ఉంటారు మూర్ఖులు. తాము తప్పుల తడికగా మారుతున్నామని తెలిసినా వాటినే మాటిమాటికి చేస్తూ ఉంటారు నీచులు. ఏది ఏమయినప్పటికీ, దాన్ని పాటించేవారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తప్పు అనేది తప్పే; ఎన్నటికి అది ఒప్పు కాజాలదు. మరి అల్లాహ్‌ాకు ప్రియమయిన దాసులెవరో తెలుసా?
”వారు కలిమిలోనూ, లేమిలోనూ (ధర్మమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు. ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబి స్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు”. (ఆలి ఇమ్రాన్: 134)
”వారు తమ ద్వారా ఏదయినా నీతిబాహ్యమయిన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదయినా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్‌ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్‌ా తప్ప పాపాపలను క్షమించేవాడెవడున్నాడు?”. (ఆలి ఇమ్రాన్: 135)
”వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు. తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహిమచే స్వర్గ వనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువమటి సుగుణవంతులకే. వారు అందులో ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేెసేవారికి లభించే పూణ్యఫలం ఎంత చక్కనిది!” (ఆలి ఇమ్రాన్: 136)
మక్కా అవిశ్వాసులు ఎంత అధర్మంగా ప్రవర్తించినా, ఓర్పుతో వాటిని సహించి వారికి సత్యోపదేశం చేస్తుండేవారు ప్రవక్త (స). మక్కా విజయ సందర్భంగా వారందరినీ శిక్షించే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉండి కూడా వారు చేసిన అవమానాలను, తప్పలను పెద్ద మనస్సుతో కమించి, ధర్మానికి, దయకు ప్రతికగా నిలిచారు ప్రవక్త మహనీయలు (స). సత్యప్రచార విషయంలో సత్యప్రియుల యిన సహాబా తాత్కాలికంగా అవమానాలను ఎదుర్కొన్నా, చిత్ర హింసలను భరించినా వారికున్న క్షమా గుణం కారణంగా విజయం వారినే వరించింది.
నిజంగా క్షమించడం అనేది గొప్ప సుగుణం. అవతలివారు తాము చేసింది తప్పు అని తెలుసుకుని క్షమించమని కోరితే క్షమించేంతటి సద్గుణం మనకుండాలి. మనలో క్షమా గుణమే లేకపోతే, తప్పు చేసినవారిని ఎందుకు వదలాలి? పతీకారం తీర్చుకోవాలన్న కసి బలపడుతుంది. తద్వారా మనం శారీరకంగానూ, మానసికంగానూ నష్ట పోతాము. అయితే తనకు మాలిన ధర్మం పనికి రాదన్నట్లే క్షమించే గుణం మనకున్నా, అది అందుకునే యోగ్యత అవతలి వారికి ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని మనం మరచిపోకూడదు. కమాగుణం ఉండాలి కదా అని తప్పులు ఎంత తీవ్రమయినవి అయినా అందరిపై క్షమను ప్రదర్శించకూడదు. అనంత కరణా మయుడు, అపార దయానిధి అయిన అల్లాహ్‌ాయే కొన్ని నేరాలకు శిక్ష అదేశించాడంటే, శిష్ఠ రక్షణ కోసం దుష్ట శిక్షణ కూడా కరుణ లో, దయలో అంతర్భాగమే అని మనం గుర్తించాలి.
ఇక మన విషయానికొస్తే, మన వల్ల జరగరాని తప్పు ఏదయినా జరిగిపోతే ‘నన్ను క్షమించు’ అని మనం అనగలగాలి. ‘ఐయామ్ సారీ’ వినడానికి ఎంతో తేలికగా అన్పించే ఈ మాట, దాని అర్థాన్ని చూస్తే మాత్రం ఎంతో లోతుగా, గంభీరంగా కనిపిస్తుంది. మన అహాన్ని, స్వాభిమానాన్ని వదిలి పెట్టి మనం చేసిన తప్పు అంగీక రించి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరడం మనకు అల్లాహ్ అనుగ్రహిం చిన గొప్ప లక్షణం. ‘ఇతరులు మన తప్పులను మన్నించాల’ని కోరు కునే మనం, మన ఆగ్రహాన్ని, ఆవేశాన్ని మన అధీనంలో ఉంచుకొని, ఎదుటి వారిని క్షమించి ఎప్పటిలాగే వ్యహరించడం అలవాటు చేసుకోవాలి. అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు: ”వారిని క్షమించాలి. వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటీ, అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా? అల్లాహ్ అయితే తప్పులను మన్నించేవాడు. కరుణామయుడు”.
(నూర్: 22)