”అల్లాహ్ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. ఇంకా ఆయనే మీ కోసం పశువుల చర్మాలతో ఇళ్ళను చేశాడు. ప్రయాణ దినాన, విడది చేసిన దినాన కూడా అవి మీకు తేలిగ్గా – అనువయినవిగా ఉంటాయి. ఇంకా వాటి ఉన్నీతోనూ, రోమాలతోనూ, వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామానులను, కొంత కాలం ఉపయోగ పడే వస్తువులనూ తయారు చేశాడు”. (అన్నహ్ల్ల్: 80)
”అల్లాహ్ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. ఇంకా ఆయనే మీ కోసం పశువుల చర్మాలతో ఇళ్ళను చేశాడు. ప్రయాణ దినాన, విడది చేసిన దినాన కూడా అవి మీకు తేలిగ్గా – అనువయినవిగా ఉంటాయి. ఇంకా వాటి ఉన్నీతోనూ, రోమాలతోనూ, వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామానులను, కొంత కాలం ఉపయోగ పడే వస్తువులనూ తయారు చేశాడు”. (అన్నహ్ల్ల్: 80)
ముస్లిం గృహంలో షిర్క్ మరియు హరామ్‌కు సంబంధించిన వస్తువులు ఉండకూడదు
అబూ తల్హా కథనం – నేను ప్రవక్త (స) ఇలా ఉపదేశిస్తుండగా విన్నాను: ”ఏ గృహంలోనయితే కుక్క మరియు చిత్రపటాలు, ప్రతిమలు ఉంటాయో అందులో దైవదూతలు ప్రవేశించరు”. (బుఖారీ, 3225)
హజ్రత్ ఆయిషా (ర) గారి కథనం: ”నిశ్చయంగా ప్రవక్త (స) ఇంట్లో ఎలాంటి చిత్రపటాలను ఉంచేవారు కాదు, వెంటనే తొలగించే వారు”. (బుఖారీ-5953)
ఇంట్లో ప్రవేశించేటప్పుడు సలామ్ మరియు అల్లాహ్ స్మరణ
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
”సో, మీరు ఇండ్లలో ప్రవేశించేటప్పుడు మాత్రం మీ స్వయానికి సలామ్ చేసుకోండి. అది అల్లాహ్‌ా తరఫు నుంచి అవతరించిన, మేలు కొరకు చేయబడిన అభివాదం, ఎంతో శుభకరమయినది, పవిత్రమయి నదీను”. (అన్నూర్: 61) ఈ ఆయతు వ్యాఖ్యానంలో సఅదీ (రహ్మ) అన్నారు: ‘సో, మీరు ఇండ్లలో ప్రవే శించేటప్పుడు’ అంటే వ్యక్తి గృహంతోపాటు ఇతరులు నివసించే గృహాలు కూడా. వాటిలో మనుషులు నివాసం ఉన్నా, లేకపోయినా.
దైవప్రవక్త (స) వారిని ఇలా చెబుతూ ఉండగా నేను విన్నానని హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (ర) గారు పేర్కొన్నారు:
”మనిషి తన ఇంట్లో ప్రవేశించేటప్పుడు మరియు భోంచేసేటప్పుడు అల్లాహ్‌ాను స్మరిస్తే, షైతాన్ (తన అనుయాయుల్ని ఉద్దేశించి) అంటాడు – ‘ఈ రోజు రాత్రి గడిపే సౌకర్యమూ లేదు, రాత్రి భోజన సౌలభ్యమూ లేదు’అని. ఒకవేళ మనిషి ఇంట్లో ప్రవేశించేటప్పుడు అల్లాహ్‌ా స్మరణను మరచిపోతే – షైతాన్ అంటాడు – ‘మీకు రాత్రి గడిపే సౌకర్యం లభించింది’. అదే మనిషి భోంచేటప్పుడు కూడా అల్లాహ్‌ా స్మరణ మరచిపోతే, ‘మీకు రాత్రి గడిపే సౌకర్యమూ, రాత్రి భోజన ఏర్పాటు జరిగిపోయింది’ అంటాడు షైతాన్. (ముస్లిం – 5381)
ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అల్లాహ్ స్మరణ
హజ్రత్ అనస్ (ర) కథనం-దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ఎవరయితే ఇంటి నుండి బయలుదేరేటప్పుడు – ‘బిస్మల్లాహి తవక్కల్‌తు అలల్లాహి వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అజీమ్” అని పలుకుతాడో, అతనితో ఇలా అనబడుతుంది:
‘ఇది నీకు సరి పోతుంది, నీకు రక్షణ ఇస్తుంది’ అని. మరియు అతన్నుండి షైతాన్ ప్రక్కకు జరిగి పోతాడు. (తిర్మిజీ- 3426)
ఇతరుల ఇండ్లలో ప్రవేశించేటప్పుడు
బనూ ఆమిర్ తెగకు చెందిన ఓ వ్యక్తి, ప్రవక్త (స) ఇంట్లో ఉండంగా ఆయనతో అనుమతి కోరుతూ ‘నేను దూరనా?’ అన్నాడు. అందుకు ప్రవక్త (స) తన సేవకుణ్ణి ఉద్దేశించి-”చూడు! నువ్వా వ్యక్తి వద్దకు వెళ్ళి అనుమతి ఎలా కోరాలో నేర్పించు. ముందు అస్సలాము అలైకుమ్ అనాలని, తర్వాత నేను ప్రవేశించవచ్చా? అని అడగాలని చెప్పు” అన్నారు. ఇది విన్న ఆ వ్యక్తి అస్సలాము అలైకుమ్, నేను ప్రవేశించ వచ్చా? అని అనుమతి కోరగా, ప్రవక్త (స)అనుమతి ఇచ్చారు. ఆ వ్యక్తి లోనికి ప్రవేశించాడు. (అబూ దావూద్ – 5179) వేరొక ఉల్లేఖనంలో – ”అనుమతి మూడు సార్లు మాత్రమే. అనుమతి లభిస్తే సరి, లేదంటే తిరిగి వెళ్ళిపో” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం- 5753) (మరిన్ని ఆదాబులు నూర్ సూరా 28-29లో చూడగలరు).
ఇంట్లో ఖుర్‌ఆన్ పారాయణం
హజ్రత్ అబూ హురైరా (ర) కథనం-దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీరు మీ ఇండ్లను ఖననవాటికలుగా చేయకండి. నిశ్చయంగా ఏ ఇంట్లోన యితే సూరతుల్ బఖరహ్‌ా చదవబడుతుందో దాన్నుండి షైతాన్ పారి పోతాడు”. (సహీహ్ ముస్లిం-1860)
తన తల్లి తనతో ఇలా అన్నారని మన్సూర్ బిన్ సఫియ్యా పేర్కొన్నారు-హజ్రత్ ఆయిషా (ర.అ) ఇలా విశద పర్చారు:
”నేను బహిస్టుతో ఉన్నప్పుడు ప్రవక్త (స) నా ఒడిలో పడుకొని ఖుర్‌ఆన్ పారాయణం చేసే వారు”. (సహీహ్‌ా బుఖారీ-297)
ఇంట్లో నఫిల్ ఆరాధనలు
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (ర) కథనం-దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు:
”మీరు మీ నమాజుల్లో నుండి కొంత మీ ఇండ్లలో సయితం చదవండి. వాటిని ఖనన వాటికలుగా చేయకండి”. అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). (సహీహ్ బుఖారీ-432)
హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (ర) గారి కథనం-దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు:
”ప్రజలారా! మీ ఇండ్లల్లో నమాజు చదవండి. మనిషి చేసే నమాజుల్లో ఫర్జ్ నమాజు మినహా, మహత్తరమయినది అతను తన ఇంట్లో చదివే నమాజు” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ-731)
విస్వాసుల మాత హజ్రత్ ఆయిషా (ర) ప్రవక్త (స) వారి రాత్రి ఆరాధన గురించి ఇలా అన్నారు: ”నేను ప్రవక్త (స) వారి ఎదుట కూర్చుని ఉండేదాన్ని.. నా రెండు కాళ్ళు ఆయన వైపు ఉండేవి. ఆయన సజ్దా చేెసేటప్పుడు వాటిని మడిచి పెట్టుకునేదానిని, ఆయన సజ్దా నుండి లేచాక మళ్ళీ పరచుకునేదానిని. ఆ నాడు ఇండ్లల్లో దీపాలుండేవి కావి”. (సహీహ్‌ా బుఖారీ – 382)
ఇంట్లో అల్లాహ్ స్మరణ
”అల్లాహ్ స్మరణ చేయబడే గృహం మరియు అల్లాహ్‌ా స్మరణ చేయ బడని గృహం ఉపమానం జీవం, మరియు మరణం వంటిది” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం-1859)
పిల్లలు మరియు అనుమతి
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
”విశ్వసించిన ఓ ప్రజలారా! మీ అధీనంలో ఉన్న మీ బానిసలుగానీ, ఇంకా ప్రాజ్ఞ వయస్సుకు చేరని మీ పిల్లలుగానీ మూడు వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి. ప్రజ్ నమాజుకు పూర్వం. మధ్యాహ్నం (జుహ్ర్‌ా) వేెళ మీరు బట్టలు విడిచినప్పుడు, ఇషా నమాజు తర్వాత! ఈ మూడు వేళలు మీరు ఏకాంతంలో ఉండే వేళలు. ఈ మూడు వేళలన్ని మినహాయిస్తే (రాకపోకలు సాగించడంలో) మీపై గానీ, వారిపైగానీ ఎలాంటి దోషం లేదు. (ఎందుకంటే) మీరు తరచూ ఒండొకరి దగ్గరకు వస్తూ పోతూ ఉండవలసిన వారే. ఈ విధం గా అల్లాహ్‌ా తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్‌ా సంపూర్ణ జ్ఞాని మరియు పరిపూర్ణ వివేకవంతుడు. మరి మీ పిలల్లలు (కూడా) ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్న తరువాత వారి పెద్దలు అనుమతి పొందినట్లే వారు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లాహ్‌ా ఈ విధంగా తన ఆదేశాలను మీకు విశద పరుస్తున్నాడు. అల్లాహ్‌ాయే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు. పెళ్ళి కోరిక లేని వృద్ధ మహిళలు – తమ అందాలంకరణలు ప్రదర్శించే ఉద్దేశ్యం లేకుండా – తమపై దుప్పట్లను తీసేసినా తప్పు లేదు. అయినా కూడా వారు జాగ్రత్త వహిస్తే అది వారికే శ్రేయస్కరం. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు”. (అన్నూర్: 58-60)
వారి పడకలను వేరు పర్చండి
అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రితో, ఆయన తన తండ్రితో అందించిన కథనం – దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు:
”మీరు మీ పిల్లల్ని ఏడేండ్లు నిండగానే నమాజుకై ఆదేశించండి. పదేండ్లకు చేరుకొని కూడా వారు నమాజు చేయకపోతే వారిని మందలించండి. అలాగే వారి పడకలను వేరు పర్చండి”. (అబూ దావూద్-495)
ముస్లిం గృహంలో మిడియా పరికరాలు: అనుగ్రహము మరియు అనర్థమూను
ఈనాడు మీడియా పరికరాలు (టీవీ, అంతర్జాలం, రేడియో, పత్రికలు, వ్యాసాలు) లేని ముస్లిం ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఇవి ఒక ఇంటిని, ఇంటివారిని బాగు చేయడంలో, పాడు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రపతి ముస్లిం వీలయినంతగా తన ధర్మాన్ని, పరివారాన్ని వీటి కీడు నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అల్లాహ్‌ా ఇలా ఉపదేశి స్తున్నాడు: ”ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబీకుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. మనుషులు మరియు రాళ్ళు దాని ఇంధనంగా ఉంటారన్న (విషయాన్ని స్మరించకండి)”. (తహ్రీమ్: 6)
ఈ పరికరాల మాధ్యమంగా చేెరవేయబడే సమాచారం క్రింద ఇవ్వబడిన విధంగా ఉంటుంది:
1) ప్రయోజనకరమయిన కార్యక్రమాలు, సమాచారం – దీని ద్వారా దాసుడికి పుణ్యం లభిస్తుంది.
2) అనుమతించబడిన కాలక్షేపం. దీని వల్ల పణ్యమూ లభించదు, పాపము అంటదు.
3) రేపు ప్రళయ దినాన శాపాలుగా పరిణమించే కార్యక్రమాలు, సమాచారం.
కాబట్టి యుక్తిపరుడయిన ముస్లిం ప్రధానమయిన, ప్రయోజనకరమయిన వాటి కోసం పాటు పడాలి. అనుమతించబడిన వాటికి అవసరం ఉంటే తప్ప అలవాటు పడకూడదు. నిషేధించ బడిన వాటి దరిదాపులకు సయితం పోకుండా జాగ్రత్త వహించాలి.
ఇంట్లో నిద్రకు ముందు పాటించాల్సిన హదీసుల్లో పేర్కొనబడిన అంశాలు
సాలిమ్ (ర) తన తండ్రితో, ఆయన ప్రవక్త (స)తో చేసిన కథనం – ప్రవక్త (స) అన్నారు: ”మీరు పడుకునేటప్పుడు మీ ఇళ్ళల్లో నిప్పును కాలుతూ వదలకండి”. (మత్తఫఖున్ అలైహి)
హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”పాత్రలకు మూత పెట్టండి. తలుపులు మూసి వేయండి. దీపాలు ఆర్పి వేయండి. కొన్ని సంద ర్భాల్లో చిట్టెలుక చేష్టల వల్ల ఇల్లు, ఇంటి వారు తగులబడిపోయే ప్రమాదం ఉంది”. (సహీహ్ బుఖారీ – 6295)
హజ్రత్ జాబిర్ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”రాత్రి మీరు పడుకునేటప్పుడు దీపాలు ఆర్పి వెయండి. తలుపులు మూసి వేయండి. కూజాలకు మూత పెట్టండి. ఆహారపానీయాలను కప్పి ఉంచండి”. (సహీహ్ బుఖారీ-5624)
ముస్లిం హథీసు గ్రంథంలో ఇలా ఉంది: ”ఒకవేళ మీలో ఎవరికయినా పాత్రపై మూత పెట్ట డానికి ఏమి దొరకనప్పుపడు ఒక్క కర్రను అయినా సరే అల్లాహ్‌ా నామాన్ని స్మరించి పెట్టగలి గితే పెట్టండి. నిశ్చయంగా చిట్టెలుక ఇంటివారి సమేతంగా ఇల్లును తగుల బెడుతుంది”.
నిద్రకు ఉపక్రమించేటప్పుడు చేసే కొన్ని దుఆలు
హజ్రత్ అబూ హురైరా (ర) కథనం:”నిశ్చయంగా దైవప్రవక్త (స) ఇషాకు ముందు పడుకోవడాన్ని, ఇషా తర్వాత మాట్లాడటాన్ని ఇష్ట పడేవారు కాదు”. (సహీహ్ బుఖారీ)
హజ్రత్ అబుద్దర్దా (ర) కథనం: ”నిద్రకు ఉపక్రమించడానికి వస్తూ రాత్రి లేచి ప్రార్‌తన చేస్తానన్న సంకల్పం చేసుకొని తర్వాత ఫజ్ర్ వెళ వరకు నిద్ర లేవలేక పోతే అతని సంకల్పానికనుగుణంగా అతనికి పుణ్యం లభిస్తుంది. అతని నిద్ర అతని ప్రభువు తరఫు నుండి అతనికి సత్కార్యంగా పరిణమిస్తుంది” అన్నారు ప్రవక్త (స). (సహీహ్ అత్తర్‌గీబ్ వత్తర్హీబ్)
హజ్రత్ అబూ హురైరా (ర) కథనం: దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”మీలో ఎవరయిన తన పడక మదకు చేెరాలనుకుంటే దాన్ని, దుప్పటిని బాగా విదిలించాలి. వాటి లోపల ఏముందో బహుశాఅతనికి తెలియకపోవచ్చు”. (సహీహ్ బుఖారీ-6320)
హజ్రత్ హుజైఫా (ర) కథనం: దైవప్రవక్త (స) పడకపై మేను వాల్చిన మీదట ”బిస్మక అమూతు వ అహ్యా” అనేవారు. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ”అల్‌హమ్దు లిల్లాహిల్లజీ అహ్యానా బఅద మా అమాతనా వ ఇలైహిన్నుషూర్” అనేవారు.
హజ్రత్ బర్రా బిన్ ఆజిబ్ గారి (ర) కథనం: దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”నీవు నీ పడక మిదకు చేరకోవాలనుకున్నప్పుడు నమాజు కోసం వుజూ చేసేలా వుజూ చేసుకో. తర్వాత నీ కుడి ప్రక్కకు తిరిగి పడుకో. పిదమ ”అల్లాహుమ్మ అస్లమ్తు వజ్హీ ఇలైక, వ ఫవ్వజ్‌తు అమ్రీ ఇలైక. వ అల్‌జఅతు జహ్రీ ఇలైక. రగ్‌బతవ్ వ రహ్బతన్ ఇలైక. లా మల్జఅ వలా మన్‌జఅ ఇల్లా ఇలైక. అల్లాహుమ్న ఆమన్తు బికితాబికల్లజీ అన్‌జల్‌త, వ నబియ్యికల్లజీ అర్‌సల్‌త”. ఇది చదివి ఆ రాత్రే నీకు మరణం వస్తే నీవు ప్రకృతి ధర్మంపై మరణించినట్లు. కాబట్టి నీ చివరి పలుకులు ఇవి అయి ఉండేటట్లు చూసుకో!”. ఉల్లేఖకులు అంటున్నారు – నేను ఈ దుఆ చదువుతూ ”అల్లాహుమ్న ఆమన్తు బికితాబికల్లజీ అన్‌జల్‌త”కు చేెరుకున్నప్పుడు ‘వ బి రసూలిక’ అన్నాఉ. అందుకాయన (స) లేదు, వ బి నబియ్యికల్లజీ అర్‌సల్‌త’ అనే చెప్పు” అన్నారు. (ముత్తఫఖున్ అలైహి) –
నిద్ర నుండి మేల్కొనే ఆదాబులు
హజ్రత్ అబూ హురైరా (ర) కథనం-దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీలో ఒకరు నిద్రించే సమయంలో షైతాన్ అతని తల వెనుక భాగం మిద ముడు ముడులు వేస్తాడు. ప్రతి ముడి మీద ”నీ దగ్గర సుదీర్ఘ రేయి ఉంది, గాఢంగా నిద్రపో’ అని మంత్రిస్తాడు. దాసుడు నిద్ర మేల్కొని అల్లాహ్‌ాను స్మరిస్తే ఒ ముడి విప్పుకుంటుంది. తర్వాత వుజూ చేస్తే మరో ముడి విప్పుకుంటుంది. ఆనత అతను నమాజు చదివితే ఉన్న ఆ ఒక్క ముడి కూడా పటాపంచలవుతుంది. అప్పుడు దాసుడు స్వచ్ఛమయిన మనస్సతో రెట్టింపు ఉత్సాహంతో ఉదయం చేస్తాడు. అలా జరగని పక్షంలో అశుద్ధ మనస్కుడయి, పరమ సోంబేరిలా ఉదయం చెస్తాడు”.(ముత్తఫఖున్ ఆలైహి)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) కథనం: నిశ్చయంగా దైవప్రవక్త (స) తన సతీమణి (ఆయన పిన తల్లి) హజ్రత్ మైమూనా దగ్గర రాత్రి బస చేశారు. ఆయన అంటున్నారు: ”సగం రాత్రి గడిచాక, దానికన్నా కొంచెం ముందు లేదా కాస్త తర్వాత – దైవప్రవక్త (స) మేల్కొన్నారు. తన ముఖం నుండి నిద్ర మత్తును దూరం చేసిన మీదట సూరతుల్ ఆల్ ఇమ్రాన్‌లోని చివరి పది ఆయతులు చదివారు”. (సహీహ్‌ా బుఖారీ-183)
హజ్రత్ హుజైఫా (ర) కథనం: ”రాత్రి దైవప్రవక్త (స) నిద్ర మేల్కొంటే ముఖాన్ని తుడుచుకొని, మిస్వాక్‌తో పల్లు తోమేవారు”. (మ్తుఫఖున్ అలైహి)
సాధారణ మర్యాదలు
హజ్రత్ అబూ హురైరా (ర) కథనం-ఆయన ఇలా అన్నారు: ‘ఓ వ్యక్తి ప్రవక్త (స) వారి గదికి గల రంధ్రం గుండా తొంగి చూస్తున్నాడని తెలుసుకున్న ఆయన చేతిలో తల గీకేందుకు ఉపయోగించే కర్ర ఉంది. అతన్నుద్దేశించి ఇలా అన్నారు: ”నువ్విలా తొంగి చూస్తున్నావని నాకు తెలిసి ఉంటే ఈ కర్రతో నీ కంటిలో పొడిచేవాడను. నిశ్చయంగా అనుమతి కోరడం అనేది ఈ చూపు కోసమే పెట్టబడింది” అని మందలించారు. (సహీహ్ బుఖారీ-6241)
హజ్రత్ అబూ మస్‌వూద్ (ర) కథనం- మమ్మల్ని ఉద్దేశించి ప్రవక్త (స) ఇలా అన్నారు:”మీలో ఎవరు ఇంకొరి ఇంటికెళ్ళినప్పుడు అనుతి లభిస్తే, ఉంటే తప్ప ఇమామత్ చేయించడంగానీ, అధికారిగా వ్యవహరించడంగానీ, ఆ ఇంటి యజమాని ప్రత్యేక పరుపు (చాప, కుర్సీ) మీద కొలువుదీర డంగానీ చెయ్యకూడదు సుమా!”. (సహీహ్‌ా ముస్లిం-1566)
హజ్రత్ ఉక్బా బిన్ ఆమిర్ (ర) కథనం – ప్రవక్త (స) ఇలా అన్నారు:”జాగ్రత్త! స్త్రీలున్న చోట మీరు వెళ్ళకండి”. అది విన్న అన్సారులలోని ఓ వ్యక్తి – ‘ఓ దైవప్రవక్తా! మరది గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ (అంటే మరిది వెళ్ళొచ్చా? అని.) అందుకు ప్రవక్త (స) వారన్నారు: ”మరది (వదిన పాలిట) మరణం”. (సహీహ్‌ా బుఖారీ-5232)