తల ఛిద్రమయిపోయిన తొమ్మిది నెలల చిన్నారిని హత్తుకుని గుండెలవిసేలా ఏడిస్తున్న తండ్రి…సముద్ర తీరానా సరదాగా ఫుట్‌బాల్ ఆడుకుంటున్న నలు గురు పిల్లలకు బాంబు దాడిలో నూరేళ్ల నిండపోతే కంటిబిగువున కన్నీళ్ళాపుకుంటూ నివాళులర్పిస్తున్న దృశ్యం…. శరీరంలోని ప్రధాన భాగాలకు ప్రమాదం తృటిలో తప్పినా బుల్లెట్లతో తూట్లు పడిన మరో బాలుడి దేహం…పసికందులు మొదలు పండు ముదుసలి వరకూ రక్తమోడుతూ ఆస్పత్రులకు, అనంత లోకాలకు తరలిపోతున్న దృశ్యం….ఇది నిన్నటి వరకు ఫాలస్తీనా స్థితి.
అసలు ఈ ప్రాంతపు పూర్వపరాలేమిటి? అక్కడి ప్రజలు ఆత్మరక్షణ దాడి చేసేందుకు వారి వద్ద ఆధునిక మారణాయుధాలు లేకపోయినా రోడ్డుపై పడి ఉన్న రాళ్లతో పోరాడేలా వారిని ఏ విషయం ప్రేరేపిం చింది? అసలు వారు ఏం కోరుకుంటున్నారు? తెలియాలంటే వివరా ల్లోకి వెళ్ళి తిరాల్సిందే!!
కన్‌ఆన్-ఫాలస్తీనా:
పూర్వం ఫాలస్తీనాను ‘కన్‌ఆన్’ భూభాగంగా పిలిచే వారు. ఎందుకంటే క్త్రీ.పూ 2500 సంవత్సరాల క్రితం అరబ్బు ప్రాంతం నుండి కన్‌ఆన్ అనబడే తెగ వలస వచ్చి ఇక్కడ స్థిర పడ్డారు. వారి తర్వాత క్త్రి.పూ 1200 యేండ్లకు క్రీతీ తెగలు కొన్ని కన్‌ఆన్ భూ భాగంపై దండయాత్ర చేసి, గాజా మరియు బాఫాల మధ్యనున్న తీర ప్రాంతాన్ని కైవసం చేసుకొని నివాసముండసాగారు. కన్‌ఆన్ మరియు క్రీతీ తెగల కలయికతో ఈ ప్రాంతం పేరు ఫాలస్తీనాగా ఏర్పడింది. ఈ ప్రాంతాన్నే బైతుల్ మఖ్దిస్ మరియు బైతుల్ ముఖద్దస్ అంటారు.
ఫాలస్తీనా వైపు ఇస్రాయీల్ ప్రజల వలస:
బైతుల్ ముఖ్దిస్‌ను అల్లాహ్ పవిత్ర క్షేత్రంగా పేర్కొనడం చేత ప్రవక్తల పితామహులయిన హజ్రత్ ఇబ్రాహీమ్ (అ) ఇరాక్ వదలి ఈ పవిత్ర భూభాగం వైపునకే వలస వెళ్ళారు. ఆయన సతీమణి సారా మరియు ఇస్హాఖ్ (అ)ను అక్కడ వసిం పజేసి, అల్లాహ్ ఆజ్ఞ మేరకు రెండో సతీమణి హాజిరా మరియు ఇస్మా యీల్ (అ)లను మక్కాలో వదలి వచ్చారు. ఆయన (అ) తర్వాత హజ్రత్ ఇస్మాయీల్ (అ) మక్కా పరిసరాల్లో ధర్మకార్యం చేపడితే, షామ్ ప్రాం తంలో హజ్రత్ ఇస్హాఖ్ (అ) ప్రవక్త బాధ్యతల్ని నిర్వర్తించారు. ఆయనకు పుట్టిన సజ్జన సంతానమే ప్రవక్త యాఖూబ్ (అ). అలా ఇస్రాయీల్ సంతతికి మూల పురుషుడయినా దైవప్రవక్త హజ్రత్ యాఖూబ్ (అ) బైతుల్ మఖ్దిస్‌లో ఉండేవారు. అయితే హజ్జ్ నిమిత్తం గత ప్రవక్తలం దరూ మక్కా ప్రయాణం చేసేవారు. ప్రవక్త యూసుఫ్ (అ) ఈజిప్టులో నాయకత్వం వహిస్తున్నప్పుడు ఇస్రాయీల్ (యాఖూబ్-అ) సంతతి వారందరూ ఈజిప్టుకు తరలి పోయారు. తర్వాత ప్రవక్త మూసా (అ), నియంత ఫిర్‌ఔన్ బారి నుండి వారిని కాపాడేందుకు రాత్రికి రాత్రే అక్కడి నుండి అల్లాహ్‌ా ఆదేశం మేరకు తరలించేంత వరకూ వారు అక్కడే ఉండేవారు. అంటే దాదాపు క్త్రీ.పూ 200.
ఆ రోజుల్లో బైతుల్ ముఖద్దస్‌పై అమాలఖా జాతి అధికారం ఉండేది. అదొక వీర జాతి. వారిలో శౌర్యం, పరాక్రమం మెండుగా ఉండేది. బైతుల్ ముఖద్దస్ వెళ్ళాలన్నది అల్లాహ్‌ా ఆదేశం. అలా వెళ్ళాలంటే అమాలఖాతో పోరాడటం తప్ప మార్గాంతరం లేదు. ఖుర్‌ఆన్ ఆ సంఘ టనను ఇలా పేర్కొంటుంది: ”మూసా (అ) తన జాతి వారినుద్దేశించి చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి!..’నా జాతివారలారా! అల్లాహ్‌ా మీకు రాసి పెట్టిన ఈ భూభాగంలో ప్రవేశించండి. వెన్ను చూపి పారి పోకండి. వెన్ను చూపారంటే మీరే నష్ట పోతారు”. (అల్ మాయిదా:20, 21)
ఇస్రాయీల్ సంతతికి చెందిన ప్రజలు ప్రవక్త మూసా (అ) గారి సారథ్యంలో ఈజిప్టు నుండి బయలుదేరి షామ్ మీదుగా బైతుల్ ముఖద్దస్ వైపు వెళ్లారు. ఆ ప్రాంతాన్ని సమీపించాక అల్లాహ్‌ా ఆదేశం మేరకు హజ్రత్ మూసా (అ) బైతుల్ ముఖద్దస్‌లో ప్రవేశించాల్సిందిగా ఇస్రాయీల్ ప్రజల్ని కోరారు. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్ ఇలా పేర్కొంటుంది: కాస్త ధైర్యం చేసి ఆ పుణ్యక్షేత్రంలోకి ప్రవేశిస్తే అల్లాహ్‌ా తోడ్పాటుతో అది తమ సొంతమవుతుందని ప్రవక్త మూసా (అ) శుభ వార్త విన్పించినా అమాలఖాతో పోరాడటానికి ఇస్రాయీల్ ప్రజలు సాహసించ లేదు. ఇలా అన్నారు: ”మూసా! అక్కడ మహా కర్కశులు, బలవంతులు ఉన్నారు. వారక్కడి నుండి వెళ్ళిపోనంత వరకూ మేము అందులో ప్రవేశించేది లేదు. ఒకవేళ వారు వెళ్ళిపోతే మాత్రం మేమం దులో తప్పకుండా ప్రవేశిస్తాము”. (అల్‌మాయిదా: 22) అంటే, వారు దైవ ప్రవక్త మూసా (అ) పట్ల అవిధేయత చూపడమేకాక, అల్లాహ్‌ా వాగ్దానాన్ని సయితం త్రోసి పుచ్చారు. పైగా ఇలా అన్నారు:”ఓ మూసా! (నువ్వెంత చెప్పినా) వారు అక్కడ ఉన్నంత వరకూ మేము సుతరామూ అక్కడికి వెళ్లబోము. కావాలంటే నువ్వు నీ ప్రభువు పోయి ఉభయులూ వారితో పోరాడండి. మేమిక్కడే కూర్చుని ఉంటాము”. (అల్‌మాయిదా:24)
కీలక సమయంలో వారు కనబర్చిన పిరికితనానికి, అవిధేయతకు బదులుగా అల్లాహ్‌ా ఆ భూభాగాన్ని 40 యేండ్ల వరకు వారిపై నిషేధించాడు. ”ఇక ఈ భూమి వారి కోసం నలభై సంవత్సరాల దాకా నిషేధించబడింది. వారు ఎక్కడా నిలువ నీడ లేకుండా నేలపై తచ్చాడు తూ తిరుగుతుంటారు. కనుక నీవు ఈ అవిధేయ జనుల విషయంలో దుఃఖించకు”. (అల్ మాయిదా: 26)
ప్రవక్త మూసా (అ) మరియు ప్రవక్త హారూన్ (అ) వారి మరణానం తరం పాత తరం మొత్తం నశించింది. కొత్త తరం, కొత్త రక్తాన్ని తోడు పెట్టుకుని ప్రవక్త మూసా (అ) వారి ప్రతినిధి యోషా బిన్ నూన్ బైతుల్ మఖ్దిస్‌లో ప్రవేశించి, ‘అరీహా’ ప్రాంతంలో అమాలఖాతో తల పడి వారిని ఓడించి బైతుల్ మఖ్దిస్‌లో ప్రవేశించారు. యోషా బిన్ నూన్ మరణానంతరం హజ్రత్ తాలూత్ ఆయన తర్వాత ప్రవక్త దావూద్ (అ), ప్రవక్త సులైమాన్ (అ) 50 సంవత్సరాలు వారి సారథ్యం వహించారు. ఆయన తర్వాత ఫాలస్తీనా రెండు భాగాల్లో విడిపోయింది.
1) ఉత్తరాన యహూదా-దీని రాజధాని ‘జెరూషలెమ్’.
2) దక్షిణాన ఇస్రాయీల్ – దీని రాజధాని ‘షికీమ్’.
పై వివరాల్ని బట్టి తెలిసేదేమిటంటే, ప్రవక్త ముసా (అ) మరియు యోష బిన్ నూన్ తర్వాత ఇస్రాయీల్ ప్రజలు సత్య బాటను వీడి, అపమార్గం పాలయ్యారు. ఉజైర్ (అ) దైవ కుమారునిగా ప్రకటించారు. ప్రవక్తలు సమస్త మానవాళికి ప్రబోధించిన ధర్మం ఇస్లాం అయితే వారు యహూదా అనే వ్యక్తి పేరుతో యూద మతాన్ని కల్పించారు. వారి సంసర్కరణార్థం ప్రభవింపజేయబడిన ప్రవక్త దావూద్ (అ) గాని, ఆయన తర్వాత ప్రవక్తగా వచ్చి హజ్రత్ సులైమాన్ (అ) గాని ఇద్దరూ ముస్లిములే. ‘నా జాతివారలారా! అల్లాహ్‌ా మీకు రాసి పెట్టిన ఈ భూ భాగంలో ప్రవేశించండి’ అని ప్రవక్త మూసా (అ) చెప్పింది ఇస్రాయీల్ జాతి ప్రజల్లో అల్లాహ్‌ను ఆయన ప్రవక్తను విశ్వసించిన వారినుద్దేశించే గాని అవిశ్వాసుల్ని ఉద్దేశించి చెప్పబడిన మాట కాదు. ఈ కారణంగానే అల్లాహ్‌ాను ఆయన ప్రవక్తను విశ్వసించినప్పటికీ ధర్మపొరాట విషయ మయి వైముఖ్యం కనబరచిన కారణంగా 40 యేండ్ల వరకు ఆ భూ భాగం వారి కోసం నిషేధించబడింది. అనగా ఈ భూభాగంలో మొదట ప్రవేశించిన వారు అరబ్బు కాగా తర్వాత ప్రవేశించిన వారు క్రీతీ తెగలు అవగా ఆనక చాలా తర్వాత ప్రవేశించిన వారు ఇస్రాయీల్ జాతి ప్రజలు. ఆ తర్వాత చాలా కాలానికి ఇస్రాయీల్ జాతి ప్రజల్లో అపమార్గం పాలైనవారు యూదులు. ఎలా తీసుకున్నా యూదులు ఈ ప్రాంత మూల వాసులు కారు. ఒక్క మాటలో చెప్పాలంటే దైవధిక్కారు లకు ఈ భూభాగంలో ప్రవేశించే అర్హత లేదు.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి అనంతరం ఫాలస్తీనా విజయం:
అంతిమ దైవప్రవక్త (స) వారి మరణించిన కాలం నాటికి ఈ ప్రాంతం రోముల హస్తగతమయి ఉండేది. కాబట్టి ఈ ప్రాంతం వైపు ప్రవక్త ముహమ్మద్ (స) వారు హజ్రత్ ఉసామా బిన్ జైద్ (ర) గారి సారథ్యంలో పంపిన సైన్యం ప్రవక్త (స) వారి మరణానంతరం ప్రథమ ఖలీఫా అబూ బకర్ (ర) గారి హయాంలో ఉర్‌దున్ దరి దాపుల వరకు విజయ ధుంధుభిని మ్రోగించి కొన్ని అనివార్య పరి స్థితుల వల్ల మదీనా తిరిగి రప్పించబడింది.
చివరికి ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) గారి హయాంలో బైతుల్ మఖ్దిస్ ప్రజలు మరియు హజ్రత్ ఉమర్ (ర) గారి మధ్య సంధి ఒప్పందంతో ఈ ప్రాతం ఇస్లామీయ పరిపాలనా విభాగంలోకి వచ్చింది. తర్వాత కల్లోల జనకులైన యూదులు ఆ ప్రాంతంలో ఉండకూడదన్న ఫర్మానా జారీ చేయడం జరిగింది. ఫాలస్తీనా ప్రాంతం పై పూర్తి స్థాయి విజయానంతరం ఆ ప్రాంతం పవిత్ర భూభాగం అవడం చేత అనేక అరబ్బు తెగలు అక్కడికెళ్లి నివాసమేర్పచుకున్నారు. క్రమేణా అరబ్బేతర తెగలు సయితం అరబ్బు తెగల్లో విలీనమయి పోయారు. చివరిగా ఈ ప్రాంతమంతా పూర్వంలా పూర్తి అరబ్బు ప్రాంతం అయిపోయింది. ఉమవీ పరిపాలనా కాలంలో ఫాలస్తీనా దమాస్కస్ పరిధిలోకి వచ్చింది. ఆ కాలనికి చెందిన నిర్మాణాల్లో ‘ఖుబ్బతుస్సఖరా – డోమ్ ఆఫ్ ది రాక్’ ఒకటి. దీన్ని హిజ్రీ శకం 70వ సంవత్సరంలో అబ్దుల్ మలిక్ బిన్ మర్వాన్ నిర్మించాడు. తర్వాత అబ్బాసీ పరిపాలనా కాలంలో ఫాలస్తీనా ఇరాక్ ప్రభుత్వం క్రింద ఉండేది. ఆనక ఫాతిమీల పరిపాలనా కాలం లో ఈ ప్రాంతాన్ని ఈజిప్టు ప్రభుత్వ పరిధిలోకి తేవడం జరిగింది.
ఫాలస్తీనా మరియు క్రూసెడులు:
హిజ్రీ శకం 476, క్రీ.శ 1097లో యూరప్ పాస్టర్లు ఉసికొల్పడంతో వివిధ ప్రాంతాల నుండి 1లక్ష 50 వేల మంది క్రైస్తవులు ఫాలస్తీనా వైపు బయలుదేరారు. ప్రవక్త ఈసా (అ) గారి సమాధిని ముస్లింల వద్ద నుండి లాక్కోవాలన్నది వారి లక్ష్యం. అలా బయలుదేరిన ఈ సైన్యం దారిలో తారస పడిన ప్రతి ముస్లిం వాడలను ధ్వసం చేస్తూ ఫాలస్తీనా చేరుకున్నారు. అప్పటికే సుల్‌జూఖీస్‌లతో యుధ్దాలు చేసి పూర్తి పతనావస్థలో ఉన్న ఫాతిమీల సైన్యం క్రైస్తవుల్ని ఎదుర్కోలేక పోయింది. ఫలితంగా హిజ్రీ శకం 478, క్రీస్తు శకం 1099లో బైతుల్ మఖ్దిస్ క్రైస్తవుల కైవసం అయింది. ఆ తర్వాత హిజ్రీ శకం 670 క్రీ.శ 1291లో సుల్తాన్ సలాహుద్దీన్ అయ్యూబీ నాయకత్వంలో మళ్ళీ ఈ ప్రాంతం ముస్లింల హస్తగతం అయింది. అప్పటి నుండి హిజ్రీ శకం 1000 ప్రారంభం వరకు ఈ ప్రాంతం ఈజిప్టు పరిపాలనా పరిధిలో ఉండింది.
ఫాలస్తీనా ఉస్మానీల హయాంలో:
హిజ్రీ శకం 923 క్రీ.శ 1517లో ఉస్మానీ తుర్కుషులు ఈజిప్పుపై విజయం సాధించిన తర్వాత ఫాలస్తీనా ఉస్మానియా పరిపాల పరిధిలోకి వచ్చింది. దాదాపు 400 సంవత్సరాల వరకు ఈ ప్రాంతం వారి దృష్టిలో ఎటువంటి ప్రాధాన్యత లేని ప్రాంతం గా ఉండేది. అలా 18 శతాబ్ది చివర్లో నెపోలియన్ ఈ ప్రాంతంపై దాడి చేశాడు. క్రమేణా ఈ ప్రాంతం మీద ఉస్మానీల పట్టు సడలుతూ పోయింది. తమల్ని ఖద్యూ అని సంబోధించుకునే ఈజిప్టు పరిపాలకు ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు. ఇస్లామీయ పరిపాలనా ప్రారంభ మయినప్పటి నుండి దాదాపు 1500 సంవత్సరాలు ఈ ప్రాంతం ముస్లిం పరిపాలకుల చేతిలోనే ఉంటూ వచ్చింది. ఇది యూదుల నివాస స్థలంగానో, దేశంగానో, రాజ్యంగానో ఎప్పుడూ లేదు. అలాంట ప్పుడు ప్రస్తుత ఇజ్రాయీల్ దేశం ఎలా ఉనికిలోకి వచ్చింది? యూద రాజ్యం ఎలా ఏర్పడింది? వివరాలు తెలుసుకోవాలంటే వచ్చే సంచిక వరకు ఆగాల్సిందే!