నేపాల్‌లో 2015 ఏప్రిల్ 25 శనివారం వచ్చిన భూకంపం తీవ్రత 7.9 నమోదవగా తర్వాత 15 రోజుల పాటు ఒణికి స్తూనే ఉన్న భూకంపం వల్ల వేల మంది మరణించారు. వేల మంది నిరాశ్రయుల య్యారు. వేల మంది గాయాలతో బాధ పడుతున్నారు. ఈ వరుస భూకంపాల వల్ల అక్కడి ప్రజలు తమ భవిష్యత్తును ఊహించుకోలేక పోతున్నారు. ఇది సహజమే అని కొట్టి పారేయాడానికి లేదు. ఓ ప్రక్క భూకంపాలు మానవాళిని వణికిస్తుంటే, యుగాల తరబడి చేసుకున్న అభివృద్ధిని తృటిలో మట్టిలో కలిపేస్తున్నాయంటే ‘భూమి పొరల్లోని ప్లేట్ల సర్దు బాటు’ అని శాస్త్రీయ కారణ చెప్పేసి సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయడం సరి కాదు. మనిషి నిర్లక్యం ఇలానే కొనసాగితే, ఏదోక కోణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే సమీప భవిష్యత్తు ఇంకా తీవ్రతర మయిన భూప్రకంపనల్ని చూడాల్సి వస్తోంది. వైజ్ఞానికంగా మనిషి ఈ కష్టాలను, నష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నా, భూకంపాలు ఎక్కడ, ఎప్పుడు వస్తాయని తెలుస్తున్నా వాటిని పూర్తిగా నివారించడంలో సఫలీకృతుడు కాలేక పోయాడు. ప్రతి ఏటా చిన్నవిగా ఒక మోస్తరువిగాని ప్రపం చంలో సుమారు 10 లక్షల భూప్రకంపనలు వస్తుంటాయి అనేది ఓ అంచనా. వీటిలో సగటు 20 పెద్దవి. ఈ ఇరవైలో కనీసం ఒక్కటైనా మహా విపత్కరమయినదని, వీటినే ‘సిస్మిక్ బెల్ట్స్’ అంటారన్నది శాస్త్రవేత్తల మాట. అసలు ప్రస్తుత కాలంలో భూకంపాలు ఎందుకు అధికమయ్యాయి? అన్న అంశాన్ని ధార్మిక వెలుగులో గ్రహించేందుకు ప్రయత్నిద్దాం!
‘సాగర మథనం వల్ల హాలహలమూ వస్తుంది, కోలాహలమూ పుడు తుంది’ అన్న మాట ఎలా ఉన్నా, మానవుడికి అల్లాహ్ అనుగ్రహించిన జ్ఞాన మథనం వల్ల నిర్మాణమూ జరుగుతుంది. విచ్ఛిన్నమూ కలుగు తుంది. అతని ప్రాప్తమయి ఉన్న జ్ఞాన మథనం సవ్యమయిన రీతిలో సాగితే శాంతి సౌరభాలను వెదజల్లి మనిషి పాలిట అమృతం అవు తుంది. అదే ఆ మథనంలో అపసవ్యత చోటు చేసుకుంటే మనిషి చేత అపశృతులు పలికించి వినాశనానికి, విచ్ఛినానికి కారణమయి పచ్చి హాలహలంగా పేరు తెచ్చుకుంటుంది. అయితే లోక వినాశనానికి, మనిషి ఇహపర వైఫల్యానికి కారణమయ్యే విషభాండాన్ని, హాలా హలాన్ని అంతమొందించి, అమృత భాండాన్ని, ఆప్యాయత, అనురా గాన్ని, ప్రేమావాత్సల్యాలను ప్రపంచంలో సమస్త ప్రాణులకు పంచా లన్నదే ఆ పరమోన్నత ప్రభువు అభిలాష.విజ్ఞానం ఎంతగా వికసించినా విశ్వకర్తను విస్మరించే విపరీత బుద్ధి వల్ల వినాశకాలే చోటు చేసుకుం టాయి. నిజదైవాన్ని గుర్తించని, ఆయన ధర్మానికి లోబడని, సత్యానికి తలొగ్గని దృక్పథం మానవ జీవితాన్ని అంధకార బంధురం చేసి తీరు తుంది. ఈ వాస్తవ దృక్పథానికి ఎప్పుడో తిలోదకాలిచ్చేసిన ఆధునిక మానవుడు ‘అహం బ్రహ్మస్మి’, ‘అన రబ్బుకుముల్ ఆలా’ అన్నంత అహా నికి గురై ఉన్నాడు. అలా అనుకున్న ఫిర్ఔన్, హామాన్, నమ్రూద్ ఎలా నాశనమయ్యారో మరచిపోతున్నాడు. అల్లాహ్‌ా అలాంటి వ్యక్తులు, జాతుల గురించి ఇలా అంటున్నాడు:
”మరి వారిలో ప్రతి ఒక్కరినీ మేము అతని పాపాలకుగాను పట్టుకున్నాము. వారిలో కొందరిపై (ఆద్ జాతిపై) మేము రాళ్ళ వాన కురిపించాము. వారిలో కొందరిని(సమూద్ జాతిని) భయంకరమయిన శబ్దం ద్వారా మట్టు పెట్టాము. వారిలో కొందరి (ఖారూన్)ని మేము భూమిలో కూర్చి వేశాము.వారిలో కొందరి ని (ఫిర్ఔన్, అతని అనుయాయుల్ని) మేము ముంపుకు గురి చేశాము. అల్లాహ్‌ా వారికి అన్యాయం చేసేవాడు కాదు. నిజానికి వాళ్ళే తమకు తాము అన్యాయం చేసుకున్నారు”. (అన్కబూత్: 40)
హజ్రత్ సహల్ బిన్ సఅద్ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”చివరి కాలంలో ప్రజల్ని భూమిలో కూర్చడం జరుగు తుంది.వారిపై రాళ్ళ వర్షం కురిపించడం జరుగుతుంది. వారి ముఖాల ను వికృతంగా మార్చేయడం జరుగుతుంది”. అది విన్న సహాబా (ర) ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! అలా ఎప్పుడు జరుగుతుంది?’ అని ప్రశ్నించగా – ”సంగీత వాయిద్యాలు సర్వసాధారణం అయిపోనప్పుడు, పాటలు పాడే పడతులు పెచ్చు పెరిగిపోయినప్పుడు, అన్ని రకాల మద్యాన్ని ధర్మసమ్మ తంగా చేసుకున్నప్పుడు” అని సమాధానమిచ్చారు. (ఇబ్ను మాజహ్)
మరికొన్ని ఉల్లేఖనాల్ని పరిశీలించినట్లయితే మనముందు వచ్చే కార ణాలు – బంధుత్వ సంబంధాల విచ్ఛితికి మనిషి పాల్పడినప్పుడు, (మానవ సంబంధాలను మాధ్యమంగా చేసుకొని మాగాణాలు నింపు కున్నప్పుడు), సమాజంలోని సంపన్న వర్గాలలో పిసినారితనం ప్రబలి నప్పుడు, అయోగ్యులకు జాతి బాధ్యత, ప్రభుత్వ పగ్గాలు అప్పగించిన ప్పుడు, సమాజ శ్రేయస్సు, ప్రజా సంక్షేమం గురించి అలగా జనాలు వాగ్బాణాలు సంధించినప్పుడు, మద్య సేవనం, మగువ లోలత్వం, అశ్లీలత, అధిగమయినప్పుడు, నీచ మానవులు ధర్మాధిపతులుగా చెలా మణి అయినప్పుడు, ధర్మాధర్మాల నిమిత్తం లేకుండా యదేచ్ఛగా తీర్పులు చేసినప్పుడు, వ్యభిచారం, వడ్డీ సర్వసాధారణమయిపోయి నప్పుడు, మస్జిద్ ముందు నుండే వెళుతూ కూడా రెండు రకాతుల నమాజు చదవాలన్న ఆలోచన సయితం మనిషికి కలగనప్పుడు, సమా ధులు, చెట్లు, వీరుల విగ్రహాలు, చిత్రపటాలను ప్రతిష్టింపజేసి పూజలు – చదివింపులు జరిపినప్పుడు, ఖుర్ఆన్ ఆదేశాలను, ప్రవక్త (స) వారి సంప్రదాయాలను ప్రక్కనబెట్టి అన్య జాతుల సంస్కృతి సంప్రదాయా లకు అగ్ర తాంబూలం ఇచ్చినప్పుడు, మోసకారులు గొప్ప లౌక్యం గల వాళ్ళుగా చెలామణి అయినప్పుడు, ధర్మాసనం న్యాయబద్ధమయిన తీర్పులు ఇవ్వనప్పుడు, మాట తప్పడం మామూలయి పోయినప్పుడు, మంచిని మంచి అనడం చెడును చెడు అనడం మానేసి, చెడును మంచిగా, మంచిని చెడుగా ప్రచారం చేసినప్పుడు, మానవతే మొత్తం మంటగలసినప్పుడు, ఈ ఘోరాలను చూడలేక, చూసి తాళ లేక బతక డంకన్నా చావే నయం అనుకున్నప్పుడు, సిగ్గు, సిరిని అమ్మేసి, మానం, మర్యాదను తగలేసి దారి ప్రక్కనే పురుషుడు స్త్రీతో రతిక్రీడలో పాల్గొన్న ప్పుడు, ధర్మం మీద నడవటం అరచేతిలో నిప్పుకణికను పట్టుకున్నంత కష్టతరమయిపోయినప్పుడు, సిగ్గొదిలి జనాలకే ప్రజలు జేజేలు పలికిన ప్పుడు, వ్యభిచారులకు, నేరస్థులకు సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఘనంగా సన్మానాలు చేసినప్పుడు – భూకంపాలు, అల్లకల్లోలం, ఉపద్ర వాలు చోటు చేసుకుంటాయి. ఇదంతా ఎందుకు ఎందుకు జరుగు తుంది అంటే దానికి ఖుర్ఆన్ సమాధానిమిస్తోంది: ”ప్రజలు చేజేతులా చేసుకున్న (పాప) కార్యాల మూలంగానే భూమిలోనూ, సముద్రంలోనూ కల్లోలం వ్యాపించింది”. (అర్రూమ్: 41)
నిజమేమంటే – పుడమి ప్రకంపించినా, ఆకాశం ప్రకోపించినా, మన పై భూమ్యాకాశాల నుండి ఏ కడగండ్లు వచ్చి పడినా అవన్నీ మనందరి స్వయంకృతాపరాధాల ఫలమే. మరి చూడబోతే అల్లాహ్‌ా ఎంతో ఉదా త్తుడు.చాలా మటుకు మన పాపాలను, నేరాలను, ఘోరాలను మన్నించి వదిలి పెట్టేస్తున్నాడు. ఆయన తన దాసుల యెడల గొప్ప క్షమాగుణం కలవాడు. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి ఆయన మనల్ని పట్టుకోదలిస్తే మనం బ్రతికి బట్ట కట్టడం కల్లే. ఖుర్ఆన్ ఇలా అం టుంది: ”అల్లాహ్‌ా గనక ప్రజల ఆకృత్యాలపై అప్పటికప్పుడే పట్టుకో వడం మొదలెడితే పుడమిపై సంచరించే ఏ ప్రాణీ మిగిలి ఉండదు”.
(ఫాతిర్: 45) ”నిజంగా ఆయనయితే (వాటిలోని) చాలా విషయాలను మన్నిస్తూ ఉంటాడు”. (షూరా: 30)
మన రోజువారి జీవితంలో ఎన్నో సంఘటనల్ని మన చర్మ చకువులతో చూస్తూ, ఎన్నో వార్తల్ని వింటూ కూడా మనం గుణపాఠం గ్రహించడం లేదు ఎందుకు? దీనికి భిన్నంగా మహినయ ముహమ్మద్ (స) అన్ని విధాలా మనందరికాన్న పైహోదాలో ఉన్నా, పాపరహితు లయి ఉన్నా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసకున్నప్పుడు భయకంపితులయ్యేవారు. హజ్రత్ అబూ బకరహ్ా (ర) గారి కథనం –
మేమోసారి దైవప్రవక్త (స) వారి దగ్గర ఉన్నప్పుడు సూర్యగ్రహణం సంభవించింది. ప్రవక్త (స) కంగారు కంగారు లేచి తన దుప్పటిని లాక్కుంటూ మస్జిద్ వైపు సాగిపోయారు”. (బుఖారీ)
ముస్లిం హదీసు గ్రంథంలో ఉన్న మరో ఉళ్లేఖనంలో – ”ఆయన ఎంతగా భయకంపితులాయ్యరంటే తన దుప్పటికి బదులు తన సతీమనూల్లోని ఒకరి దుప్పటిని పట్టుకెళ్ళారు. ఇతరు వెళ్ళి ఆయన దుప్పటి ఆయనకు ఇవ్వనంత వరకు ఆయన అది తన దుప్పటి కాదన్న స్పృహ లేదు. అలా మస్జిద్ చేరుకున్న ఆయన (స) ఎంత సుదీర్ఘ రుకూ, సజ్జాదలు చేశారంటే, ఉల్లేఖకులు అంటున్నారు – అంత సుదీర్ఘ రుకూ, సజ్దాలు ఆయన చేయడం నేను అంతకు పూర్వం చూడలేదు”.
”విపరీత గాలులు వీచినా, ఆకాశం మీద దట్టమయిన మేఘాలు ఏర్ప డినా అయన కంగారు పడుతూ ఓసారి ఇంటి లోపలికి ఓసారి ఇంటి బయటికి వచ్చేవారు. ముందుకెళ్ళేవారు వెనక్కి వచ్చేవారు. ఆయన ముఖ కవళికలు మారిపోయేవి. వాన కురియగానే ఆయన సంతోషించే వారు”. (ముస్లిం)
ఓ సారి విశ్వాసుల మాత హజ్రత్ ఆయిషా (ర.అ) ఈ విషయమయి ఆరా తీయగా – అయనన్నారు: ”ఓ ఆయిషా (ర)! అందులో ఆపద లేదన్న గ్యారంటీ ఏమిటి?! ఒకానొక జాతి ఈ పెనుగాలి ద్వారానే సర్వ నాశనం చేయబడింది.ఆ జాతి వారు కూడా ఆ మేఘాన్ని చూసి ‘ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బుతున” అని మురిసిపోయారు” అని సామధానమిచ్చారు. (బుఖారీ) ”కాదు నిజానికది మీరు తొందర పెట్టిన (శిక తాలూకు) మేఘమది. అదొక పెనుగాలి. అందులో వ్యధాభరిత మయి శిక ఉంది.” (అల్ అహ్ఖాప్: 24)
వేరోక ఉల్లేఖనం ప్రకారం గాలు తీవ్రంగా విస్తున్నప్పుడు ఆయన (స) ఈ విధంగా వేడుకునేవారు: ”ఓ అల్లాహ్‌ా! దీని మేలు, దీనిలో ఉన్న మేలు, ఏ మేలుతోనయితే అది పంపబడిందో ఆ విషయమయి నిన్ను అర్థిస్తున్నాను. ఇంకా దాని కీడు నుండి, అందులో దాగి ఉన్న కీడు నుండి మరియు ఏ చెడుతోనైతే అది పంపబడిందో దాని నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను”.
ఇబ్బు అబుద్దున్యా ముర్సల్ కథనం – ఓ సారి ప్రవక్త (స) వారి యహాంలో పుడమి ప్రకంపించ సాగింది. అప్పుడు దైవప్రవక్త (స) భూమిపై తన చేయి పెడుతూ – ”శాంతం, శాంతం! ఇంకా నీ సమయం రాలేదు అని చెప్పి ప్రజల వైపు తిరిగి ఇలా అన్నారు: ”ప్రజలారా! మీ ప్రభువు మీ పట్ల అప్రసన్నుడయి ఉన్నాడు. కాబట్టి ఆయన్ను త్వరగా ఆయన్ను రాజీ పరచుకోండి, త్వరగా ఆయన్ను ప్రసన్నుడ్ని చేసుకోండి”.
ఇప్పటికి మించి పోయించి ఏమి లేదు. మనం మారడానికి, మన సమాజాన్ని సంస్కరించుకోవడానికి సమయం ఉంది. కానీ ప్రళయ శంఖం పూరించబడితే మాత్రం ఆ కాసింత వ్యవధి కూడా మన కుండదు. అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు: ”ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయ పడండి. నిశ్చయంగా ప్రళయ ప్రకంపనం మహా భయంకరమ యినది. ఆ నాడు మీరు దాన్ని చూస్తారు. పాలు పట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందుని మరచిపోతుంది. గర్బవతుల గర్భాలు పడిపోతా యి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కన్పిస్తారు. వాస్తవానికి వారు మైకంలొ ఉండరు. అయితే అల్లాహ్‌ా విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుందు”. (అల్ హజ్జ్: 1,2)