డా: జాకీర్ నాయక్
జొరాస్ట్రియన్ (పారశీక) మతంలో దైవభావన
జొరాస్ట్రియన్ మతం ఒక ప్రాచీన ఆర్యమతం. ఇది క్రీ.పూ. 2500 సంవత్సరాలకు పూర్వం ఫారస్ (ఈరాన్)లో ఉద్భవిం చింది. దీని అనుయాయుల సంఖ్య చాల తక్కువగా ఉంది. అంటే మొత్తం ప్రపంచంలో ఒక లక్షా ముఫ్ఫై వేలకు కూడా తక్కువగానే ఉంది. అయితే ప్రపంచ ప్రాచీన ధర్మాల్లో ఇది ఒకటిగా పరిగణింప బడుతుంది. ఈరాన్‌కు చెందిన ‘జర్‌తష్త్’ (జొరా స్టర్)అనే వ్యక్తి దీన్ని ప్రారంభించాడు. అందుకే దీన్ని జొరాస్ట్రియన్ మతం అని, పారశీక ధర్మం అని కూడా పిలుస్తారు. ‘దసాతీర్’ మరియు ‘ఆవెస్త’ పారశీకుల పవిత్ర మత గ్రంథాలు.
పారశీక ధర్మంలో దేవుని కోసం ‘అహూర్ ముజ్‌దా’ అనే పదం వాడబడింది.’అహూర్’ అంటే యజమాని, ప్రభువు. ‘ముజ్‌దా’ అంటే ‘వివేకవంతుడు’ అనే అర్థం వస్తుంది. ఈ విధంగా ‘అహూర్ ముజ్‌దా’కు అర్థం వివేకవంతుడైన యజమాని లేక ప్రభువు. ‘అహూర్ ముజ్‌దా’గా పిలువబడే భావనలో కూడా ‘దేవుని ఏకత్వ భావన’ ప్రబలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
దసాతీర్‌లో దైవగుణాలు
దసాతీర్‌లో ఈ క్రింద పేర్కొన్న దైవగుణాలు వర్ణించబడ్డాయి.
1) ఆయన ఒక్కడే.
2) ఆయనకు సరిసమానుడు వేరెవ్వరూ లేరు.
3) ఆయనకు ఆరంభమూ లేదు, అంతమూ లేదు.
4) ఆయనకు ఎవరూ తండ్రిలేడు, ఆయనకెవరూ కుమారుడు లేడు, ఆయనకు భార్యాలేదు, సంతానమూ లేదు.
5) ఆయన శరీర రహితుడు,నిరాకారుడు.
6) కళ్ళు ఆయన్ని చూడలేవు, మేధా మస్తిష్కాలతో ఆయన్ని ఊహించనలవికాదు.
7) ఆయన గురించి మనం ఆలోచించే దానికన్నా,అత్యంత అధికుడాయన.
8) మనకంటే కూడా ఆయన మనకు సమీపంలో ఉన్నాడు.ఆవెస్తాను అనుసరించి దైవగుణాలు
ఆవెస్తా, గాథా మరియు యస్‌నాకు అనుసరించి దైవానికి ఎన్నో గుణాలున్నాయి. అందులో కొన్ని ఇవి:
1) ఖాలిఖ్ (సృష్టికర్త) – యస్‌నా31-7 మరియు 11)
(యస్‌నా-44-7) (యస్‌నా 50-11) యస్‌నా 51-7)
2) అత్యంత శక్తిశాలి, మహోన్నతుడు. (యస్‌నా33-11) (యస్‌నా45-6)
3) దాత-‘హుదాయి’ ప్రసాదించేవాడు. (యస్‌నా33-11)
(యస్‌నా48-3)
4) సఖి-స్పెంటా (దాత, దయాళువు) (యస్‌నా. 34-4,5,7,9, 11,13,15) (యస్‌నా 44-2) యస్‌నా 45-5) (యస్‌నా 46-9) (యస్‌నా 48-3)
యూదు మతంలో దైవభావన
సామి ధర్మాల్లో యూదమతం ఒక ప్రముఖమైన ధర్మం. దాని అనుయాయుల్ని ”యూదులు” అని పిలుస్తారు. వారు హజ్రత్ మూసా(అలైహి) దైవప్రవక్త ప్రతిపాదించిన మిషన్‌పై విశ్వాసం కలిగి ఉంటారు.
1) ఈ క్రింది వాక్యాలు, పాత నిబంధన (డెటర్‌నొమి) పుస్తకంలో నమోదు కాబడి ఉన్నాయి. అందులో మహనీయ మూసా(అ) ప్రవక్త హితబోధ చేస్తూ ఇలా అంటారు: హీబ్రూ ఆయత్ అను వాదం ఇలా ఉంది.
‘ఇస్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోనవా’. (ద్వితీయోపదేశ కాండము6-4)
2) ఆ గ్రంథంలోనే ‘యెషయా’ అనే పపుస్తకంలో ఇలా వచ్చింది:
నేను నేనే యెహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.’ (43-11)
3) ‘దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు’. (యెషయా: 46-9)
యూద ధర్మంలో విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ ఇలా వచ్చింది.
‘నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పై ఆకాశ మందేగాని క్రింది భూమియందేగాని భూమి క్రింది నీళ్ళయందే గాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు. చాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింప కూడదు’. (నిర్గమకాండము- 20: 3, 5)
4) ”నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశ మందేగాని, క్రిందనున్న భుమియందేగానీ, భూమి క్రిందనున్న నీళ్ళయందేగాని, యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు. వాటిని పూజింప కూడదు. నీ దేవుడైన యెహోవాయగు నేను రోషము గల దేవు డను”. (ద్వితీయోపదేశ కాండము- 5:7-9