రమజాను మాసం విహాంగ వీక్షణం

Ramadan
షేఖ్ అబ్దుల్ హక్ఖ్
రోజా ఆచరించడం ద్వారా ధనికులు పేదల ఆకలిదప్పులను అనుభవపూర్వకంగా గుర్తిస్తారు. ఇలా ఈ మాసం అనేక పుణ్యకార్యాలతో నిండి ఉంటుంది. ఈ పవిత్ర మాసాన్ని అనుభవించిన వారు ఎంతటి అదృష్టవంతులు!
రమజాను మాసం – ఆత్మ ప్రక్షాళన మాసం. ఆధ్యాత్మికను పునరం కితం చేసుకునే మాసం. వ్యక్తి జీవన విధానంలో చైతన్యాన్ని ప్రేరేపించే మాసం. క్రమశిక్షణలను నేర్పి దైవానికి అంకతం చేసే మాసం. ఈ మాసం లోనే దైవప్రసన్నతను దాసుడు తనివితీరా గ్రోలుతాడు. తన ఆరాధనలచే దైవం యొక్క కరుణా కటాక్షాలను పొందుతాడు. విశ్వ మానవ సౌభ్రాతృత్వం సర్వత్రా వెల్లి విరుస్తుంది. పరస్పర ఆత్మీయ భావం అనుసంధానించబడుతుంది. ఒక సత్కార్యానికి పది నుండి ఏడు వందల రెట్లు ఫుణ్య ఫలాలు అందజేయబడతాయి. వయసుతో నిమి త్తం లేకుండా ఇంటిల్లిపాదీ రేయింబవళ్లు ఆరాధనల్లో తేలియాడుతుంటారు. అల్లాహ్‌ా మీద విశ్వాసం ద్విగుణీకృతం అవుతుంది. పవిత్ర ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం ఇది. ధనికులు, స్థితిపరులు నిరుపేదల కు ధానధర్మాలు అందజేస్తారు. ఈ మాసం ఆద్యంతం అపార దైవాను గ్రహాలు వర్షిస్తాయి. పుణ్యకార్యాల పట్ల ఆకాంక్ష, పాప కార్యాల పట్ల వైముఖ్యత కలుగుతుంది. ధనవంతులు పెదల హక్కును గుర్తించి, తత్ఫ లితంగా జకాత్‌, ఫిత్రా వంటి ధర్మాలను నిర్వహిస్తారు. రోజా ఆచరిం చడం ద్వారా ధనికులు పేదల ఆకలిదప్పులను అనుభవపూర్వకంగా గుర్తిస్తారు. ఇలా ఈ మాసం అనేక పుణ్యకార్యాలతో నిండి ఉంది. ఈ పవిత్ర మాసాన్ని అనుభవించిన వారు ఎంతటి అదృష్టవంతులు!
 రమజాన్‌ పదంలో ‘రమజ’ అనే శబ్దానికి ఆగడం, వేడి, ఉష్ణం అనే అర్థాలున్నాయి. ఉపవాసం వలన ఉపవాసి దోషాలు, తప్పిదాలు దహించుకుపోతాయి. రమజాను ప్రాముఖ్యం: వరాల వసంతం రమ జాను మాస నెలవంకను దర్శించాలన్న తీవ్ర కోరిక మనలో ఉండాలి. రమజాను మాసంలో ఆత్యధిక ఆరాధనలు చేయడంలో ఉత్సాహం కనబర్చాలి. తరావీహ్‌ా నమాజుల్లో దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణాల్ని శ్రవణాననందంతో వినాలి.
 దివ్యఖుర్‌ఆన్‌ను పూర్తిగా పఠించేందుకు, దాని ఆయతుల గురించి ఆలోచించేందుకు ప్రయత్నించాలి. జకాత్‌, ఫిత్రా సొమ్మును చెల్లించడం తోపాటు దానధర్మాలు సయితం ఎక్కువగా చేయాలి. రమజాను మాసపు రాత్రులు మేల్కొని ఆరాధనల్లో గడపాలి. రమజాను మాసం లో, అయినవారితో, కానివారితో మంచిగా మసలుకోవాలి. రమజాను మాసంలో ఎక్కువ దుఆలు చేస్తుండాలి. రమజాను చివరి థకంలో మరింత ఎక్కువగా పరిశమ్రించాలి. రమజాను చివరి థకంలో ఏతికాప్‌ పాటించాలి.
రోజా జాగ్రత్తలు: ఉపవాసి తనకు తెలియని విషయాలను తెలిసిన వారితో అడిగి తెలుసుకుంటుండాలి. సహరీ చేయడంలో శుభం ఉంది. ఇఫ్తార్‌ చేయడంలో త్వర పడాలి. రోజా ఉండే శక్తి లేని వృద్ధులు పరి హారంగా ఒక నిరుపేదకు రెండు పూటలా భోజన ఏర్పాట్లు చేయాలి. ఉపవాసి తన నోటిని, నేత్రాలను, వీనులను, ఉదరాన్ని అధర్మ విష యాల నుండి దూరంగా ఉంచుకోవాలి. అబద్దమాడటంగానీ, అశ్లీ చేష్టలకు పాల్పడటంగానీ చేయకూడదు.
దుఆలో పాటించవలసిన నియమాలు: దుఆ చేసేవారి దుఆను అల్లాహ్‌ తప్పక స్వీకరిస్తాడన్న నమ్మకంతో దుఆ చేయాలి. దుఆ ప్రారం భంలో మరియు చివరో అల్లాహ్‌ స్తోత్రం మరియు ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపై దరూద్‌ ఉండేలా చూసుకోవాలి. దుఆ చేయడానికి ముందు ఏదయినా పుణ్యకార్యం చేయడం మంచిది. ప్రార్థన కేవలం తమ కోసమే కాక సమస్త విశ్వాసుల, విశ్వ జనులందరి సంక్షేమం  కోసం చేయాలి. దుఆ స్వీకరించబడే వేళలు తెలుసుకొని మరి దుఆ చేస్తే ఇంకా మంచిది. దుఆ స్వీకరించ బడాలంటే ధర్మ సమ్మతమయిన జోవనోపాధి కలిగి ఉండాలి.
ఏతికాఫ్‌: రమజాను చివరి థకంలో ఏతికాఫ్‌ పాటించడం సున్నత్‌. ఏతికాఫ్‌ పాటించడానికి అనువయిన స్థలం మస్జిద్‌.

Related Post