సామాజిక రుగ్మతలు పరిష్కరిన్చబడాలంటే

రుగ్మతలు

అభివృద్ధినే పరమావధిగా చేసునున్న నేటి మానవుడు, ఆ అభివృద్ధికే గొడ్డలిపెట్టు అయిన రుగ్మతల వలయంలో రోజురోజు కు కూరుకుపోతున్నాడు. పర్యవసానంగా కుటుంబ వ్యవస్థ, ఆపై యావద్దేశం పైనే చెడుల యొక్క ప్రభావం భారిగా పుడుతున్న కారణంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం భవిష్యత్‌ విషయమై భయకంపితులౌతున్నాయి. ప్రయోగాలలో వ్యూహ రచనలో క్రొత్త పుంతలు త్రొక్కుతున్న కొద్ధీ మరింత అగాధంలో నికి పోతున్నారే తప్ప సమస్యలకు పరిష్కారం కనుగొన లేక పోతున్నారు. ఇట్టి పరిస్థితులలో ధార్మిక గ్రంథాలైన భగవద్గీత, బైబిలు అంతిమ దైవ గ్రంథమైన దివ్యఖుర్‌ఆన్‌ నేడు మానవాళి ఎదుర్కొంటున్న సామాజిక రుగ్మతలకు ఏ విధంగా పరిష్కారం చూపుతున్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం.

సామాజిక రుగ్మతలు అంటే?  సమాజాన్ని పట్టిపీడించే రుగ్మతలను సామాజిక రుగ్మతలు అం టారు. అవి రెండు రకాలు శారీరకమైనవి మరియు మానసికమై నవి. వ్యభిచారం,త్రాగుడు, జూదం మొదలగునవి శారీరక సం బంధమైనవి. అయితే అనైతికత, అనైక్యత, వరకట్నం, లంచం, స్కాములు, భయాందోళనలు, అభద్రతాభావం, ఈర్ష్యాద్వేషాలు మొదలగునవి మానసికమైనవి చెప్పవచ్చు. మొత్తానికి వ్యక్తి దగ్గర నుండి ప్రారంభమై కుటుంబాన్ని ఆపై పూర్తి సమాజాన్నే నిర్వీ ర్యం చేసే ఏ చెడు అయినా అది ఏ రూపంలో ఉన్నప్పటికీ సామాజిక రుగ్మతగానే పరిగణింపబడుతుంది.

సామాజిక రుగ్మతల పర్యవసానం…?  ఉదాహరణకు వరకట్నమే తీసుకుందాం. దీని కారణంగా స్త్రీ పుట్టడమే అభిశాపంగా, ఆమె మనుగడయే కుటుంబానికి పెను భారంగా మారుతుంటే మరో వైపు వరకట్నం పొందిన తరువాత కూడా చేదు ఫలితాలైన ఆత్మహత్యలు సజీవదహనాలు మానసిక శారీరక హింసలకు ఎందరో అమాయక స్త్రీలు గురవుతానే ఉన్నారు. మరొక ఉదాహరణ వ్యభిచారాన్నే తీసుకుందాం. దీని పర్యవ సానంగా ఇల్లువళ్లు గుల్లవడమే గాక అనేక భయంకరమైన వ్యాధులకు గురి అవుతున్న కారణంగా సమాజానికి వెన్నుముక లాంటి కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోవడం మన కళ్ళారా చూస్తున్నాం. ఇంకా అనైక్యతనే తీసుకుందాం. దీని కారణంగా ఎంతో అన్యో న్యంగా జీవించే భార్యభర్తల మధ్య, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన సంతానం మధ్య కలహాలు. జాతుల వర్గాల మధ్య ఘర్షణలు. మతాల మధ్య వారధిపోయి వైషమ్యాలు. దేశాల మధ్య నమ్మ కాలు లేని కారణంగా ఎంతో విలువైన సమాజ అవసరాలకు ఖర్చు పెట్ట వలసిన ధనాన్ని మారణాయుధాలు, అణుబాంబులు తయారు చేసుకోవటం కోసం ఖర్చు పెట్టుకోవలసి వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క విషయం పరిశీలించుకుంటు పోతే ఒక్కొక్క చెడు – అది ఒక చెడుగా గాక అనేక చెడులకు పునాదిగా, మూలంగా మనకు కనబడుతుంది. మేధావుల కృషి – దాని ఫలితం…?

ఈ సామాజిక రుగ్మతల గూర్చి విభిన్న కోణాల నుండి పరిశీలించి, పరిశోధించిన మన మేధా వులు అనేక అసమాన తలు, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి లేని కారణంగా ఈ సమస్యలు ఉద్భవిస్తు న్నాయని చెబుతున్నారు. నిజానికి వీరి అభిప్రా యాలు నేటి సమస్యలకు కొంత వరకు కారణాలే అయినప్పటికీ మూల కారణాలను గుర్తించని కారణంగా వారు ప్రస్తా వించిన విద్యా, విజ్ఞానం, ఆర్థిక అభివృద్ధి నూటికి నూరు శాతం అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ చెడులు (రుగ్మతలు) ఎన్నో విలయతాండమా డుచున్నాయని మనం అనునిత్యం ప్రచార ప్రసార సాధనాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము.మరికొందరైతే రాజారామ్మోహన్‌ రాయ్‌, కందుకూరి వీరేశలింగం పంతులు, బాల గంగా ధర్‌ తిలక్‌ లాంటి మహా నుభావులు ఏదో ఒక రుగ్మత నిర్మూలన కోసం ఉద్యమాల రూపంలో ప్రజలను చైతన్య పరచి చెడుల నిర్మూలనకు ప్రయత్నించినప్పటికీ, అనతి కాలంలోనే ఉద్య మాలు కనుమరుగైపోవ టం వ్యక్తులలోని మార్పు కూడా ఒక భ్రాంతిగానే మిగిలిపోవడం జరిగింది. కాబట్టే ఇంకా దైవేతర ఆరాధన. అంటరాని తనం, సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటి  ఎన్నో రుగ్మతల నివారణ ఉద్యమాకాలాల్లో ఊపందుకున్నా  క్రమ క్రమంగా వాటికి సరైన పునాది లేని కారణంగా ఊపిరాడక విల విల లాడాయి. పైగా ఏదో ఒక చెడు దూరమైనా, మానవ జాతిని నిర్విర్యం చేస్తున్న మరెన్నో చెడులు సమాజంలో కరాళనృత్యం చేస్తూ మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఈ మధ్య కాలంలో మనకళ్ళ ముందే ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమం తారాస్థాయికి చేరినా చివరికి మనిషిలో పరి వర్తనకు సంబంధించి సరియైన బలమైన సిద్ధాంతం లేని కారణం గా అనతి కాలంలోనే ఉద్యమం నీరుగారిపోవడమే గాక మద్యం ఏరులైపారు తున్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అటు ఉద్య మకారులు ఇటు ప్రజలు చేతులుడిగిన వారిలా పడి ఉన్నారు.

ప్రస్తుత సమాజ పరిస్థితి…?ప్రస్తుత మన సమాజం మేడుపండేకాని మామిడి పండుకాదు. పైకి ఎంతో అందంగా ఉన్నా ఎన్నో సమస్యలతో పూర్తి సమాజం రోగ గ్రస్థంగా మారిపోయింది. ఇది ఏదో ఒక జాతికి, ఒక ప్రాం తానికి సంబంధించిన విషయం కాదు. యావత్తు మానవాళి దేశంలో ఉన్న ప్రతి శాఖ (విభాగం) తనదైన నిజస్థితి కోల్పోయి ప్రమాదపుటంచులపై పయనిస్తోంది.వ్యక్తి సంస్కరణకు సంబంధించినంత వరకు వాస్తవమైన బలమైన సిద్థాంతాలులేని కారణంగా మనం తయారు చేసుకున్న చట్టాలు సయితం అదుపు తప్పిన మానవాళిని దిశా నిర్దేశాలతో గాడిలో పెట్టలేకపోతున్నాయి. ఇంకా చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా మరిన్ని చెడులు రుగ్మతలు ఉనికిలోకి వచ్చి పూర్తి మానవ జాతిని దిక్కుతోచని స్థితిలో పడవేశాయి.

మన ధార్మిక గ్రంథాలు అంటే…?  అనాది కాలం నుండి మానవ శ్రేయస్సు కోసం కరుణామయు డైన దేవుడు, అన్ని ప్రాంతాలకు అనేక భాషలలో ఎంతో మంది ప్రవక్తలను ఎన్నుకోవడమే కాక వారి ద్వారా మానవ మనుగడకు శుభశ్రేయాలకు సంబంధించిన మౌలిక సిద్థాంతాలను, ఆచరణా సూత్రాలతో పాటు ధర్మాధర్మాల, సత్యాసత్యాల మధ్య వ్యత్యాసం మనిషిలోని దానవుడ్ని నియంత్రించే శాసనాలను సందేశ రూపం లో పంపడం జరిగింది. ఆ పరంపరలో అంతిమ దైవగ్రంథం దివ్యఖుర్‌ఆన్‌. ఈ గ్రంథం మానవాళి మనుగడకు కావలసిన ఉపదేశాలన్నింటిని తెలియజేస్తుంది.

మన ధార్మిక గ్రంథాల మౌలిక సందేశం?  1. మానవులందరి దేవుడు ఒక్కడే.  ”యేకం ఎవద్వితీయం” (చంద్యోగ ఉపనిషత్తు 6:2:1) భావం: ఆయన ఒక్కడు ఆయన తప్ప రెండో వాడు లేడు. ”దావ్యా భూమీ జనయన్‌దేవ ఏక” (శ్వేతాశ్వేతారోపనిషత్‌ 3:3)  భావం: భూమ్యాకాశాలు సృష్టించినవాడు ఒక్కడే.  ”యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొకడనే ఆకాశమును విశాలపరచిన వాడను. నేనే భూమిని పరచినవా డను”. (బైబిల్‌ యెషయా 44:24)  ”…ఒక్కడే తండ్రి (దేవుడు) పరలోక మందున్నాడు  (బైబిల్‌ మత్తయి 23:9)  ”మీ దేవుడు ఒక్కడే ఆ కరుణామయుడు ఆ కృపాశీలుడు తప్ప మరొక దేవుడు లేడు”. (ఖుర్‌ఆన్‌ 2:163)  ఓ ప్రవక్తా! ఇలా ప్రకటించు: ”ఆయన అల్లాహ్‌ా అద్వితీయుడు, నిరపేక్షాపరుడు ఎవరి ఆధారమూ ఎవరి అక్కరా లేనివాడు”. (ఖుర్‌ఆన్‌ 112:1,2)

మరణానంతర జీవితం. దుష్కార్యాలకు పాల్పడేవారిని లోతైన గోతిలోని అంధకారంలో పడవేయండి. అక్కడ నుండి వారు బయటకు రాలేని విధంగా వారిలో ఏ ఒక్కడు ఏ నాటికి తిరిగి బయటకురాడు.  (ఋగ్వేదం 7:104:3)

వీరు (అవిశ్వాసులు) నిత్యశిక్షకును, నీతిమంతులు నిత్య జీవమున కును పోవుదురు. (బైబిల్‌ మత్తయి 25:46) పిరికివారును. అవిశ్వాసులను అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికు లందరునూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందురు. (బైబిల్‌ ప్రకటన 21:8)  ‘అల్లాహ్యే మీకు జీవితం ప్రసాదిస్తాడు. తరువాత ఆయనే మీకు మరణం కలుగజేస్తాడు. ఆపైన ఆయనే మిమ్మల్ని ప్రళయంనాడు సమావేశపరుస్తాడు. అది వచ్చే విషయం గురించి ఏ మాత్రం సందేహం లేదు. కాని చాలా మందికి ఈ విషయం తెలియదు’.  (ఖుర్‌ఆన్‌ 45:26)

పై వాక్యాలు పరిశీలించిన తరువాత యావత్‌ మానవులకు దేవుడు ఒక్కడేననియు ఆయనను హిబ్రూ భాషలో యెహోవా, సంస్కృత భాషలో సర్వేశ్వరుడు, అరబి భాషలో అల్లాహ్‌ా అని పిలిచినప్పటికీ, ఆయన మనిషి చేసే కర్మల గూర్చి ఒకానొక రోజు న ప్రశ్నించడమే గాక ఫలితంగా శిక్షాబహుమానాలు ఇవ్వబోతు న్నాడన్న ధార్మిక గ్రంథాల వాస్తవ బోధనలను మనం అర్థం చేసు కొనుట ద్వారా మాత్రమే మనిషి సంస్కరించబడతాడు. దానవుడై న మానవుడు సాధువై స్వార్ధాన్ని వీడి త్యాగామయుడైపోతాడు. తద్వారా సమాజంలో రుగ్మతలు తొలగి స్వర్గమయంగా మారు తుంది. దీనికి చరిత్రే సాక్షమిస్తోంది.

ఒక్కడైన ఆ దేవుడు చూస్తున్నాడు, ప్రశ్నిస్తాడు అన్న భావం ఒక్కటే వ్యక్తి సంస్కరణకు దోహదపడే పూర్తి సమాజంలోని రుగ్మ తలను చెడులను రూపు మాపగల ఏకైక ధార్మిక సిద్ధాంతం అని మనకు తెలుస్తోంది. ఈ సిద్ధాంతాన్నే ప్రచార ప్రసార సాధనాల ద్వారా కుల, మత, వర్గాలకతీతంగా అందరము ప్రచారం చేసి మన దేశాన్ని సమాజిక రుగ్మతల పీడనుండి రక్షించుకుందాము.

Related Post