మంచిని నమ్మడం, మంచి చేయాలన్న ఆశయంతో బ్రతకడం, మంచిని పంచడం, మంచిని పెంచడం,వయో పరిమితి, భాష,జాతి, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరి యెడల అభిమానంతో, కరుణతో, ప్రేమతో మసలుకోవడం సంస్కారం, సాత్వికమూను. ఎదుి వ్యక్తి ప్రతిభా పాటవాల ను, మంచితనాన్ని, సేవల్ని అంగీకరించి మనస్ఫూర్తిగా అభినందించడం అందరూ అలవర్చుకోవాల్సిన మేలిమి సంస్కారం. కొన్ని విషయాలు పాఠ శాలలో నేర్పిస్తారు. అంటే చదువు ద్వారా వచ్చే సంస్కారం కొంతయితే, పువ్వుకు తావి అబ్బినట్టు మనం పెరిగే కుటుంబం, సమాజం, చుట్టుప్రక్కల వాతావరణాన్ని బట్టి అద్దే సంస్కారమే అధికము మరియు శాశ్వతమూను. తోి వారిని ఎలా ఆదరించాలి? తోి వారు బాధ ప్టిెనట్లు ప్రవర్తించినా మనం ఎలా హుందాగా వ్యహరించాలి? మనకు సాదరంగా ఆహ్వనించని ఒకరు మనకింకి వస్తే వారికి ఎలా స్వాగతం పలకాలి? మనకు ఆదరం గా ఆతిథ్యం ఇవ్వని ఓ వ్యక్తి మన వద్దకు అతిథిగా వస్తే మనం గత ప్రవర్తన ను మరచిపోయి ఎలా ఆదరాభిమానాల్ని కురిపించాలి? మన ఇంటికి వచ్చినవారు కష్టాల్లో ఉంటే వారితో ఎలా పలుకరించాలి? కష్టాల్లో ఉన్న వారి ఇంికి మనం వెళ్ళినప్పుడు ఎలా మసలుకోవాలి? ఎలా సాంత్వన చేకూర్చాలి? ఎదుి వారికి మ్లాడే అవకాశం ఇవ్వడం, వారికి అవగాహన ఉన్న అంశాలపై వారికి అర్థమయ్యే బాషలో మ్లాడటం, వారు ఏదయినా సలహా ఇస్తే సావధానమగా వినడం మొదలయిన విషయాలు కుటుంబం అనే పాఠశాలలోనే నేర్చుకోవడం జరుగుతుంది.
భావి తరాలు సంస్కార వంతులుగా ఎదగాలంటే వారికి రేపి ప్రవర్తనకు స్వీయ పరివర్తనంతో మనమే పునాది అవ్వాలి. ఎదుటి మనిషిని మనిషిగా అభిమానించే, ప్రేమించే తత్వాన్ని మన పిల్లల్లో మనమే పెంచాలి. మన వద్దకు ఎవరొచ్చినా, వారెంత చెడ్డ స్థితిలో ఉన్నా మనం మాత్రం మన సంస్కారాన్ని చాటుకుంటూ ఉత్తమ పద్ధతితోనే వారితో ప్రవర్తించాలి. సమా జంలో ఏ వ్యక్తి చెడ్డ కానంత వరకూ గొప్పవాడే, తెలివివంతుడే. వారు ఏ వృత్తిని చేపట్టినా సరే మనిషి విలువను పెంచేది అతనిలోని సంస్కారమే గానీ, ఆతని హోదా ఎంత మాత్రం కాదు. నీడనిచ్చే చెట్టు తనను నరకడాని కి వచ్చినవాడికి కూడా నీడనిచ్చినట్లు, ఫలం నిండిన చెట్టు తనపై రాళ్లు రువ్విన వానిపై ఫలాలను రాలిచ్చనట్లు మనం సయితం శత్రువయినా సరే స్నేహపూర్వకంగానే పలుకరించాలి. ధ్వేషించడం వారి స్వభావమే కావచ్చు గాక. కానీ ప్రేమించడం, ప్రేమను పెంచడం, ప్రేమను పంచడమే మన నైజం అని నిరూపించుకోవాలి. అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు: ”మంచి మరియు చెడులు సరిసమానం కాజాలవు. చెడును మంచితో తొలగించు; అప్పుడు నీతో విరోధమున్న వాడు కూడా తప్పక నీ ఆప్త మిత్రుడి అవు తాడు”. (ఫుస్సిలత్: 34)
కాలువల్లో, చెరువుల్లో, నదుల్లో, మహా సముద్రాలలో బ్రహ్మాండంగా ఈద గలిగే చేపకు చెట్టక్కడం రాకపోవచ్చు. అలాగే చెట్టుపైన, గుట్టపైన,
కొండపైన అలవోకగా వెళ్ళి వాలి పోయే పక్షికి నీళ్ళలో ఈదడం రాకపో వచ్చు. అలాగని పక్షిని ఈదగలిగే సామర్థ్యం ఆధారంగా, చేపకు నీటి వెలుపల ఎగరగలిగిగే సామర్థ్యం ఆధారంగా పరీక్షించడం ప్రారంభిస్తే మనం సృష్టిలోని రమణీయతను, కమనీయతను పూర్తిగా ఆస్వాదించ లేము. అంటే ఒకరి నమ్మకాలు, ఒకరి సిద్ధాంతాలు మనకు నచ్చకపోయినా ఇతర వ్యక్తులకు దేవుడిచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను మనం గౌరవించాలి. అలా కాక ఎదుటి వ్యక్తుల అభిప్రాయాల, వారి మతాల, వారి ప్రతి ఒక విషయం లో జోక్యం చేసుకుంటూ మోరల్ పోలీసింగ్‌కు పాల్పడటం, తమకు నచ్చని విషయాలు ఎవరు మాట్లాడినా, రాసినా ఒప్పుకోకపోవడం, ముఖ్యంగా మైనా రీల సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేయడం సంస్కారం ఎలా అన్పిం చుకుంటుంది? అది ముమ్మాటికీ కుసంస్కారమే. ఒకరిని బాధ కలిగించే విధంగా వ్యవరిచడం అనేది మైనారిీ ప్రజలు చేసినా, మెజారిీ ప్రజలు చేసినా ఎవరి వల్ల ఎవరికి నష్టం వాటిల్లినా అది గర్హించదగినదే, ఖండించ దగినదే.
దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఈ దేశం ఆ దేశం అన్న తేడా లేకుండా దాదాపు అన్ని దేశాల ప్రజల్లోనూ అసహన, హనన గుణం కొట్టుకొచ్చినట్లు కన్పిం స్తుంది. ఇది ఏ సమాజానికయినా సరే మంచి పరిణామం అయితే కాదు. తామే అధికులం అన్న ఆహంకారంతో బ్రతికే వారిలో, వారు ఎంత చదువు కొని ఉన్నా, పై పెచ్చు ఎన్ని సంస్కార ఛాయలు కన్పించినా, వేషాలు ఎంత భేషుగ్గా ఉన్నా వారి భాష ఛండాలంగా ఉంటుంది. వాక్కు మితంగా, పర హితంగా వాడితే అది అమృత కలశం అవుతుంది. అదే వాక్కును అతిగా, పర హతంగా, పరిహాసంగా వాడితే అది విషతుల్యమవుతుంది.ఒక్క మాటలో చెప్పాలంటే మనలోని మూర్తిమంతమయిన సంస్కారమే పరిణత మానవత్వం గా పరిమళించేది. ఇలాంటి సంస్కారం సర్వ సామాన్యంగా పరిఢ విల్లాలంటే దేశ పౌరలయిన వారందరూ కలవాలి. పరస్పరం ఒండొకరితో సంభాషించు కోవాలి.ఒండొకరిని విందులకు, వివాహ-ఇత్యాది శుభ కార్యాలకు ఆహ్వానిం చుకోవాలి….ఆతిథ్యాలిచ్చుకోవాలి..ఆదరించుకోవాలి..ఆలింగనం చేసుకో వాలి…ఆనంద మకరందాల్ని పంచుకోవాలి.
నేడు సంస్కారాన్ని మరచి బంధాల బంధాలు తెంచుకుని మృగ మనసులా జీవిస్తున్నాడు మనిషి. కోరికల కోరలతో కకావికలం చేసే కన్స్యూమరిజానికి కొమ్ము కాస్తూ రాక్షస కాండను రగిలిస్తున్నాడు. వయసు వశము తప్పి, మనసు మసి బారి మనషి పెడదారి పడుతున్నాడు. క్షణ కాల సుఖం కోసం పసి మొగ్గల ఉసురు తీస్తున్నాడు. పేగు బంధమయినా పెడ బుద్ధితో మృగ మయి పంజాను విసురుతున్నాడు. తాగింది తలకెక్కి తండ్రి పేమను మరచి పశు వల్లే పసిదాన్ని చెరచుతున్నాడు. అర చేతిలో ఆడించిన నాన్నే కడకు విష నాగై కాటేస్తున్నాడు. క్రూర జుంతువులు సయితం కంట తడి పెట్టేలా ఆడకూతురి మానంతో ఆడుకుంటున్నాడు. ఆడదిగా పుట్టడమే పాపమయి నట్టు, ఆది ఆమె పాలిట శాపమవుతున్నది.రక్తబంధం రక్తసిక్తమయి రాబందు వులకు ఆహారం అవుతున్నది. ఆడ బిడ్టలు పుడితే కీడని తలచే పాడు బుద్ధి పెరిగి పోతున్నది. ప్రేమనే ముడి సరుకు పెట్టుబడిగా పెట్టి బంధాలతో బేర మాడుతున్నాడు. క్నాల పేరిట గిట్టుబాటు ధరలకు గ్టిగా నిలచి గొడవ పడుతున్నాడు. ఇలా మనిషి జీవితం వ్యాపారం అవుతుంటే, మానవత్వం మంటగలుస్తున్నది, సంస్కారం జడసి మూల దాక్కుంటున్నది. బంధాలను బలి పశువును చేసిన మనిషి మర మనిషిలా బ్రతుకుతున్నాడు.
మానవ శరీరం అందం, ఆహార్యం కలిగిన అమూల్య విలువల నిధి. మనోమస్తిష్కాలు కలిగిన అపూర్వ సన్నిధి. మనిషి శరీరంలో ప్రతి అవయవం జీవన ఒరవడిలో తనదైన పాత్ర పోషిస్తూ మన వ్యక్తిగగత, కుటుంబ, సామాజిక పురోగమనానికో, తిరోగమనానికో కారణభూతం అవుతుంది. కాబ్టి సమాజానికి ఉత్తమ సంస్కారాన్ని అందించడానికి ముందు మనం మన మనస్సుపై తర్వాత మస్తిష్కంపై విజయం సాధించాలి. వాటిని ముందు సంస్కారంతో నింపాలి. ఆ నిమిత్తం ప్రవక్త (స) వారి ఆదర్శ జీవితం ఓ గొప్ప కొలమానం కాగలదు ఎలాంటి సందేహం లేదు.