పప్రంచ దినాల్లోకెల్లా మహిమాన్విత రోజులైన జుల్ హిజ్జా మాసపు థ రాతుల్రు మరొక్కమారు ముస్లిం సమాజంపై పూర్తి శోభతో కారుణ్య మేఘమయి వాలాయి. ‘ఈ దినాల్లో చేెసే సత్కార్యాలు, పార్థ్రనలు, దానధర్మాలకు ఇతర రోజుల్లో చేసే ఏ ఆరాధనా, మరే సత్కార్యం సాటి రాదు. వ్యక్తి తన తన, మాన, ధనాలతో దైవమార్గంలో పోరాటం చేస్తూ అమరగతినొవందితే తప్ప’ అన్న పవ్రక్త మహనీయుల వారి మాటకు అక్షర సత్యంగా నిలిచే ఘడియలే ఈ సుదినాలు. ఈ శుభ ఘడి యల్లో విశ్వంలోని విశ్వాసుల్లో భక్తిపప్రత్తులు ఉప్పొంగుతాయి. ఐహిక ఆకర్షణలకు లోనై మోడు వారిన వారి జీవితాల్లో నవ చైతన్యం చోటు చేసుకుంటుంది. ఈ రోజుల్లోని ఒక్కో ఘడియ ఒక్కో శుభ సాగరం. మానవుల ఆలోచనాత్మక శిక్షణకు, ఆచరణాత్మక సంస్కరణకు, ఆధ్యాత్మిక వికా సానికి, అల్లాహ్‌ా నిర్దేశించిన మహత్తర అవకాశం ఈ థ రాతుల్రు, అందులోని హజ్జ్. త్యాగాల పచ్చ తోరణాలతో కళాకాంతులీనే ఈ పవిత వాతావరణంలో శారీరక, మానసిక సాధనాల ద్వారా విప్లవాత్మకమయిన, విశ్వవ్యాప్తమయిన, సాత్వికమయిన, శేయ్రస్కరమయిన పగ్రతి సాధ్య మవుతుంది.
నేడు ముస్లిం జనావళి అనేక రంగాల్లో అనేక రకాల వెనుకబాటుతనానికి గురయి ఉంది. ఒక విధమయినటువంటి నిదావ్రస్థకు లోనయి జీవిస్తోంది. దీనికి తోడు కర్తవ్యం పట్ల నిర్లక్ష్యత, బాధ్యతల పట్ల విస్మరణ, నైతిక విలువల పట్ల అశద్ధ్ర, నిర్మాణాత్మక ఆలోచనారాహిత్యం, భావ దారిద్యం, ఆధ్యాత్మిక భావ పతనం-అన్నీ కలగలసి వారిని మరింత నష్టానికి, కష్టానికి గురి చేస్తు న్నాయి. పై కారణాలే పూర్వ జాతుల పతనానికీ కారకాలయ్యాయన్నది జగద్విదితం. నేడు అత్యంత కీలక మలుపులో ఉన్న ముస్లిం జనావళి మేల్కొలుపుగా హజ్జ్ వారి జీవితాల్లో ఆశా జ్యోతయి వెలిగింది. అది వారి కమ్రశిక్షణారాహిత్య జీవితానికి కమ్రశిక్షణను నేర్పడానికే వచ్చింది. వెనుకు బాటుతనానికి గురయి ఉన్న పత్రి రంగంలో వారిని ఉన్నత శిఖరాల మీద కఅదీష్టింప జేసేం దుకే వచ్చింది. నిత్య జీవితంలో తారసపడే అర్థ సత్యాలలు, స్వార్థం, మోసం, మోహం, దురాశ, దుర్నడత, ద్వంద నీతి మొదలయిన చెడు చీడలను సమూలంగా నిర్మూలించి, సంపూర్ణ సత్యాలు, త్యాగం, నమ్మకం, ఆశావాద దృక్పథం, సత్పవ్రర్తన, సత్యసంధత, నిజాయితీ, దైవభీతి, పరోపకార పరాయణత్వం వంటి ఉన్నత పమ్రాణాలతో జీవితాన్ని మరింత అందంగా మలచ డానికే వచ్చింది.
అది పవ్రక్త ఇబాహ్రీమ్ (అ) వంటి అచంచల విశ్వాసాన్ని మనలో నూరి పోస్తుంది. మొత్తం జాతి, జాతి నాయకుడు ఓ వైపు ఇబాహ్రీమ్(అ) విశ్వాసం ఓ వైపు. ఆయన్ను సజీవంగా బూడిద పాలు చేయాలన్న జాతి కుటన్రు అల్లాహ్‌ా భంగ పర్చాడు. నింగికెగిసే అగ్ని గుండ మంటలు ఆయన పాలిట ఉద్యాన వనంగా మారాయి. అది మనలో మూసా (అ) వారి మాతృమూర్తి వంటి అనుపమ విశ్వాసాన్ని, అల్లాహ్‌ాపై ఎనలేని భరోసాను కలిగిస్తుంది. ‘నవ మాసాలు మోసి కన్న పసికందుని నీటి పాలు చెయ్యి అని, నీకూ శతువ్రు, నాకూ శతువ్రు అయినా, కేవలం పవ్రక్త మూసా (అ) వారి జననాన్ని అడ్డుకునే నిమిత్తం 70 వేల మంది పసికందుల్ని పొట్టన బెట్టుకున్న కాళరాక్షసుడయిన ఫిర్‌ఔన్ వద్దకే తీసుకెళతాను’ అంటే మరో మారు ఆలోచించకుండా పెట్టెలో పెట్టి నైలు నదీలో వదిలేసింది ఆ మహా తల్లి. పర్యవసానం ఈజప్టు సత్యవంతుల కైవసం అయింది. అది మనలోని సంధిగ్దతను గుహవారి సందిగ్ధతను దూరం చేసినట్లు దూరం చేస్తుంది. అవిశ్వాస రాజ, పజ్రతో భయపడి పాణ్రాల్ని గుప్పెట్లో పెట్టుకుని కాకులు దూరని కార డవిలోని ఓ గుహలో తల దాచుకున్న గుప్పెడు మంది యువకులు వారికి ఎదురయి ఉన్న ఆ దురవస్థ ఎప్పటికి తొలుగుతుందో? అన్న సందిగ్ధానికి లోనయ్యారు. అల్లాహ్‌ా మూడొందల సంవత్సరాల వరకు వారిని పశ్రాంత నిదల్రో ఉంచి లేపితే అప్పుడు వారు చూసిన సమాజం పూర్తి ముస్లిం సమాజం. అంతిమంగా ఓ మాట-పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, పత్రికూలం గా తయారయినా విజయ ధుంధుభి మోగ్రించేది సత్యమే. ఎందుకంటే అది వచ్చిందే గెలుపొం దడానికి! ”ఆయనే తన పవ్రక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు – దాన్ని మత ధర్మాలన్నిం టిపై ఆధిక్యం వహించేలా చేయడానికి! ఈ విషయం బహుదైవారాధకులకు (సత్య విరోధులకు) ఎంతగా సహించరానిదైనా సరే”. (అస్ సఫ్: 9)