సిగ్గు బిడియాలు అవసరమైన ఆభరణాలు

ధార్మిక పరిభాషలో సిగ్గు (బిడియం) అంటే ఏదైనా పాపకార్యం వైపు మొగ్గే మనిషి, స్వయంగా తన నైజం ముందు, తన ప్రభువు ముందు వ్యక్తం చేసేదాన్ని సిగ్గు అంటారు. సిగ్గు అనబడే ఈ శక్తే మానవులను అన్నిరకాల అశ్లీలతలు, దుర్మార్గాల నుండి కాపాడుతుంది. ఒకవేళ పైశాచిక ప్రభావానికి లోనై ఏదైనా పాపకార్యానికి ఒడిగట్టినా, ఈ సిగ్గు అనేది వారి మనసును కెలుకుతూ ఉంటుంది. ముహమ్మద్ ప్రవక్త బోధనల్లో కూడా సిగ్గు బిడియాల పరిధి చాలా విస్తృతం. జీవితంలోని అన్నిరంగాలనూ అది పరివేష్టించి ఉంది.

ధార్మిక పరిభాషలో సిగ్గు (బిడియం) అంటే ఏదైనా పాపకార్యం వైపు మొగ్గే మనిషి, స్వయంగా తన నైజం ముందు, తన ప్రభువు ముందు వ్యక్తం చేసేదాన్ని సిగ్గు అంటారు. సిగ్గు అనబడే ఈ శక్తే మానవులను అన్నిరకాల అశ్లీలతలు, దుర్మార్గాల నుండి కాపాడుతుంది. ఒకవేళ పైశాచిక ప్రభావానికి లోనై ఏదైనా పాపకార్యానికి ఒడిగట్టినా, ఈ సిగ్గు అనేది వారి మనసును కెలుకుతూ ఉంటుంది. ముహమ్మద్ ప్రవక్త బోధనల్లో కూడా సిగ్గు బిడియాల పరిధి చాలా విస్తృతం. జీవితంలోని అన్నిరంగాలనూ అది పరివేష్టించి ఉంది.

విశ్వాసం విధేయతకు పునాది. ఎవరైతే దైవం, దైవగ్రంథం, దైవప్రవక్తలను విశ్వసిస్తారో, అలాంటివారే ధర్మశాస్త్రంలోని ఉచితానుచితాల, హితవిహితాల అసలు సంబోధితులు. వారిని విధేయులుగా మలచాలన్నా, అవిధేయులుగా తయారుచేయాలన్నా ఫలానా ఆజ్ఞ దైవానిది, ఫలానాది కాదు అన్న జ్ఞానమొక్కటే సరిపోతుంది. కనుక దైవాన్ని విశ్వసించేవారికి, దైవం తన గ్రంథం ద్వారా అశ్లీలతను, పాపకార్యాలను నిషేధించాడని తెలిసినట్లయితే వారు వాటికి దూరంగా ఉండడం, తమ హృదయాలను పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరైపోతుంది.

కొన్నిసార్లు మానవులు పైశాచిక ప్రభావానికి లోనై దొంగతనం, అసత్యం, వ్యభిచారంలాంటి అనేక పాపాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఇవన్నీ మానవ నైజానికి వ్యతిరేకమైనవి. దైవగ్రంథం ఇలాంటి కార్యాలను ‘మున్కర్’ అన్న పదంతో సంబోధించింది. అంటే పాపము లేక దుష్కార్యము అని అర్థం. వీటిని మున్కర్‌తో పోల్చడమంటే, ఇవి మానవ నైజానికి సరిపడనివి. కనుక నైజం అంగీకరించనప్పుడు పైశాచిక స్వభావం ఆ కార్యాలు చేయమని బలవంతం చేస్తుంది. అలాంటప్పుడు అన్నిరకాల దుష్కార్యాలను అసహ్యించుకునే ఏదైనా ఒక వస్తువు మానవ స్వభావంలో ఉండాలి. ఈ అవసరాన్ని గుర్తించిన దైవం సిగ్గు లేక బిడియం అన్న వస్తువును మానవ స్వభావంలో ప్రవేశపెట్టాడు.

ధార్మిక పరిభాషలో సిగ్గు (బిడియం) అంటే ఏదైనా పాపకార్యం వైపు మొగ్గే మనిషి, స్వయంగా తన నైజం ముందు, తన ప్రభువు ముందు వ్యక్తం చేసేదాన్ని సిగ్గు అంటారు. సిగ్గు అనబడే ఈ శక్తే మానవులను అన్నిరకాల అశ్లీలతలు, దుర్మార్గాల నుండి కాపాడుతుంది. ఒకవేళ పైశాచిక ప్రభావానికి లోనై ఏదైనా పాపకార్యానికి ఒడిగట్టినా, ఈ సిగ్గు అనేది వారి మనసును కెలుకుతూ ఉంటుంది. ముహమ్మద్ ప్రవక్త బోధనల్లో కూడా సిగ్గు బిడియాల పరిధి చాలా విస్తృతం. జీవితంలోని అన్నిరంగాలనూ అది పరివేష్టించి ఉంది. అందుకని సామాజిక వ్యవస్థలోని దాంపత్య రంగానికి సంబంధించి కూడా నైతిక సంస్కరణ కోసం అది సిగ్గు బిడియాలనే ఆశ్రయించింది.

మహిళల విషయంలో ఏ కొద్దిపాటి చూపుల దొంగతనానికి పాల్పడినా అది దాన్ని పట్టుకొని సిగ్గుకు అప్పగిస్తుంది. చట్టం దృష్టిలో శారీరక కలయిక మాత్రమే వ్యభిచారం అనబడుతుంది. కాని నైతికపరంగా చూస్తే వివాహబంధానికి వెలుపల ఎదుటివారి పట్ల దుర్బుద్ధి కలిగి ఉండడం (ఆడ, మగ) కూడా వ్యభిచారం కిందకే వస్తుంది. అపరిచిత, పరిచిత అందాన్ని ఆస్వాదించడం, గొంతు మాధుర్యాన్ని ఆస్వాదించడం, అవసరం లేకున్నా వారితో సంభాషించడానికి ఆసక్తి చూపడం, కాళ్లసవ్వడి వినడానికి, తాకడానికి ప్రయత్నించడం లాంటివన్నీ ఆ మేరకు వ్యభిచారంగానే పరిగణించబడతాయి. బాహ్యచట్టాలేవీ వీటిని అంతగా పట్టించుకోవు. కాని ప్రవక్త మహనీయులు పరస్త్రీతో చాలా జాగ్రత్తగా, అవసరం మేరకే, వినమ్రంగా, గౌరవభావంతో మాట్లాడాలని ఉపదేశించారు. సిగ్గుబిడియాలు స్త్రీలకైనా, పురుషులకైనా పెట్టని ఆభరణాలని ఆయన సెలవిచ్చారు.

 

Related Post