అరిషడ్వర్గాలలో రెండోదైనది క్రోధం. అది ఎంత భయంకరమయిన దంటే దానిని ఆశ్రయించిన వ్యక్తికి పతనం తప్ప ప్రగతి ఉండదు. కోపం లేని మానువుడు ఉండడు అన్నది వాస్తమే. కానీ; స్థాయికి మించిన కోపం మనిషి జీవితాన్ని అనర్థం పాలు చేస్తుంది. ఒక్క క్షణం నిగ్రహం కొండంతటి ప్రామాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం ఆవేశం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. మనం జీవితంలో ఏది సాధిం చాలన్నా కసి, ఆవేశం, ఆగ్రహంతోపాటు నిగ్రహం, సంయమనం ఎంతో అవసరం. ఈ కారణంగానే ‘ఏదైనా ధర్మోపదేశం చేయండి, ఓ దైవప్రవక్తా!’ అని అడిగిన ఓ వ్యక్తికి హితోపదేశం చేస్తూ ‘కొపగించు కోకు’ అని దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు సెలవిచ్చారు. అది సరే, ఇంకేదైనా, మరేదైనా సెలవియ్యండి అని ఆ వ్యక్తి విన్నవించుకోగా, అడిగిన ప్రతిసారీ ప్రవక్త (స) ‘కోపగించుకోకు!’ అనే హితవు పలక డం ద్వారా సదరు వ్యక్తిలో గల ఆ అవలక్షణాన్ని తొలగించి అతన్ని నిగ్రహంగల నిండు మనీషిగా మలచదలిచారు ప్రవక్త (స).
కోపం ఎందుకు వస్తుంది? అంటే, సాధారణంగా కోరింది కోరినట్లు గా జరగకపోవడం, అనుకున్నది సమయానికి అవ్వక పోవడం, అహం దెబ్బ తినడం, తనకు వ్యతిరేకంగా సృష్టించబడిన వదంతుల్ని వినడం, తనకు దక్కాల్సిన హుక్కు దక్కకపోవడం, తృప్తి స్థానే తృష్ణ చోటు చేసుకోవడం, తీవ్రమయిన నిరాశనిస్పృహలకు లోనవ్వడం- మొదలగు కారణాల వల్ల కోపం కలుగుతుంది. సరయిన సమయం లో, సరయిన మోతాదులో, సరైన వారిపై, సరైన రీతిలో కోపాన్ని పదర్శించడం కూడా ఒక కళే. ఆ మాత్రం కోపాన్ని సయితం మనిషి ప్రదర్శించలేకపోతే అతను, అతనికి సంబంధించిన ప్రతిదీ చులకనై పోతుంది. అలా అని ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుండటం మంచిది కాదు. అలాంటి వ్యక్తికి స్వంత సంతానం కూడా జడుసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మేకపోతు గాంభీర్యమూ కూడదు. గుంట నక్క వినయమూ వలదు. కోపాన్నిగానీ, హాస్యాన్నిగాని సహజశైలి లో ప్రదర్శించాలి.
ఈ సందర్భంగా ప్రవక్త (స) వారు చేసిన హితవు గమనార్హం! ”బల్ల యుద్ధంలో ప్రత్యర్థిని చిత్తు చేసినవాడు కాదు గొప్పోడు; కోపం వచ్చినప్పుడు ఎక్కడ ఎంత తగ్గాలో అంత తగ్గడం తెలిసి నోడు గొప్పోడు”. ఎందుకంటే, మితిమీరిన కోపం వల్ల ఆరోగ్యం ఎలాగూ పాడవుతుంది. దానికితోడు క్రోధం కలవాడికి కర్తవ్యం గోచరించదు. తరచూ తీవ్ర భావావేశానికి గురయ్యే వ్యక్తి ప్రాణ ఘాతుకమయిన హింసాచరణకు పాల్పడే ప్రమాదం ఉంది. రాపిడి వల్ల ఉద్భవించి అగ్ని ఆ చెట్టునే దహించివేసినట్లు దేహోత్పన్నమ యిన ఆగ్రహం పూర్తి శరీరాన్నే బూడిద పాలు చేసి వేస్తుంది. అందుకే-‘తన కోపం తన శత్రువు, తన శాంతం తన మిత్రుడు’ అన్నారు వెనుకటికి మన పెద్దలు.
ఆలస్యంగా ఆవేశానికి లోనయి, తొందరగా ఉపశమనాన్ని పొందే వ్యక్తి ఉత్తముడయితే, తొందరగా ఆవేశానికి గురై తొందరగా దాన్నుండి బయట పడే వ్యక్తి మధ్యముడయితే, తొందరగా కాని, ఆలస్యంగా కానీ క్రోధావేశానికి లోనై ఎంత సేపటికీ దాన్నుండి బయట పడక లోలోన దావానలంలా రగులుతూ ఉండే వ్యక్తి అధ ముడు. కాబట్టి మన కోపం సయితం ఆశీర్వచనం అయ్యేలా మనం చూసుకోవాలి. ‘అల్లాహ్‌ా తేరా భలా కరే-అల్లాహ్‌ా నీకు సద్బుద్ధిని అనుగ్రహించు గాక!’ వంటి పదాలను ఆవేశ ఘడియల్లో సయితం అలవాటు చేసుకోవాలి.
నిగ్రహాన్ని అర్థం చేసుకోవడం చాలా సులువు. బయట ప్రపంచం మన ఆలోచనలకు అనుగుణంగా లేదు. నాగరికమో, అనాగరిక మో, ఆధునికమో, ఆటవికమో-ఏమో కానీ అంతా తల్లక్రిందులవుల వుతోంది. మన మాట ఎవ్వరూ వినడం లేదు. మనం అనుకున్న ఏదీ జరగటం లేదు.చిర్రెత్తుకొస్తోంది. ఎదుటి వ్యక్తి పట్టుకొని చితక బాదేయాలనిపిస్తోంది. ఆ సమయంలో శాంతాన్ని ఆశ్రయించి చిరు నవ్వు చిందించడమే నిగ్రహం. ఇది అందరికీ అవసరమయిన గుణమే అయినా ఆధ్యాత్మిక రంగంలో అవిరళంగా పరిశ్రమిస్తున్న వారికి మరీ ముఖ్యావసరం అనే చెప్పాలి. ఈ సద్గుణం మనకుంటే ప్రత్యర్థులు మనల్ని కోపానికి లోను చేసి మన మనోభావాలతో ఆడు కోవాలనుకున్నా మన మనో నిర్మలం చెదరదు. ఇది చెప్పడానికి సులుళువుగానే చెప్పేసినా ఆచరణలో పెట్టడం మాత్రం అంత సులువు కాదు.ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్ ఇలా పేర్కొంటోంది:
”మంచీ-చెడు (ఎట్టి స్థితిలోనూ) సమానం కాలేవు. చెడును మంచి ద్వారా తొలగించండి. (ఆ తర్వాత మీరే చూద్దురు గాని) నీకు- తనకూ మధ్య బద్ధ విరోధం ఉన్న వ్యక్తి సయితం నీకు ప్రాణ మిత్రుడయి పోతాడు. అయితే ఈ భాగ్యం సహనశీలురకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగు తారు”. (హామీమ్ అస్సజ్దా: 34, 35)