వెలుగుల్ని పంచుదాం!

 ఇది నిజం, కఠోర సత్యం! - ''ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్య ధర్మాన్ని ఇచ్చి పంపాడు-దాన్ని మతధర్మాలన్నింటిపై ఆధిక్యం వహిం చేలా చేయడానికి. ఈ విషయం బహుదైవారాధకులకు ఎంత సహించ రానిదయినా సరే''. (అస్సఫ్‌:9)

ఇది నిజం, కఠోర సత్యం! – ”ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్య ధర్మాన్ని ఇచ్చి పంపాడు-దాన్ని మతధర్మాలన్నింటిపై ఆధిక్యం వహిం చేలా చేయడానికి. ఈ విషయం బహుదైవారాధకులకు ఎంత సహించ రానిదయినా సరే”. (అస్సఫ్‌:9)

 

ఖుర్‌ఆన్‌ మహా గ్రంథాన్ని పఠించేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఏదోక దేశంలో, ఏదోక ఖండంలో, ఏదోక భూభాగంలో కాదు – ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉన్నారు. వారిలో తెల్లవారూ ఉన్నారు, నల్లవారూ ఉన్నారు, అరబ్బులూ ఉన్నారు, ఆరబ్బేతరులు ఉన్నారు, ఆ విషయానికొస్తే 170 కోట్ల మంది ముస్లింలలో 25 శాతం మంది అరబ్బు ముస్లింలయితే 75 శాతం మంది అరబ్బేతరులే. ఒక్క మాటలో చెప్పాలంటే ఖుర్‌ఆన్‌ చదవకుండా ప్రపంచంలో ఒక్క క్షణం కూడా గడవదు. ఏదోక చోట, ఏదోక రూపంలో అనునిత్యం ఖుర్‌ఆన్‌ పఠనం సాగుతూనే ఉంటుంది. ఖుర్‌ఆన్‌ ఆవతరించి 1435 సంవత్సరాలకు పై చిలుకు ఆవుతున్నా నాటి నుండి నేటి వరకు అది భిన్న జాతుల్ని, భిన్న సంస్కృతుల్ని, భిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రళయం వరకూ చేస్తూనే ఉంటుంది.

దాన విధానాన్ని తీసుకొచ్చి అనేక ప్రతిపాదనల్ని ప్రవక్త (స) వారి ముందు పెట్టి ధర్మ కార్యాన్ని మానుకోవాల్సిందిగా కోరిన ఉత్భా ముందు ఖుర్‌ఆన్‌ సూక్తులు చదివి విన్పించడం జరిగింది. సాంతం ప్రశాంతంగా విన్న ఉత్బా తన తెగ వారి వద్దకు వెళ్ళి ఇలా అభిప్రాయ పడ్డాడు: ‘సాహితీ పరంగా నాకన్నా బాగా తెలిసిన వాడు మీలో ఎవరూ లేరు. పద్యాన్ని, గద్యాన్ని, భాషా నుడికారాల్ని నేను ఎరిగినం తగా ఎవరు ఎరిగి లేరు అన్నదీ స్పష్టమే. నేను ముహమ్మద్‌ (స) నుండి విన్నది మనిషి అన్న మాట కానే కాదు. మనిషి అలాంటి వచనాల్ని చెప్పలేడు కూడా.”దైవసాక్షి! ఆ వాణిలో మధురామృతం జాలువారుతూ ఉంది. అందులో ఏదో తెలియని ఆకర్షణా శక్తి ఉందనిపిస్తుంది. దాని పై భాగం ఫలవంతం అయితే, దాని క్రింది భాగం శాంతిభరితంగా గోచరిస్తుంది. అది విజయానికి చిరునామా. దానిపై విజయం ఎవరి వల్ల సాధ్య పడని అంశం”.

ఇది నిజం, కఠోర సత్యం! – ”ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్య ధర్మాన్ని ఇచ్చి పంపాడు-దాన్ని మతధర్మాలన్నింటిపై ఆధిక్యం వహిం చేలా చేయడానికి. ఈ విషయం బహుదైవారాధకులకు ఎంత సహించ రానిదయినా సరే”. (అస్సఫ్‌:9)

సేల్స్‌ టాక్స్‌ డిప్యూటి కమిష్నర్‌ దగ్గర పని చేసే ఓ ముస్లిం చఫ్రాసీ ఆయన ద్వారా ప్రమోషన్‌ అందుకున్న సంతోషంలో ఆయనకో గిప్టు ఇవ్వాలనుకున్నాడు. తానేమో పేదవాడు, ఏం గిప్టు ఇస్తే బాగుంటుంది అని తర్జన భర్జన పడ్డాడు. చివరికి ఆయన దగ్గరకు వెళ్ళి- ”సర్‌, నేను మీకు ఇవ్వబోతున్న గిఫ్ట్‌కు సరితూగ గలిగే వస్తువేది విశ్వం మొత్తంలో లేదు” అంటూ ఓ గిప్టు ప్యాకు అందించాడు. ఆఁ అంత పెద్ద గిప్టు ఇతను నాకేమివ్వగలడు అనుకొని తీసుకెళ్ళి అల్మారాలో పెట్టి మరచి పోయాడు ఆ అధికారి. కాని పడకపై మేను వాల్చగానే ఛప్రాసీ మాటలు గుర్తుకొచ్చాయి. మరచి నిద్ర పోదామనుకుంటే నిద్ర పట్టడం లేదు. అలానే మూడో వంతు రాత్రి గడిచి పోయింది. రాత్రి చివరి ఝామున లేచి ఆ గిప్ట ప్యాక్‌ తెరచాడు. అది హిందీ భాషలో ఉన్న ఖుర్‌ఆన్‌. ఏం రాయబడి ఉందో చదువుదాం అని తెవరబోయి ఆగి పోయాడు. పైన కవరుపై హిందిలో వ్రాయబడి ఉంది ‘పరిశుద్ధులే దాన్ని ముట్టుకుంటారు’ అని. వెళ్ళి స్నానం చేసి వచ్చి చదవనారంభిం చాడు. ఆ రోజు మొదలయి ఆయన ఖుర్‌ఆన్‌ గ్రంథ పారాయణం చాలా రోజుల వరకు సాగింది. చివరికి ఇస్లాం స్వీకరించాడు. అప్పుడర్థ మయ్యింది-గిఫ్టు ఇస్తూ ఛప్రాసీ చెప్పి మాట ఎంత వాస్తవమో. అతను ఆ గిఫ్టు తనకిచ్చి ఉండకపోతే తాను ఎంతటి మహా భాగ్యాన్ని కోల్పో యేవాడో!

అల్‌హమ్దులిల్లాహ్‌ మనం దివ్యఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తున్నాము, స్వయంగా పారాయణం చేయడమే కాక సుస్వరకర్తల స్వరంలో ఖురాన్‌ స్వర్ణకార ధ్వనిని వింటున్నాము. అయితే అన్నీ ఉపద్రవాల నుండి మాన వాళిని కాపాడే ఉద్గ్రంథంగా మనం విశ్వసిస్తున్న ఈ గ్రంథరాజాన్ని ఇతరుల వరకు చేరవేసే ప్రయత్నం చేశామా? మనం అందజేసే ఈ గిఫ్టు ఎందరి జీవితాల్ని మార్చగలదో ఎప్పుడయినా ఆలోచించామా? ఏ విషయంలో ఎలా ఉన్నా ఈ విషయంలో మాత్రం –
ఆలస్యం అమృతం విషం!

Related Post