ముఖ్య సూచనలు

Originally posted 2013-06-05 09:58:02.

kuwait
కార్మిక  సోదరా!
కువైట్‌లో నీకు స్వాగతం సోదరా! ఈ చిరు పుస్తకంలో నీ పనిని మరింత సులభతరం చేసే ముఖ్య సూచనలున్నాయి. వీటి ద్వారా నువ్వు నీ పనిని సమర్థవంతంగా నిర్వర్తించగలవన్నది మా ఆశ. ఈ సూచనల ఆధారంగా నువ్వు కువైట్‌ సమాజంలో త్వరగా కలిసి పోగలవడంతోపాటు  ఇక్కడి ఆచారవ్యవహారాలను బాగా అర్థం చేసుకోగలవన్న నమగ్మకమూ మాకుంది.  అనుక్షణం నీ మేలు కోరే  ఆప్తుల మధ్య నివసిస్తున్నా నన్న గొప్ప అనుభూతి నీకు కలుగుతుంది. ఇక్కడ నీవు చూసే సత్ప్రవర్తన ఇస్లామీయ జీవన విధానా నికి తార్కాణం. మా సమాజపు ప్రత్యేకకు ప్రబల నిదర్శనం. అంతిమంగా మేము నీకు శ్రేయోశుభాలు ప్రాప్తించాలని, పుష్కలమైన ఉపాధి నీకు లభించాలాని ఆకాంక్షిస్తున్నాము!
ముఖ్య సూచనలు
సచ్చీలత, నిజాయితి నీ కార్యసిద్ధి రహస్యం అని, నిన్ను విజయ బాటన నడిపించే సుగుణం అని గుర్తుంచుకో.
 మనం చేసే పని పట్ల చిత్తశుద్ధి, అంకితభావం మనల్ని మన లక్ష్యానికి దగ్గర చేసే అత్యంత సులభ మయిన మార్గం.
 నగుమోము సంభాషణ నిన్ను ఎదుటి వ్యక్తి అభిమానించేలా చేస్తుందని మరువకు.
  గృహ రహస్యాల పట్ల అప్రమత్తత ఇతరులు నిన్ను ప్రేమించేలా చేసే అద్భుత అస్త్రం.
 నవ్వు పని చేస్తున్న ఇంటికి సంబంధించిన సకల వస్తుల సంరక్షణా బాధ్యత నీ మీదే ఉంటుంది. వాటిని ఒక అప్పగింతలా జాగ్రతగా కాపాడుకో.
 సత్ప్రర్తన, సత్య సంధత, సచ్చీలత అనే సుగుణాలు ఇతరులను నిన్ను నమ్మేలా చేస్తాయి.
 అందరి పట్ల గౌరవభావం కలిగి ఉండటమనేది నిన్ను వారికిష్టునిగా మారుస్తుంది.
అబద్దం ఓ వెకిలి చేష్ట. అది మాట వరసకు, నవ్వించడానికి అన్నా సరే.
తప్పుని ఒప్పుకోవడం, ఒప్పుని తెలుసుకొని మసలుకోవడం అనేది ఇతరులు నిన్ను మన్నించేలా,
    వారి మన్ననల్ని నువ్వు అందుకునేలా చేస్తోంది.   నీ వ్యకిగత సమస్యలనుగానీ, నీ ఇంటి వ్యవహారాలనుగాని నీ కఫీలుతో చర్చించి చులకన  కాకు.
 మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. కోపంగానీ, కాఠిన్యంగాని, ధ్వేష భావన గానీ మాటల ద్వారా వ్యక్తమవ్వకుండా జాగ్రత్త పడాలి.
 పెద్ద వయస్సు వృద్దుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. వారి అవసరాల్ని సమకూర్చడంలో కడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కువైటీ కుటుంబంలో వారికే ప్రథమ స్థానం ఇవ్వబడుతుంది గనక.
 కువైటీ ప్రజల జీవన శైలి
 1) గృహ ప్రతిష్ఠ:
 మీరు, మీ యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే అపరిచితులను యజమానుల అనుమతి లేనిదే లేక వారికి తెలియకుండా ఇంట్లోకి రానివ్వకూడదు. గృహస్థులు ఇంట్లో ఉన్నప్పుడు ఇతరులు రావడానికి అనుమతి ఉన్న వేళల్లోనే పిలవాలి.
ఇరుగుపొరుగు వారిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. స్వరం పెంచి మాట్లాడటంగానీ, చెత్తా చెదారం పడేయటంగాని, వారి ఇళ్ల ఎదుట వాహనాల్ని నిలబెట్టడంగాని, వారి ఇళ్ల ముందర గుమి గూడటంగానీ చేయకూడదు.
కువైటీ సమాజం అస్సలు ఇష్టపడని విషయం – తలుపుల్లోంచిగానీ, కిటికీల్లోంచిగాని, కప్పు పై నుంచిగాని, గోడల మీది నుంచిగాని ఇంటి లోపలకి తొంగి చూడటం,
2) సాప్తాహిక సమావేశాలు:
కువైటీ ప్రజలు సాప్తాహిక సందర్శనాల ద్వారా బంధుత్వ సంబంధాలను బల పర్చుకుంటారు.
భార్యాభర్తలిరువురూ సకుంటుంబ సపరివారి సమేతంగా వెళ్ళి సొంతవారిని సందర్శించి,  పరామర్శించి రావడాన్ని అమితంగా ఇష్టపడతారు.
కుటుంబ సభ్యులు పరస్పరం కలుసుకునే సమావేశాల్లో స్త్రీపరుషులు కలిసి మెలిసి ఉండటమనేది  చాలా అరుదు.
 పరస్పర సందర్శనాలు పండగ సమయం, పెళ్ళి సమయం-ఇత్యాది శుభ సందర్బాల్లో అధికంగా ఉంటాయి.
3) వస్త్రధారణలో హుందాతనం:
కువైటీ స్త్రీలకు చక్కటి అందమైన వస్త్రధారణ పట్ల మక్కువ అధికం. వారు సంస్కారం ఉట్టి పడేలా నిండు దుస్తులు ధరిస్తారు. అటువంటి సాంప్రదాయబద్ధమయిన దుస్తులు తన ఇంట్లో పని చేసేవారు కూడా ధరించాలని కోరుకుంటారు.
 దేహ పరిశుద్ధత, దుస్తుల పరిశుభ్రత చాలా కీలకాంశం.
కువైటీ స్త్రీలు శరీర ఒంపుసొంపులు కనపడకుండా చీలికలు లేని వదులు మరియు దళసరి దుస్తులు ధరిస్తారు. వారు తలకు స్కార్ఫు కూడా తప్పనిసరిగా వేసుకుంటారు. మరి కొందరు నిఖాబ్‌ కూడా ధరిస్తారు.
  4) ఇంటి వ్యవహారాల బాధ్యత:
భర్తే కుటుంబానికి యజమాని. ముఖ్య నిర్ణయాలు అతనే తీసుకుంటాడు. ఒకవేళ అతను నాన్న ఇంట్లో ఉంటే ఇంటి పెద్దగా తండ్రి వ్యవహరిస్తాడు.
 ప్రాకృతికంగా భర్తే కుటుంబానికి పెద్ద దిక్కు. ఇంటి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలన్నీ అతని   అధీనంలోనే ఉంటాయి.
కుటుంబంలో భర్త తల్లి (అత్త)కి ప్రత్యేక స్థానం, గౌరం ఉంటుంది.
 ప్రాజ్ఞ వయసుకు చేరని మగ సంతానంగానీ, ఆడ సంతానంగానీ  వారి వ్యక్తిగత వ్యవహారాల్లో తల్లి మీదే ఆధార పడతారు.
5) కువైటీ ప్రజల సహజసిద్ధమయిన లక్షణాలు:
1) కువైటీ పౌరుడు తన వ్యవహారాలన్నిటిలోనూ నిజాయితీపరుడయి ఉంటాడు. ముఖస్తుతినిగానీ,  రెండు నాల్కల ధోరణినిగాని సుతరామూ ఇష్టపడడు.
2) కువైటీ పౌరులు సహజసిద్ధంగా ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు.
3) కువైటీ ప్రజలు పని త్వరగా పూర్తి చేయడాన్ని, నిజాయితీగా వ్యవహరించడాన్ని ఇష్ట పడతారు.
4) కువైటీ మహిళ తన సంతానాన్ని అమితంగా ప్రేమిస్తుంది. గొప్ప ఆత్మ విశ్వాసం కలిగి ఉంటుంది.
5) కువైటీ పౌరులు తన దేశాన్ని ప్రేమిస్తారు, తన రాజ్యం పట్ల అంకితభావం కలిగి ఉంటారు.
6) విశ్రాంతి వేళల్లో ఇబ్బంది పెట్టడాన్ని కువైటీ ప్రజలు సుతరామూ ఇష్ట పడరు.
మార్గదర్శకాలు
 నీరు మరియు విద్యుచ్ఛక్తి మహదానుగ్రహాలు. కాబట్టి వాటిని వృధా ఖర్చు చేయకూడదు.
 గృహ శుభ్ర పరికరాలను అవసరానికి తగ్గట్టు మితంగా వాడాలి.
విద్యుత్‌ పరికరాలను వాడేటప్పుడు వాటి శక్తికి మించిన భారాన్ని వేయకుండా కడు అప్రమత్తంగా  వ్యవహరించాలి.
 ప్రమాదాలకు, దుర్ఘటనలకు గురి కాకుండా ఉండాలంటే గ్యాస్‌ను తెరిచి ఉంచకూడదు.
 ఎవరూ లేని ప్రదేశంలోని లైట్లను ఆర్పి వేయాలి.
 వేరే పనిలో నిమగ్నమయి ఉన్నప్పుడు నీళ్ళ పంపుల్ని తెరిచి ఉంచకూడదు.
 ఇంటిలోపల ఎటువంటి దుర్ఘటన, నష్టంగాని చోటు చేెసుకుంటే వెంటనే యజమానికి సమాచారం అందజేయాలి.
 స్వయంగా మీకు ఏదయినా సమస్య వచ్చి పడితే దాన్ని సయితం ముందు యజమానికి తెలియ జేయాలి.
 అన్యుల వల్ల జరిగే తప్పుల నుండి గుణపాఠం నేర్చుకో. ఆ తప్పు నీ వల్ల జరగకుండా జాగ్రత్త పడు.
  ఇతరులు పని చెయ్యమని గుర్తు చేయాల్సిన గత్యంతరం నీకు రాకుండా చూసుకో.
 పెద్దలను గౌరవించడం, పిల్లలను కనికరించడం నీ నిత్య చర్యగా మార్చుకో.
ఇంట్లో ప్రవేశించేటప్పుడు అనుమతి నిమిత్తం సలామ్‌ చేయడం, తలుపు తట్టడం, బెల్‌ నొక్కడం కనీస మర్యాద. ముఖ్యంగా గృహస్థులు ఉన్న సమయంలో, విశ్రాంతి వేళల్లోనైనా సరే.
గృహస్థులతో, అక్కడ పని చేెసే వారితో వీలైనంతగా మర్యాదపూర్వకంగా మాట్లాడు.
గృహస్థుల వస్తువులను సంరక్షించు. వాటిని వినియోగించక ముందు అనుమతి తీసుకోవడం మరచిపోకు.
 గృహస్థుల్తో, ముఖ్యంగా యువకుల్తో మరింత అప్రమత్తంగా వ్యవహరించు. స్త్రీపురుషుల ఎవరితో నయినా మరీ చనువు మంచిది కాదు.
 అతిథుల్ని సాదరంగా ఆహ్వానించాలి.
అనవసరమైన సంభాషణగానీ, అవసరం లేని విషయాల్లో తల దూర్చడంగాని అవాంఛనీయం.
హెచ్చు స్వరంతో మాట్లాడటంగానీ, పగలబడి నవ్వడంగానీ చేయకూడదు.
అరబీ ముఖ్యమైన వాడుక వాక్యాలు
అస్సలాము అలైకుమ్‌               (పరస్పరం కలుసుకున్నప్పుడు చేసుకునే అభివాదం)
వ అలైకుముస్సలామ్‌               (ప్రతిగా ఇచ్చే జవాబు)
ఈదుకుమ్‌ ముబారక్‌               (పండుగ సందర్భాల్లో)
రమజాన్‌ కరీమ్‌                    (రమజాను మాసంలో)
షుక్రన్‌, బారకల్లాహు ఫీక           (నీకు ఎవరయినా మేలు చేసినప్పుడు)
అఫ్వన్‌ లేదా ఆసిఫ్‌                 (క్షమాపణ కోరాలనుకున్నప్పుడు)
మిన్‌ ఫజ్లిక లేదా లౌ సమిహ్‌త       (అనుమతి కోరాలనుకున్నప్పుడు)
 కైఫ హాలుక                        (యోగక్షేమాల్ని విచారించాలనుకున్నప్పుడు)
అల్‌హమ్దు లిల్లాహి అలా సలామతిక  (ప్రయాణం నుండి లేదా ఆసుపత్రి నుండి వచ్చి వ్యక్తితో   కలిసినప్పుడు)
మఅస్సలామహ్‌                   (వీడ్కోలు పలకాలనుకున్నప్పుడు)
తఫజ్జల్‌, అహ్లన్‌ వ సహ్లన్‌, హయ్యాకుముల్లాహ్‌ా  (అతిథిని స్వాగతించేటప్పుడు)
 అమ్మీ గైర్‌ మౌజూద్‌ ఫిల్‌ మన్జిల్‌      (కఫీల్‌ – యజమాని ఇంట్లో లేరని చెప్పాలనుకున్నప్పుడు)
 అమ్మతీ గైర్‌ మౌజూదహ్‌ా ఫిల్‌ మన్జిల్‌  (కఫీలా – యజమానురాలు ఇంట్లో లేరని చెప్పాలనుకున్న  ప్పుడు)
తస్బహు అలా ఖైర్‌
సలామాత్‌, అల్ఫ్‌ సలామాత్‌, ఖతాకస్సూ. అలైకల్‌ ఆఫియా (జబ్బు నుండి స్వస్థత కోరుతూ)
మబ్రూక్‌                            (శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నప్పుడు)
బిల్‌ బరకహ్‌, మన్జిల్‌ బరకహ్‌        (ఇల్లు కొన్నప్పుడు)
తకబ్బలల్లాహు                      (ఆరాధనలు నిర్వహించిన తర్వాత)
ప్రథమ చికిత్స
అగ్ని ప్రమాదం:
1) సంబంధిత వ్యక్తి తల్లితంద్రులకు సమాచారం అందజేయండి. ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రక్కనే  నిలబడండి.
2) ప్రమాదానికి గురైన వ్యక్తిని ప్రాణాపాయ స్థలం నుండి బైటికి తీసే ప్రయత్నం చేయండి.
3) ఒకవేళ సదరు వ్యక్తి బట్టలకు నిప్పంటుకుంటే కంబళిని ఉపయోగించి మంటల్ని ఆర్పండి.
4) కాలిన చోటును మీ చేత్తో తాకకండి.
5) మీకు మీరుగా ఎటువంటి ఆయిన్ట్‌మెంట్‌ని పూయడంగానీ, బ్యాండేజిని కట్టడంగాని చేయకండి.
పగుళ్ళు:
పగళ్ళు అంటే, ఒక చోటగానీ, అనే చోట్లగాని చీలిక ఏర్పడం.
పగుళ్ళ నివారణ:
1) సంబంధిత వ్యక్తి తల్లితంద్రులకు సమాచారం అందజేయండి. ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రక్కనే  నిలబడండి.
2) విరిగిన భాగాన్ని కదిలించకండి.
3) ఎటువంటి ప్రమాదం చోటు చేసుకున్నా అంబులెన్స్‌ కోసం వేచీ చూడండి. మీకు మీరుగా
    ఎలాంటి ముందస్తు చర్యలకు పాల్పడకండి.
రక్తస్త్రావం మరియు గాయాలు:
రక్తస్త్రావమంటే గాయమవ్వడం చేత, లేదా తెగడం చేత ఒకింత రక్తాన్ని కోల్పోవడం.
గాయాల నివారణ:
1) సంబంధిత వ్యక్తి తల్లితంద్రులకు సమాచారం అందజేయండి. ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రక్కనే నిలబడండి.
2) అంబులెన్స్‌ కోసం వేచీ చూడండి. మీకు మీరుగా ఎలాంటి ముందస్తు చర్యలకు పాల్పడకండి.
విష పదార్థాలు:
విషం అంటే, ఏ పదార్థమయితే తగు మోతాదులో శరీరంలో ప్రవేశిస్తే మానవ ప్రాణానికి హాని కలిగే, లేదా శరీరావయవాలు పని చేయకుండా పోయే ప్రమాదముంటుందో అది.
విషం సంక్రమించే మార్గాలు:
1) వాసన చూడటం (గ్యాస్)
2) మింగటం  (ఘనములు, ద్రవములు)
3) కుట్టడం (జంతువు కొరకటం, పురుగులు కుట్టడం)
4) పీల్చడం (పురుగుల మందు, క్రిమి సంహారకాలు)
విషం రకాలు:
1) ప్రమాదకర విష పదార్థాలు (ఇంటి శుభ్రం చేసే ద్రవ పదార్థాలు, పెట్రోల్‌తో తయారయిన వస్తువులు)
2) ప్రమాదకరం కాని విష పదార్థాలు  (క్రిమి సంహారకాలు, లేదా పాడయిపోయిన ఆహారపదార్థాలు)
విష ప్రభావ చిహ్నాలు:
1) పెదాలపై మచ్చలు ఏర్పడటం. (మరకలు లేదా మచ్చలు)
2) నోటిలో మరియు గొంతులో తీవ్రమయిన నొప్పి కలగటం.
3) వాంతి కావడం, వికారంగా అన్పించడం.
4)  ఉదర తిమ్మిరి, విరోచనాలు
5) మాట రావడం కష్టమవడం.
6) శ్వాస పీల్చేటప్పుడు దుర్వాసన రావడం.
విష నివారోపాయాలు:
1) సంబంధిత వ్యక్తి తల్లితంద్రులకు సమాచారం అందజేయండి. ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రక్కనే నిలబడండి.
2) గాలి వెళ్లే (తలుపులు, కిటికీలు) ద్వారాలు తెరవాలి.
3) వాంతుల చేయమని ఒత్తిడి చేయకూడదు.
4) నోటి ద్వారా ఏ వస్తువును ఇవ్వకూడదు.
5) సేవించబడిన విష పదార్థమేదో తెలుసుకోవాలి. తద్వారా సరైన వైద్యం చేయడానికి సులభమవుతుంది.
6) ప్రమాదానికి గురయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలి.
  కొన్ని ముఖ్యమైన నెంబర్లు దిశ                      ఫోన్‌ నెంబరు
ఆంబులెన్స్‌
ఫైర్‌ ఇంజన్‌                        112
హెల్ప్‌ సెంటర్‌

Related Post