Originally posted 2013-07-07 17:08:25.
వస్త్రధారణ మరియు ఇస్లాం
మనిషి తన దేహాన్ని కప్పి ఉంచడానికి ధరించే వాటిని దుస్తులు, వస్త్రాలు అంటారు. మానవ సమాజంలో నివసించే ప్రతి మనిషి బట్టలు ధరిస్తాడు. ఈ కారణంగానే సృష్టిలోని ఇతర సృష్టితాల మధ్య ప్రత్యేకతను సంతరించుకున్నాడు మానవుడు. ఇక దుస్తులు ధరించే పద్ధతి సాంఘిక, భౌగోళిక, ఆర్థిక, శారీరక స్థితిపై ఆధారపడి ఉం టుంది. చేసే పనిని బట్టి, ప్రాపంచిక, పారలౌకిక లక్ష్యాన్ని బట్టి, ఆయా వేళా విశేషాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని బట్టి శరీరానికి అను గుణమయిన దుస్తులు ధరిస్తాడు మానవుడు. చెట్ల ఆకుల నుండి మొదలయిన మానవ దుస్తుల చరిత్ర, జంతు చర్మాలు, నార బట్టలు మొదలు దూది దుస్తులు, కాటన్, టెరికాటన్, సిల్కు, ఖద్దర్ మొదల యిన ఆధునిక దుస్తుల వరకు సాగింది.
మానవాభ్యుదయ క్రమంలో దుస్తులు వయసును బట్టి, లింగ భేధాన్ని బట్టి, సమయం సందర్భాన్ని బట్టి ధరించాలన్న నియతి, నియమావళి చోటు చేెసుకుంది. కొన్ని ప్రదేశాలలో తెల్లని దుస్తులు సంతాపానికి చిహ్నమయితే, మరికొన్ని ప్రాంతాల్లో సంతోషానికి ఆనవాళ్ళు. కొన్ని జాతుల్లో నల్లరంగు బట్టలు ఆనందానికి ఆనవాలుగా ఉంటే, ఇంకొన్ని జాతుల్లో దుఃఖానికి గుర్తు. ఇలా విభిన్న సంస్కృతుల, సంప్రదాయాల మేలు కలయిక దుస్తులు. ఈ నేపథ్యంలో చెప్పిన మాటే ‘నీకు నచ్చిన ఆహారం భుజించు, పలువురు మెచ్చుకునే దుస్తులు ధరించు’.
మొత్తానికి ఒక విషయం మాత్రం స్పష్టం-దుస్తులు శరీర శోభను, సౌందర్యాన్ని ఇనుమడింప జేయడంతోపాటు మర్మ స్థానాలను కప్పి ఉంచుతాయి. దుస్తుల ఈ మూల ఉద్దేశాన్ని తెలియజేస్తూ పరమోన్న తుడయిన అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”ఓ ఆదం సంతతివార లారా! మేము మీ కోసం దుస్తుల్ని దించాము. అవి మీ మర్మస్థానాల ను కప్పి ఉంచడమే కాకుండా, మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి. అయితే దైవభీతి దుస్తులు ఇంతకన్నా మంచివి. ఇవి అల్లాహ్‌ా సూచనల్లోనివి. బహుశా అలాగయినా వారు హితోపదే శం గ్రహిస్తారని ఆశించబడుతోంది”. (ఆరాఫ్; 26)
మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు దుస్తులు మనిషికి రెండు విధాల ఉపయోగపడతాయి. 1) అవి మనిషి ‘సౌఅత్’ అంటే, కప్పిం ఉంచవలసిన ఆవయవాలను కప్పుతాయి.2) అవి మనిషి ‘రీష్’ అంటే, అందాన్ని, అలంకరణను పెంచుతాయి. పై వచనంలో మరో రకం దుస్తుల ప్రస్తావన కూడా ఉంది. అవే తఖ్వా దుస్తులు. భయభక్తుల దుస్తులు. దీని అంతరార్థం-దుస్తులు మనిషిలో గర్వాన్ని, అహంభా వాన్ని సృజించేవిగా కాకుండా దేవుని పట్ల భీతిని, భక్తిని, అణకువను పెంపొందించేవిగా, సదాచరణల వైపు పురికొల్పేవిగా ఉండాలి.
ఇస్లాం ధర్మం పరిశుభ్రతను, సౌందర్యాన్ని ప్రోత్సహించే ధర్మం. ”నిశ్చయంగా అల్లాహ్ స్వతహాగా సుందరాంగుడు. ఆయన సౌంద ర్యాన్ని ఇష్ట పడతాడు” అన్నారు మహా ప్రవక్త ముహమ్మద్ (స). అంటే సభ్యతా సంస్కారాలు ఉట్టి పడే మంచి దుస్తులు, అందమయిన దుస్తుల్ని తొడగటంలో-అవి ఖరీదయినవైనా తప్పు లేదు. కానీ; లేని ఆడంబరాలు, అట్టహాసాలకన్నా నిరాడంబరత వాంఛనీయం, సర్వా మోదం అంటుంది ఇస్లాం. మనిషి ధరించే దుస్తుల ద్వారా అతనిలో మానవీయత, వినయవినమ్రతలు, దైవం పట్ల భయభక్తులు వ్యక్తమ వ్వాలి. ఓ సందర్భంగా దైవప్రవక్త (స) వారు: ”ఎవరి హృదయంలో నయితే రవ్వంతయినా గర్వముంటుందో అతను స్వర్గంలో ప్రవేశించ లేడు” అన్నారు. అది విన్న ఓ సహచరుడు ‘ఓ దైవప్రవక్తా! ఒక వ్యక్తి తన పాద రక్షలు, బట్టలు బాగుండాలని కోరుకుంటాడు. ఇదీ గర్వం క్రిందికే వస్తుందా?’ అని విన్న వించుకున్నాడు. అందుకు దైవప్రవక్త (స)-”కాదు; గర్వం అంటే తన్నుతాను గొప్పగా భావించుకొని ఇత రులను చులకన భావంతో చూడటం” అన్నారు.
మరో సందర్భంలో ఆయన ఇలా ఉపదేశించారు: ”ఎవరయితే అల్లాహ్ ప్రసన్నత కోసం ఆడంబరాలకు పోకుండా నిరాడంబరతను, వినయ వినమ్రతలను అవలంబిస్తాడో అల్లాహ్ అతన్ని అంతే ఎత్తుకు తీసుకెళతాడు”. అదెలా ఉంటుందంటే, అతను స్వీయ దృష్టిలో తన్ను తాను అల్పునిగా భావిస్తాడు కానీ; ప్రజలు అతన్ని గొప్ప వ్యక్తిగా గుర్తించి గౌరవిస్తారు.
మరెవరు ఎంతగానయితే గర్వం, అహంభావానికి లోనవుతాడో అల్లాహ్ అతన్ని అంతగానే అధఃపాతాళానికి తొక్కివేస్తాడు. అదెలా ఉంటుందంటే, అతను ప్రజల దృష్టిలో అల్పాతిఅల్పునిగా, నీచాతినీచు నిగా ఉంటాడు. కానీ; స్వీయ దృష్టిలో మాత్రం తానో యుగ పురుషు డన్న అహంతో ఉంటాడు. వాస్తవంగా అతని స్థానం ప్రజల దృష్టిలో – కుక్కలకన్నా, పందులకన్నా హీనంగా ఉంటుంది”. (బైహఖీ)
ఇంకో సందర్భంలో ఆయన ఇలా ఉపదేశించారు: ”నిశ్చయంగా అల్లాహ్ నా వైపు వహీ పంపి వినయవినమ్రతలను అవలంబించమని ఆదేశించాడు. దీని ప్రభావంగా ఒకరు ఇంకొకరిపై దౌర్జన్యానికి పాల్ప డరాదు. ఎవరూ, ఎవరిపై గర్వించకూడదు”. (ఆబూ దావూద్)
కాబట్టి, ఖరీదయిన దుస్తులు ధరించి, ఖరీదయిన కార్లలో తిరు గుతూ, ఖరీదయిన బంగళాలలో నివసించే వారందరూ ఖరీదయిన వారు కారు. కారణం – వారికి దైవంచే ప్రాప్తమయి ఉన్న వరాను గ్రహాలు వారిని దురహంకారానికి లోను చేశాయి. ఘనతా గౌరవం, గొప్పతనమంతా వారిదేనని విర్రవీగుతూ, ఇతర ప్రజల పట్ల గర్వం, పొగరుబోతుతనం, తలబిరుసుతనంతో వ్యవహరించారు, ఫలితంగా శిక్ష అనుభవించక తప్ప లేదు. అందుకు ఫిర్‌ఔన్, ఖారూన్, నమ్రూద్ చరిత్రే ప్రత్యక్ష సాక్షి! ‘మరి వాడు అంగరంగ వైభవంతో తన జాతి ప్రజలలోకి కదిలి వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక జీవితాన్నే కోరుకునే వారు, ”ఖారూనుకు ప్రసాదించబడినదే మాకు కూడా లభిస్తే ఎంత బాగుండును! నిజంగా అతను గొప్ప భాగ్యవంతుడన్నారు”. (అయితే అతనిలో గల గర్వాహంకారాల కారణంగా, అతను ఇతరులను చుల కన భావంతో చూసిన కారణంగా, అతనికి దేవుడు ఉపకారం చేసి నట్టు ఇతరులకు అతను ఉపకారం చేయని కారణంగా, దైవ అవిదే యతకు పాల్పడిన కారణంగా ఎట్టకేలకు) మేమతన్ని, అతని నిల యాన్ని నేలలో కూర్చి వేశాము. అప్పుడు అల్లాహ్‌ా బారి నుంచి అతన్ని ఆదుకోవడానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు’. (ఖసస్; 80,81)
నేనే సర్వాంతర్యామిని అని బీరాలు పోయిన ఫిరౌన్‌కు పట్టిన దుర్గతి గురించి అల్లాహ్ ఇలా సెవిచ్చాడు:”వారు ఎన్నో తోటలను, ఊటలను వదలి పోయారు. మరెన్నో పచ్చని పొలాలను, చక్కని నిలయాలను, ఇంకా తాము అనుభవిస్తూ ఉండే విలాసవంతమయిన వస్తువు సామ గ్రిని కూడా (వదలి పోయారు). అంతా ఇట్టే అయిపోయింది. మేము మరో జాతి వారిని వాటన్నింటికీ వారసులుగా చేశాము. వారికి బట్టిన దుర్గతిపై నింగీ ఏడ్వలేదు, నేలా రోధించలేదు. వారికి (కనీసం) గడువు కూడా లభించలేదు”. (దుఖాన్: 25-29)
దైవప్రవక్త (స) వారు ఓ సందర్భంలో ఇలా హితోపదేశం చేశారు: ‘ఓ ఆదం పుత్రుడా! నా ధనం, నా ధనం అంటున్నావే ఏది నీ ధనం? నువ్వు తిని ఆరగించింది నీది. నువ్వు తొడిగి పాత చేసింది నీది. ముందస్తుగా సత్కార్యాలు చేసి పరలోకానికి పంపుకున్నది నీది; అంతే. మిగిలినదంతా నీ వారసులది’.
అవును ”ఎవరు భూమిలో బడాయిని ప్రదర్శించకుండా, కల్లోలాన్ని రేకెత్తించకుండా ఉంటారో వారి కోసమే మేము పరలోక నెలవును ప్రత్యేకించాము. సత్ఫలితం భయభక్తులు గలవారికే సుమా!” (అల్ ఖసస్:83) అంటున్నాడు అల్లాహ్.
అంటే, మనం తొడిగే దుస్తులు సయితం మన సొంతం కాదు, అల్లాహ్ ప్రసాదితం అంతే. అవి తొడిగినప్పుడు, వాటిని తొడుగుతూ ఒకరిని చూసినప్పుడు పాటించాల్సి కనీస మర్యాదను తెలియజేస్తూ
దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: కొత్త బట్టలు తొడిగే వ్యక్తి – ”నా మర్మస్థానాలను కప్పుకోవడానికి, జీవితంలోని అలంకరణను ఆస్వా దించడానికి అనువైన దుస్తుల్ని నాకు ప్రసాదించిన అల్లాహ్‌కు వేనవేల కృతజ్ఞతలు”. కొత్త బట్ట తొడుగుతూ ఒకరిని చూసినప్పుడు – ”కొత్త బట్టలు ధరించు, ప్రశంసార్హమయిన జీవితం జీవించు, వీర మరణాన్ని పొందు”. అని దీవించాలన్నారు.
కూడు, గూడు, గుడ్డ అనేవి ప్రతి మనిషి కనీస అవసరాలు. గుడ్డ కట్టిన తర్వాతే మనావుడు నాగరికుడయ్యాడు. ఈ బట్ట ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఖుర్‌ఆన్ ఇలా పేర్కొంటుంది: ”ఆయనే మీ కోసం మిమ్మల్ని వేడిమి నుండి కాపాడే చొక్కాలను, యుద్ధ సమయంలో మీకు రక్షా కవచంగా ఉపయోగ పడే చొక్కాలను కూడా చేశాడు”. (నహ్ల్; 81)
అంటే దుస్తులు, మానవ దేహాన్ని కప్పడం, అతని ఆలంకారాన్ని పెంచడమేకాక, అవి అతన్ని వేసవిలో, శీతాకాలాల్లోని ప్రకృతి వైపరీత్యాల నుండి కూడా రక్షిస్తాయి. యుద్ధ సమయంలో శత్రువుల తరఫు నుండి జరిగే కత్తిపోట్ల నుండి, ఖడ్గపు వేట్ల నుండి కాపాడ తాయి. దుస్తుల అభివృద్ధి క్రమంలో బలమయిన ఇనుప కవచాలు తయారు చేసిన మొదటి వ్యక్తి ప్రవక్త దావూద్ (అ). ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మీ కోసం, రక్షనార్థం, ఒక (ప్రత్యేక) వస్త్రాన్ని అల్లె కళను మేమతనికి (దావూద్‌కి) నేర్పాము.తద్వారా మీరు యుద్ధంలో (వేటు పడకుండా) రక్షణ పొందటానికి! మరి మీరు కృతజ్ఞులగా మసలుకుం టున్నారా?” (అన్బియా; 80)
సాధారణంగా మనిషి తనకు కూడు, గూడు, గుడ్డ ఉంటే చాలు తాను సంక్షేమంగా ఉన్నట్టే భావిస్తాడు. ఆ దిశలోనే అతని తాపత్ర యం, ప్రయత్నం సాగుతుంది. పరిసరాల, సభ్యతా సంస్కారాలను మాత్రం విస్మరిస్తాడు. ఇది పొరపాటే కాదు; నేరం కూడాను. ఎందుకంటే, కూడు, గూడు, గుడ్డ పుష్కలంగా ఒనగూడినా, అనేక సామాజిక రుగ్మతలు అతన్ని పీడిస్తాయి. ప్రాణాలు, ప్రాణాధికమయిన మానాలును హరిస్తాయి. ఆర్థికానికి, ఆధ్యాత్మికానికి మధ్య సరయిన సమతుల్యం లేకపోతే మహమ్మారి రోగాలు పెచ్చు మీరుతాయి. కాబట్టి కూడు, గూడు, గుడ్డతోపాటు మనిషిగా మనం పాటించాల్సిన కనీస నైతిక ధర్మానికి కట్టుబడి జీవించడం మనంది విద్యుక్త ధర్మం, ప్రథమ కర్తవ్యం కూడా.
ఆధునికత ముదురుతున్న కొద్దీ మనిషిలో సంస్కారం పెరుగుతుం దన్నది సర్వసాధారణంగా కలిగే భావన. కాని నిజం దానికి పూర్తి భిన్నంగా ఉంది. తప్పు మనలో పెట్టుకొని కాలాన్ని, సమాజాన్ని దూషించడం వివేకం అన్పించుకోదు. మార్పు మనలో కాకూండా ఎదుటి వ్యక్తుల్లో, వ్యవస్థల్లో కోరుకోవడం అవివేకమే కాదు, నేరం కూడాను. కాబట్ట స్వేచ్ఛ ఉంది కదా అని ఎలా పడితే అలా జీవించ డం, ఎలా పడితే అలాంటి దుస్తుల ధరించడం సమంజసం కాదు.
హజ్రత్ జాబిర్ (ర) గారి కథనం – ”దైవప్రవక్త (స) వారు మా వద్ద కు వచ్చారు. అప్పుడు ఆయన ఓ వ్యక్తిని చింపిరి జుత్తుతో ఉండటం గమనించారు. ‘ఏమిటి అతని వెంట్రుకలు సవరించుకునే వస్తువేదీ అతనికి దొరకలేదా? (అతను తన వెంట్రుకల్ని చక్కగా సవరించుకుని ఉంటే ఎంత బావుండు!)’ అన్నారు. మరో సందర్భంలో ఆయన మరో వ్యక్తి మురికి బట్టలతో ఉండటం గమనించారు. ‘ఏమిట, అతనికి తన బట్టలు ఉతుక్కోవడానికి నీళ్ళు ఏమయినా కరువయ్యాయా?’ అన్నారు”. (అబూ దావూద్, నసాయీ)
దుస్తులు మనిషిలో కనబడకూడని అవయవాలను కప్పి ఉంచుతాయి. అతనికి అలంకారప్రాయంగా ఉంటాయి. ఈ కారణంగానే అల్లాహ్‌ా భార్యాభర్తల్ని ఒండొకరికి దుస్తుల వంటి వారు అని సంబోధించాడు: ”వారు మీకు దుస్తులు. మీరు వారికి దుస్తులు” (బఖరా)
కనీస ఆచ్ఛాదన పరిమితులు:
మానవ దేహంలో బట్ట కప్పవలసిన కనీస ఆచ్ఛాదనా భాగాన్ని అరబీలో ‘సతర్’ అంటారు. నాభి నుండి మోకాళ్ళ క్రింది వరకు గల భాగం పురుషునికి సతర్‌గా నిర్ణయించబడింది. ఓ సారి ఓ వ్యక్తి బరు వయిన బండరాయిని మోసుకెళుతున్నాడు. అప్పుడు అతని నడుంకి చుట్టబడి ఉన్న వస్త్రం జారి పోయింది. ఆ వ్యక్తి ఆలానే నగ్నంగా నడిచి వెళుతున్నాడు. అది గమనించిన దైవప్రవక్త (స) ఆ సదరు వ్యక్తి నుద్దేశించి – ‘ఏమిటి నీ ఈ పరిస్థితి?’ అని ఆరా తీసారు. అందుకా వ్యక్తి ఓ దైవప్రవక్తా! నా ఆచ్ఛాదన జారి పోయింది. ఈ బండరాయిని తన స్థానానికి చేర్చనంత వరకు నేను బట్ట తొడుక్కోవడం కుదరదు అన్నాడు. అప్పుడు దైవప్రవక్త (స) – ‘వెళ్ళు ముందు బట్టలు తొడుక్కో’ అని హితవు పలకడంతోపాటు, అక్కడ ఉన్న ప్రజల్ని ఉద్దేశించి ”మీరు నగ్నంగా తిరగకండి” అన్నారు.
పోతే, స్త్రీ కోసం ఆమె ముఖం, ముంజేతులు, పాదాలు తప్ప ఇతర శరీర భాగాలన్నీ సతర్‌గా నిర్ణయించ బడ్డాయి. ఇతర స్త్రీల ముందు సయితం ఆమె కనీస ‘సతర్’ను పాటించాలి. ఈ నేపథ్యంలో చెప్పిన మాటే స్త్రీలుగానీ, పురుషులుగానీ స్నానాల గదిలో సయితం పూర్తి వివ స్త్రలయి స్నానం చేయడం హర్షనీయం కాదన్నది.
నేడు మనకు కనబడే వింత ఏమిటంటే, తామెంతో నాగురికులం, అభ్యుదయ భావాలు కలిగిన వారమని బీరాలు పొయే నేటి పాశ్చాత్య నగారికతా పిపాసులు, పురుషులకు మాత్రం ఫుల్ సూట్ ప్రసాదించి, స్త్రీలను మాత్రం అర్థ నగ్న, ముప్పాతిక నగ్న వస్త్రధారణలో చూడదలు చుకుంటున్నారు. కొన్ని బీచ్‌లలోనయితే బట్టల తొడుక్కోవడానికి అనుమతే లేదు. ఇదేదో గొప్ప అభ్యుదయ భావాలు గల వ్యక్తులు అవ లంబిస్తున్న ఘన సంస్కృతి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ముమ్మా టికి ఇది వారి కుసంస్కృతికి, నీచ ప్రవృత్తికి ప్రబల తార్కాణం.
ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం అవిశ్వాసులు, విగ్రహారాధకులు (నేటికీ కొన్ని దేశాలలో ఆ దుష్కృతి ఉంది) బట్టలు విడిచేసి నగ్నంగా ప్రదక్షి ణలు చేసేవారు. పైపెచ్చు వారు తమ ఈ చేష్టను సమర్థించుకోవడాని కి ‘మా తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ప్రదక్షిణ చేస్తున్నామ’ని సగర్వంగా చెప్పుకునే వారు. అంతే కాదు – ‘మేము దుస్తులు ధరించినప్పుడే దేవుని అవిధే యతకు ఒడిగట్టే వాళ్ళం. కాబట్టి ఆ దుస్తుల్లో కాబా గృహ ప్రదక్షిణ చేయడం భావ్యం కాదు’ అనేవారు. అందుకే నగ్న ప్రదక్షిణలు చేసేవారు. ‘కామా తురాణాం నభయం నలజ్జ’ అన్నట్టు భక్తి అనే మత్తులో వారి స్త్రీలు కూడా దాదాపు నగ్నంగానే ప్రదక్షిణ చేసేవారు. తమ మర్మవయవాల వద్ద కాసింత గోచి తగిలించుకునేవారు అంతే. తాము ఒడిగడుతున్న ఈ లజ్జాహీన చేష్ట కోసం వారు రెండు సాకులు చెప్పేవారు. ఒకటి – మా పూర్వీకులు సయితం ఇలా చేస్తుండగా చూశాము. రెండు – ఈ విధంగా చేయమని స్వయంగా దేవుడే మమ్మల్ని ఆదేశించాడు. దీన్ని ఖండిస్తూ ఖుర్‌ఆన్ ఇలా అంటుంది:
”ఇటువంటి సిగ్గుమాలిన పనులు చెయ్యమని అల్లాహ్ ఎన్నటికీ ఆజ్ఞా పించ లేదు. మీకు ఏ వషయాలయితే తెలియవో అటువంటి వాటిని అల్లాహ్‌కు ఆపాదిస్తున్నారా?అని ఓ ప్రవక్తా! వారిని (నిలదీసి) అడుగు”.
షైతాన్ మనుషుల్ని రెండు మార్గాల్ని అనుసరించి వివస్త్రల్ని చేస్తాడు. ఒకటి అభ్యుదయ(వాంఛల)ముసుగు, రెండవది – ఆధ్యాత్మిక (భక్తి)ముసుగు. ఈ కారణంగానే సమస్త మానవాళిని ఖుర్‌ఆన్ ఇలా హెచ్చరిస్తోంది: ”ఓ ఆదం సంతతి వారలారా! షైతాను మీ తల్లిదం డ్రులను స్వర్గం నుండి బయటికి తీయించి, వారి మర్మ స్థానాలను వారికి కనిపించేలా చేయ టానికి వారి దుస్తుల్ని ఎలా తొలగింప జేశాడో అలాగే వాడు మిమ్మల్ని కూడా చెరపకూడదు సుమా! వాడూ, వాడి సైన్యం, మీరు వారిని చూడలేని చోటు నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. మేము అవిశ్వాసులకు షైతానులను స్నేహితులుగా చేశాము”. (ఆరాఫ్: 27)
తాత్విక దృష్ట్యా స్త్రీపురుషులిద్దరూ సమానం అనుకున్నా ప్రాకృతిరీత్యా వారిద్దరిలో వ్యత్యాసం ఉందనే సత్యాన్ని మనం అంగీకరించక తప్పదు. పురుషుని అక్రమ బలాత్కారం నుండి స్త్రీని కాపాడటానికి అశ్లీలత వ్యాప్తికి తావు లేని ఆరోగ్యవంతమయిన సమాజాన్ని నిర్మిం చేందుకు ఇస్లాం కట్టుదిట్టమయిన చర్యలే చేపట్టింది.
దైవ ప్రవక్త (స) ఓ సారి ఇలా అన్నారు: ”దుస్తులు ధరించి కూడా దిగంబరంగా ఉండి, ఇతరుల్ని ఆకట్టుకోవడం, ఇతరులచే ఆకర్షింప బడటం చేస్తూ మదమెక్కిన ఒంటెలాగా మెడ వంకరగా పెట్టి మిడిసి పడుతూ నడిచే స్త్రీలు ఎప్పటికీ స్వర్గంలో ప్రవేశించలేరు. అసలు దాని సువాసనను సయితం ఆఘ్రాణించ లేరు”. (ముస్లిం)
కొందరు భావించినట్లు ఇస్లాం స్త్రీలపై ఎటువంటి అనవసర ఆంక్షలు విధించలేదు. అయితే శృతి మించిన అలంకరణలపై, ఫ్యాషన్లపై అది ఆంక్షలు విధించిందన్న మాట వాస్తవం. స్త్రీలు బయటకి వెళ్ళేటప్పుడు ఘాటైన వాసన గల సెంటుగానీ, అత్తరుగానీ పూసుకొని, పూలు పెట్టుకొని వెళ్ళకూడదు అన్న మాట నిజం. మనం నిశితంగా ప్రశాంత హృదయంతో ఆలోచించనట్లయితే, చట్టంలోని లొసుగులతో పాటు, నేడు స్త్రీలపై జరుగుతున్న ఆత్యాచార కారణాల్లో, పురుషహం కారం, అశ్లీల సాహిత్యం, సినిమాలు, సిరీయళ్లే కాక స్త్రీలు ధరించే అరకొర దుస్తులు, విసిరే కొంటె చూపులు కూడా ఒక కారణం అన్నది విస్పష్టం.
ఇస్లాం అశ్లీలాన్ని, ఆరాచకాన్ని, అత్యాచారాన్ని పూర్తిగా రూపుమాపి, ఆరోగ్యవంతమయిన సమాజాన్ని నిర్మించగోరుతుంది. కాబట్టి ఇటు వంటి వెకిలి చేష్టలను మొగ్గలోనే త్రుంచివేయదలుస్తుంది. ఆ నిమిత్తం ఇస్లాం స్త్రీకి ప్రసాదించే రక్షక కవచం పరదా. దీన్ని ప్రగతి పథంలో ప్రతిబంధకంగా ప్రజలు భావించినా, పడతి భావించినా ఆ తప్పు అ ప్రజలది, పడితిదేగానీ పరదాది ఎంత మాత్రం కాదు. మనం మన నిత్య జీవితంలో గమనించే విషయమేమిటంటే, వస్తువు ఎంత విలువ యినదై ఉంటుందో దాన్ని మనం అంతే భద్రంగా దాచి పెడతాము. ఇస్లాం దృష్టిలో ప్రపంచ సకల సంపదలకంటే మహోత్కృష్టమయినది సుగుణవతి అయిన స్త్రీ. కాబట్టి ఇస్లాం ఆమె కోసం పరదా ఆదేశం ఇచ్చి ఆమెను గౌరవించింది. దీనికి భిన్నంగా నేటి పాశ్చాత్య పోకడలు, అది నడిపే వర్తకాలు మానవతకే కళంకంగా నిలుస్తున్నాయి. వ్రీడ బరువుకు వాలి ఉండే పడతి కనులకు బరి తెగించి, చంచలంగా చూపు కలిపే విద్య నేర్పించడం దానికి తెలిసినంతగా ఇంకే సంస్కృతికి తెలియదు. ఈ నేపథ్యంలో ఇస్లాం ఇచ్చే సందేశమేమి టంటే,”(ఓ ప్రవక్తా!) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్‌ాకు తెలుసు”. (నూర్:30)
”(ఓ ప్రవక్తా!) ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తన మర్మ స్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గతమై (ముఖం, చేతులు, కాళ్ళు) ఉండేది తప్ప – తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణీలు వేసుకోవాలనీ….వారికి చెప్పు”. (నూర్: 31)
‘అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం’ అన్నాడో కవి. ఆ కవి భావనలోని ‘అందం’లో ఆత్మ సౌందర్యం ఉందో లేదో తెలియదు గాని, ఆత్మ సౌందర్యం లేని అందం, ఆనందం వల్ల తాత్కాలికమయిన మకరందం మాత్రమే లభిస్తుంది. కాబట్టి అందం, సంస్కారవంతమ యిన దుస్తలతోపాటు ఆత్మ సౌందర్యం, దైవభీతి కూడా ఉన్నప్పుడే జీవిత మకరందంతోపాటు శాశ్వతమయిన ఆత్మానందం లభిస్తుంది. అదే స్థితిలో మరణం వస్తే స్వర్గం లభిస్తుంది. ఎందుకంటే ఆత్మసౌంద ర్యం లేని అందం అహంకారాన్ని తెచ్చి పెట్టి అనర్థాల, అపకీర్తి, ఆవ మానాల పాలు చేస్తుంది. సర్వజ్ఞుడయిన అల్లాహ్‌ా మన నయన నైచ్యాన్ని, హృదయ హైన్యాన్ని సయితం ఎరిగి ఉంటాడన్న భావనతో మసలుకోవడంలోనే మానవ శ్రేయం దాగుంది.
వస్త్రధారణ మర్యాదలు
1) ధర్మసమ్మతమయిన దుస్తులు: మన దేహ దారుఢ్యముగానీ, మన ముఖ సౌందర్యముగానీ, మన దుస్తుల ఆలంకరణగానీ దైవ విధేయతా మార్గంలో సహాయ పడగలిగితేనే వరం. అలా జరగాలంటే మనం తొడిగే బట్టలు ధర్మసమ్మతమయినవై ఉండాలి. ఎందుకంటే అధర్మ దుస్తులు ధరించిన వ్యక్తి ప్రార్థన స్వీకరించబడదు అని దైవప్రవక్త (స) వారు తాకీదు చేసి ఉన్నారు.
2) ఇస్లాం ‘ఉర్ఫ్’ను గౌరవిస్తింది: ఇస్లాం ‘ఉర్ఫ్’ను- సాంప్రదాయాన్ని, అది ధర్మ విరుద్ధం కానంత వరకూ గౌరవిస్తుంది. ఈ నియమాన్నను సరించి ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో అమలులో ఉన్న వస్త్రధార ణను అవలంబించే వెసులుబాటును ఇస్లాం ఆయా ప్రజలకు కల్పి స్తుంది. అయితే ఒక ప్రాంతంలో, ఓ ప్రత్యేక రంగు దుస్తులు ఓ
ప్రత్యేక మత చిహ్నంగా ఉంటే అటువంటి దుస్తులకు ముస్లింల దూరంగా ఉండాలంటుంది. ఈ నియమం ఒక దుస్తుల విషయంలోనే కాక, జీవిత అన్ని రంగాలకు వర్తింపజేస్తుంది. ఉదాహరణకు-ఓ ప్రదేశంలో పూర్వమో, ప్రస్తుతమో మిథ్యాదైవాల కోసం పశుబలి జరుగుతున్నట్లయితే అటువంటి ప్రదేశాల్లో జంతువును జిబహ్ చేయ కూడదంటుంది.
3)చిత్రాలు, వ్యర్థ వాక్యాలు గల దుస్తులు ధరించడం అవాంఛనీయం:
మనుషులు, జంతువులు, పక్షుల ఇతర ప్రాణుల చిత్రాల గల దుస్తులు ధరించడాన్ని ఇస్లాం నిషేధించింది. నేడు మనకు సర్వసాధారణంగా కనబడుతున్న వ్యర్థ వాక్యాలు గల దుస్తులు ధరించడం అవాంఛనీ యం. అలాగే పురుషులు విపరీతంగా జుత్తు పెంచడాన్ని సయితం ఇస్లాం వారిస్తుంది.
4) బంగారు, పట్టు వస్త్రాలు పురుషులకు నిషిద్ధం: హజ్రత్ అలీ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) తన కుడి చేతిలో పట్టు వస్త్రాన్ని, తన ఎడమ చేతిలో బంగారాన్ని తీసుకొని – ”ఈ రెండు నా సముదాయపు పురుషుల కోసం నిషిద్ధం” అన్నారు. .
5) దుస్తులు కుడి వైపు నుండి తొడగాలి:
దైవప్రవక్త (స) సాధ్యమయి నంత వరకు మంచి కార్యాలు కుడి వైపు నుండి మొదలు పెట్టడాన్ని ఇష్ట పడేవారు.
6) పురుషులు వస్త్రాన్ని నేలపై ఈడుస్తూ నడవ కూడదు:
”అహంకారంతో తన వస్త్రాన్ని ఈడుస్తూ నడిచే వ్యక్తిని అల్లాహ్ ప్రళయ దినాన కన్నెతి కూడా చూడడు” అన్నారు ప్రవక్త (స).
7) పురుషుల వస్త్రధారణ స్త్రీలకు, స్త్రీల వస్త్రధారణ పురుషులకు నిషిద్ధం: ”స్త్రీల వేషధారణ కలిగి ఉండే పురుషులను, పురుషుల వస్త్ర ధారణ కలిగి ఉండే స్త్రీలను దైవ ప్రవక్త (స) వారు శపించారు”. (బుఖారీ)
ప్రియమైన పాఠకులారా! పాశ్చాత్య నాగరికత వెర్రితలలు వేస్తున్న నేటి తరుణంలో ‘కొత్తొక వింత, పాతొక రోత’లా వ్యవహారిస్తున్నారు కొందరు. నిజానికి మానవ నాగరికతా సంస్కృతులు జ్ఞానం మీద ఆధారమై ఉంటాయి. అజ్ఞానాంధకారంలో ఏ జాతి కూడా ఉన్నతమ యిన నాగరికతను పొందజాలదు. ఈ జ్ఞానం రెండు విధాలు.
1) మానవుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా, అనుభవం ద్వారా దేవుడిచ్చిన తెలివితేటలతో గ్రహించేది.
2) ఈ అనంత విశ్వంలో మానవ ఇంద్రియాలకు, వైజ్ఞానిక పరికరాల కు, పరిశోధనలకు, అనుభవాలకు కూడా అంతు చిక్కని నిగూఢ విష యాలు. ఇలాంటి జ్ఞానం మానవాళికి సరాసరి సృష్టికర్త నుంచి రావ లసిందే. ఆ జ్ఞానాన్ని, జీవన విధానాన్ని లోకానికి పరిచయమ చేెసిన దైవప్రవక్తల్లో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స). గ్రంథాల్లో అంతిమ దైవ గ్రంథం ఖుర్‌ఆన్. ఇలా సృష్టికర్త తరఫు నుంచి లభించిన జ్ఞానంతో ఏర్పడిన సంస్కృతే సరయిన సంస్కృతి. మొదటి కోవకు చెందిన జ్ఞానంతో మనిషి ఎంత ప్రగతి సాధించినా, రెండవ విధమైన జ్ఞానాన్ని విస్మరిస్తే అదే నవీన మౌఢ్యం అవుతుంది. ఈ కారణంగా ఈ ఆధునికంలో సయితం మానవుడు అనేక సమస్యలను పరిష్కరిమచడం కృతాకృతుడు కాలేకపోతున్నాడు. కాబట్టి మనిషి తనకు తానుగా ప్రవేశ పెట్టుకున్న జీవన వాధానాల్ని వీడి సర్వోన్నతుడయిన అల్లాహ్ నిర్దేశించిన జీవన సంవిధానాన్ని అవలంబించిన నాడే ఇహపరాల సాఫల్యం పొందగలడు.