ఆంధ్ర సాహిత్యం రెండు వేల సంవత్సరాల పంట. ఆ రెండు వేల సంవత్సరాలలో వేనవేల కావ్యాలు, తత్వాలు, సిద్ధాంతాలు పుట్టాయి. 8 కోట్ల మంది ఆంధ్ర ప్రజల్లో తెలుగు మాట్లాడే వారు 87.77/ శాతం అయితే ఉర్దూ మాట్లాడేవారి శాతం 8. 63/, హిన్దీ మాట్లాడేవారి శాతం 2. 77/, తమిళ్ మాట్లాడేవారి శాతం 1. 13/గా ఉంది. యుగాలు గడిచినా, తరాలు మారినా ఆరుద్ర అన్నట్టు నేటికీ – తేనెకన్నా మధురంరా తెలుగు. ఆ తెలుగుదనం మన కంటికి వెలుగు. మన గత చరిత్ర ఎంత ఖ్యాతి? గర్వించదగ్గ జాతి తెలుగు జాతి!
మతం కొందరినే మేల్కొల్పుతుంది. రాజకీయం కొందరినే రగుల్కొలుపుతుంది. హితం కూడిన పదునయిన పదం – విశ్వశాంతి అదనెరిగిన సాహిత్యం అందరినీ మేల్కొల్పుతుంది అనడానికి దైవగ్రంథాల చరిత్రే సాక్షి! అందుకే అసలైన సాహిత్యం విశ్వ జనీనం, సార్వకాలి కం. ఆ విషయంలో అంతిమంగా అవతరించిన ఖుర్‌ఆన్ అగ్రగణ్యం, అశేషం, అమోఘం, అమేయం, అద్వితీయం. అది ఆంధ్రీకరించబడటం మన అదృష్టం. దాన్ని తెనుగీకరించిన భావానువాదకర్తల జీవితం ధన్యం. అట్టి మహిమాన్విత గ్రంథరాజాన్ని ప్రామాణికబద్ధంగా తెనుగీకరించాలని సంకల్పించి ఐపిసి సంస్థ తన ఉనికికి సార్థకతను చేకూర్చుకుంది. 1994 నుంచి ఐపిసి ప్రచురించిన తెలుగు పుస్తకాల గురించి, దాని పరిపమళ థల గురించి ముచ్చటించుకుందాం!
‘ఎవరో ఒకరు, ఎపుడోకపుడు’ అన్నట్టు షేక్ ఇస్హాక్ అలీ, సోదరులు నజీబుద్దీన్, మౌలానా అబ్దుల్ ఖాదిర్ ఉమ్రీ, మౌలానా అబ్దుస్సలామ్ ఉమ్రీ, మౌలానా మౌదూద్ ఆజమ్ గార్ల నేతృ త్వంలో కువైట్ జీవధాత్రిపై చేతి వ్రాతతో మొదలయిన ఈ ప్రస్థాన అంకురం కరపత్రాలతో చిగురించి, చిరు పుస్తకాలు – క్యాసెట్లతో పుష్పించి, జుమా ప్రసంగాలతో ఫలించి నేడు నెలవంక మాస పత్రిక రూపంలో ఆధ్యాత్మిక జనాభ్యుదయానికి అంకితమయి తెలుగు జనా వళి నివాళులందుకోంటోంది. ఇది తెలుగు పత్రిక-సాత్వికతకు ఇది ప్రతీక. మమత మందా రంలా వికసించాలని, మానవత్వం త్రివిక్రమించాలని ప్రయత్నించే చిరు దీపిక. ”నిప్పులు చెరిగే వేసవితోనే – తేనెలు కురిసే వానొస్తుంది. ఆకులు రాల్చే కాలంతోనే-చిగురులు తొడిగే ఘడియొస్తుంది” అన్నట్టు జీవితంలోఎదురయ్యే సమస్యలను ఎలా సమన్వయ పర్చుకోవా లనే సందేశం నెలవంకలో ధ్వనిస్తుంది. సౌమనస్యానికి అది పునాది. వైమనస్యానికి అది విరోధి.
ప్రస్తుతం 7299 భాషలు ప్రపచంలో వాడకంలో ఉన్నట్లు గుర్తించిన సంస్థలు, వాటిలో సగానికి సగం రాబోయే తరానికి అందకుండా అంతరించిపోయే థలో ఉన్నాయని చెబు తున్నాయి. ఇక అంతరించే థలో ఒక భాష ఉందనడానికి ఛాయలు ఏమిటంటే-
1. ఆ భాషను పెద్దవాళ్లు పిల్లలకు నేర్పరు. 2. దైనందిన జీవితంలో దాన్ని అంతగా వాడరు. 3. ఆ భాష మాట్లాడే జనం సంఖ్య తగ్గిపోతుంటుంది. 4. ప్రభుత్వం, ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఆ భాషను ఉపయోగించవు. 5. ఆ భాషను కాపాడుకోవాలని ప్రజలు ఉద్యమిం చరు. 6. ఆ భాష పట్ల గౌరవం ప్రజల్లో ఉండదు. 7. ఆ భాష అక్షరాలనుగాని, సాహిత్యాన్ని గానీ ప్రజలు విరివిగా వాడరు. ప్రపంచంలో ఏ దేశంలోనయినా, మాతృభాష రాచభాష కాలేనప్పుడు జరిగేది ఇదే!
అయితే అభ్యుదయ కవులు, సాహితీవేత్తలు, మాతృభాషాభిమానులు తెలుగు పతాకాన్ని థ దిశలా ఎగుర వేసేందుకు, తెలుగు దివ్వె వెలుగులను ప్రపంచానికి పంచేందుకు, తెలుగు జాతి గౌరవాన్ని లోకానికి చాటేందుకు ప్రతిన బూనటం, ఈ బృహత్తర కృషికై కంకణం కట్టు కోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. మహా కవి శ్రీశ్రీ అన్నట్టు ‘నేను సయితం….’ మనలోని ప్రతి ఒక్కరు ఈ కార్యసిద్ధి కోసం ముందుకు రావాలి. అక్షర అస్త్రాల ద్వారా అస త్యాన్ని, అరాచకాన్ని, అన్యాయాన్ని పారద్రోలాలి. ఆ మేరకు-సామాజిక న్యాయం, సమాజాభ్యు దయం కోసం మీరు ప్రతిపాదించే ప్రతి మంచి విషయాన్ని నెలవంక సహృదయంతో స్వాగ తిస్తోంది.
మన తెలుగు జాతి తెలుగు ఖ్యాతిని మరచి మత్తుగా నిద్రపోతోంది అని ఆందోళన చెందే బాధాతప్త ఆంధ్రాభిమానులు కొందరున్నారు. వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ‘నిద్ర సగం మృత్యు. జీవులకు ఇది ఏ నాడూ తప్పదు’ అన్న మాట నిజమే కావచ్చు. అంత మాత్రాన నిద్ర కాదు గెలిచేది – జాగృతి. తమస్సు కాదు నిలిచేది – ఉషస్సు. కాంతి చైతన్యమానం. ఆ కాంతిని మన అణువణువులో నింపుకుందాం! మన వేసే అంకురం ఎంత చిన్నదయినా సరే దాన్ని పూర్తి చిత్తశుద్ధితో తెలుగుజాతికి అంకితం చేద్దాం!!