ఇస్లామీయ సంస్కృతి – శిక్షాస్మృతి

 శిక్షాస్మృతి

ఈప్రపంచం అనేక సంస్కృతుల-శిక్షాస్మృతుల,  కూడలి. ఒక ప్రాంతపు సంస్కృతికి-శిక్షాస్మృతికి మరో ప్రాంతం ప్రభావితం కావడం సహజంగా జరిగే విషయం. ఆది మానవుడైన ఆదం (అ) గారి కాలం నాటి నుండి మొదలయిన ఈ నాగరికతా ప్రస్థానంలో అనూహ్యమైన అలంకారాలను, మార్పులను సంతరించుకుంది సంస్కృతి- శిక్షాస్మృతి. దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌  (స) వారి రాకతో పరిపూర్ణతను సంతరించుకున్న సంస్కృతి- శిక్షాస్మృతులు తన స్పష్టమైన ఆకృతి ప్రభావాన్ని ప్రపంచం మొత్తం మీద వేశాయి.

సంస్కృతి-శిక్షాస్మృతి ప్రభావంపైన, సంస్కృతి-శిక్షాస్మృతి ప్రస్థానంపైన, సంస్కృతి-శిక్షాస్మృతి ప్రామాణికతపైన, సంస్కృతి-శిక్షాస్మృతి మూలాలపైన అనేక పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. పుస్తకాల రూపంలో మనకు అందుతూనే ఉన్నాయి.  మనం నిత్య జీవితంలో అలవోకగా ఆచరించే ఎన్నో అలవాట్లను, ఆచారాలను, తీర్పులను తర్కించి వాటి పుట్టపూర్వోత్తరాల గురించి, అన్య సంస్కృతుల-శిక్షాస్మృతుల నుంచి అవి నడిచి వచ్చిన వైనాన్ని విపులీకరించిన అనేకుల నోట మేలిమి సంస్కృతి-శిక్షాస్మృతి గా పంశంస పత్రాన్ని తన సొంతం చేసుకుంది ఇస్లామీయ సంస్కృతి-శిక్షాస్మృతి. అదెలా సాధ్యమయ్యింది? అంటే ఈ వ్యాసం చదవాల్సిందే.   మనిషి – అతను ఏ ప్రాంతానికి చెందిన వాడైనా, ఏ మతధర్మాన్ని అవలంబించే వాడైనా అతను జీవించేది మాత్రం రెండు విధమైనటువంటి లోకాలలో. ఒకటి బాహ్య ప్రపంచం. రెండవది భావ ప్రపంచం. కనుక ఈ పుడమిపై పాదం మోపిన ప్రతి మనిషికి సంబంధించిన ఈ ద్విలోకాల అవ సరాలు తీరనంతవరకు అతని జీవితం ప్రశాంతమయం కాజాలదు. బాహ్య ప్రపం చంలో మనిషి మేధకు అగ్రతాంబులం ఉంటే, భావ ప్రపంచంలో మనసుది అగ్ర భాగం. ఒక్కమాటలో చెప్పాలంటే న్యాయం -త్యాగం అన్న గుణాలు ప్రతి సమాజపు మనుగడకు పునాదిరాళ్ళు. ఈ విషయమై ప్రపంచ చరిత్రను, ప్రపంచంలోని శిక్షా స్మృతులను పరిశీలించినట్లయితే, మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ఆవిర్భా వానికి పూర్వం వరకు ఉన్న పరిస్థి వేరు. ఆయన ప్రభవనం తర్వాతి స్థితి వేరు అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

నేడు ఒక వర్గం శిక్షాస్మృతుల విషయం లో ఓ అతివాదానికి గురై ఉంటే, మరో వర్గం మన్నింపు విషయంలో ఇంకో అతి వాదానికి గురై ఉంది.  అది శిక్షాస్మృతిలో ని మరణ దండనకు వ్యతిరేకంగా ఎంత ఉధృతంగా ప్రచారం చేసిందంటే చాలా మంది మరణ దండనను అసహ్యకరమ యిందిగా భావిస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు దాన్ని పూర్తిగా రద్దు చేశాయి కూడా. నిజంగా హత్యా ప్రతీకార చట్టంలో సమాజ జీవితం దాగి ఉందని, ఏ సమాజమయితే మానవ జీవితాన్ని గౌర వించని వారి ప్రాణాలను ఆదరణీయంగా బావిస్తుందో అది వాస్తవానికి చంకలో విష సర్పాన్ని, తన మధ్య కనికరం ఎరుగని క్రూర మృగాన్ని పెంచి పోషిస్తున్నదన్న మాట. ఆ సమాజం ఒక హంతకుని ప్రాణాన్ని కాపాడి అనేక అమాయక ప్రజల ప్రాణాలను ప్రమాదానికి గురి చేస్తున్న దన్న మాట అంటూ ఖుర్‌ఆన్‌ బుద్ధి జీవుల ను సంబోధించి హెచ్చరిస్తుంది.   ”ఓ విశ్వసించిన జనులారా! హత్యా వాజ్యాలలో మీకు ‘ఖిసాస్‌’ విధానం విధిం చబడింది. హంతకుడు స్వతంత్రుడయితే ఆ స్వతంత్రుడిపైనే ప్రతీకారం తీర్చుకో వాలి; బానిస హంతకుడయితే ఆ బానిసకే మరణ శిక్ష విధించాలి; స్త్రీ నేరం చేస్తే ఆ స్త్రీనే శిక్షించాలి, అయితే హంతకుని పట్ల అతని సోదరుడు మన్నింపుల వైఖరి అవ లంబించడానికి సిద్ధ పడితే ప్రసిద్ధ రీతిలో హత్యా పరిహారం నిర్ణయం అవ్వాలి. హంతకుడు  నిజాయితీగా దాన్ని చెల్లించ డం ధర్మం. ఇది మీ ప్రభువు చూపుతున్న రాయితి, కనికరం. ఇక దీని మీద కూడా ఎవరయినా మితిమీరి ప్రవర్తిస్తే అతనికి బాధాకరమయిన శిక్ష పడుతుంది. బుద్దీ వివేకాలు గల జనులారా! ప్రతీకార చట్టం లోనే మీకు సముజ్జీవనం లభిస్తుంది. మీరు ఈ శాసన ఉల్లంఘనకు పాల్పడకుండా మెలుగుతారని భావించ బడుతోంది”                          .(అల్‌ బఖర: 178,179)

అల్లాహ్  ఈ ఆయతులో హత్యా ప్రతీకారం తీర్చుకునే (మేలిమి మేధ అప్పీిలును) హక్కును ఇవ్వడంతోపాటు మనసు సంబం ధిత సదాచరణను సయితం ఎరుక పర్చాడు. అంటే మనకు ఎదుటి వ్యక్తికి మధ్య పితృ సంహార వైరం ఉన్నప్పటికీ అతనయితే మన తోటి మానవ సోదరుడే కదా. అందువల్ల తప్పు చేసిన ఓ సోదరుని విషయంలో ప్రతీకారాగ్రహాన్ని మింగేశా మంటే అది మనలోని మానవతను ఇతోధి కంగా ప్రతిబింబించే ఘనమయిన విష యం. ఈ ఆయతులో తెలుపబడిన మరో విషయం ఏమిటంటే, ఇస్లామీయ శిక్షా స్మృతిలో హత్యలాంటి వ్యవహారంలో కూడా రాజీకి ఆస్కారం ఉంది. హతుని వారసుల కు హంతకుణ్ణి క్షమించి వేెసే హక్కు ఉంది. ఇలాంటి సందర్భంలో న్యాయస్థానం, హంతకునికి మరణ శిక్ష  విధించవలసిందే నని పట్టుబటడం ధర్మసమ్మతం కాదు,. అయితే హంతకుడు వారు కోరిన హత్యా పరిహారాన్ని విధిగా చెల్లించాల్సి ఉంటుంది. హాత్యా పరిహారం ఇస్తానని ఎగ్గొట్టడమూ దుర్మార్గమే, పరిహారం తీసుకుని కూడా మళ్ళి వ్యక్తిని హతమార్చడమూ దౌర్జన్యమే అంటుంది.

ఈ విషయమై అల్లాహ్‌ా ఇలా సెలవిస్తు న్నాడు: ”నిశ్చయంగా అల్లాహ్‌ా న్యాయ బద్ధ తను, అనుగ్రహశీలతను, బంధుత్వ అను రాగాన్నీ (పాటించాలని) ఆదేశిస్తున్నాడు. ఇంకా – నీతిబాహ్యమైన పనుల నుండీి, చెడుల నుండీ, దౌర్జన్యం నుండీ ఆయన ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహించ డానికి ఆయన స్వయంగా మీకు ఉపదే శిసున్నాడు”. (అన్‌ నహ్ : 90) ఈ ఆయతులో ‘అద్ల్‌’ అన్న పదం ఉంది. దీని భావనలో రెండు స్థిర యదార్థాలు మిశ్రమమయి ఉన్నాయి. ఒకటి జనుల మధ్య హక్కుల్లో సమతుల్యత, సానుకూల ఔచిత్యం స్థాపించబడాలి. రెండు ప్రతి వ్యక్తి కి అతని హక్కు నిష్కర్షగా అందజేయాలి.

న్యాయం అనగానే సాధారణంగా ఇద్దరి మధ్య హక్కుల విభజన చెరి సగం జరగా లన్న భావన    తప్పుడుగా     ఏర్పడింది. దాని ప్రకారమే ఒక విషయంలో న్యాయం అనగానే సమాన స్థాయి విభజన జరుగు తుందన్న భావన ఏర్పడింది. ఇది మానవ మేధకు, నైజానికి, న్యాయానికి విరుద్ధమైన విషయం. ఎక్కువ, తక్కువ సేవ చేెసేవారం దరికి సమాన స్థాయిలో వెతనం లభించాల నడం ఎంత మాత్రం సమంజసమైన విష యం కాదు. ఈ విధమైనటువంటి సమాన త్వం, సమతా భావాన్ని ఇస్లాం కొన్ని సంద ర్భాలకే పరిమితం చేస్తుంది. ముఖ్యంగా భావోద్రేకానికి లోనై చేసే తీర్పు విషయం లో.ఉదాహరణకు నోమాన్‌ బిన్‌ బషీర్‌ (ర) తెలియజేసిన ఈ సంఘటన ఓ మచ్చు తునక. ‘మా నాన్న గారు నాకో కానుక ఇచ్చారు. అది చూసిన మా అమ్మగారు, ఈ కానుకకు దైవ ప్రవక్త (స) సాక్షిగా ఉండ నంత వరకూ తాను దాన్ని ఒప్పుకోనని అంది. అప్పుడు మా న్నా దైవ ప్రవక్త (స) వద్దకు వెళ్ళి విషయాన్ని వివరించారు. అందుకు ప్రవక్త (స) ‘నీవు నీ పిల్లలంద రికీ ఈ కానుకను ఇచ్చావా?’ అని దర్యాప్తు చేశారు. ‘లేద’ని మా నాన్న గారు బదులి చ్చారు. ‘మరయితే అల్లాహ్‌ాకు భయపడు. సంతానం మధ్య న్యాయాన్ని పాటించు. నేను అన్నాయానికి సాక్షిగా ఉండను’ అని చెప్పారు. (సహీహ్  బుఖారీ, ముస్లిం) ఎందుకంటే, న్యాయం ద్వారా సమాజం లో శాంతి సుస్థిరతలు నెలకొంటే, త్యాగ భావం ద్వారా అంతరంగాల అగాధాలు పూడుకుంటాయి. హృదయాలు హత్తుకుం టాయి. సత్సంబంధాలు పెంపొందుతాయి. ప్రేమానురాగాలు విరబూస్తాయి. ఆత్మీ యత ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. ప్రవక్త (స) వారినుద్దేశించి అల్లాహ్  ఖుర్‌ఆన్‌లో ఇలా సంబోధించాడు:

”(ప్రవక్తా!) ఇది ఎన లేని దైవ కారుణ్యం, నీవు వీరి కొరకు ఎంతో మృదుస్వభావిగా అలరారావు. అలా కాక ఒకవేళ నీవు తీవ్ర స్వభావివి, పాషాణ హృదయుడివి అయి ఉంటే వీరంతా నీ దరిదాపుల నుండి దూర మయి పొయ్యేవారు. వీరి తప్పుల్ని మన్నిం చు. వీరి కొరకు  క్షమాభిక్ష  వేడుకో..” (ఆలి ఇమ్రాన్‌: 159)    మేలిమి మేధ కోరే న్యాయాన్ని అమలు పర్చే అధికారాన్ని అల్లాహ్  ప్రసాదిస్తూనే మృదువుగా మెలగడం మరింత మంచిద న్నాడు: ”ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చు కోదలచినా, మీకు ఏ మేరకు బాధ పెట్టడం జరిగిందో ఆ మేరకే ప్రతీకారం తీర్చుకోండి. ఒకవేళ మీరు ఓర్చుకున్నట్ల యితే, ఓర్పు వహించేవారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరమైనది”.     (అన్నహ్ : 126)

”అపకారానికి బదులు అటువంటి అప కారమే. కానీ ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ ది…”     (అష్‌షూరా: 40)

”మేము తౌరాతు గ్రంథంలో వారి (యూదుల) కోసం ఒక శిక్షాస్మృతిని సూచించాము. (దీని ప్రకారం) ప్రాణాని కి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. మరి ఎవరయినా సదఖా (దానం) గా క్షమాభిక్ష  పెడితే అది అతని పాలిట  ‘కప్ఫారా’ (పాపపరిహారం) అవుతుంది”.       (అల్‌ మాయిదా: 45)

దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ఒకరి శరీరాన్ని ఎవరైనా గాయపర్చడం జరిగి అతను దాన్ని మన్నించి వేస్తే అతను చూపిన ఈ క్షమకు సమాన స్థాయిలో అతని పాపాలను క్షమించి వెయ్యడం జరుగుతుంది”.

మానవుని స్వాభావిక భావోద్రేకాలను ఆరోగ్యవంతమయినవని, పరి శుద్ధమయినవని ఇస్లాం ప్రకటించిన రీతిలో ప్రపంచంలోని మరే మత ధర్మమూ చెప్పలేదు. దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:’జనులకై-మనోభిరామమయిన కాంక్షలు, స్త్రీలు, సంతానం, వెండి బంగారాలు, మన్నికయిన గుర్రాలు, పశువులు (పాడి), వ్యవసాయ భూములు – ఇవన్నీ మనోజ్ఞంగా చెయ్యబడ్డాయి’. (ఆలి ఇమ్రాన్‌:14)

షహవాత్‌- అంటే సహజంగా మనిషి ఇష్టపడే, అతని మనసును దోచుకునే వస్తువులు అని భావం. అందుకే ఆ వస్తువులు కోరుకోవ డం, వాటి పట్ల మోజు చూపడం తప్పు కాదు. కాకపోతే ఈ విష యంలో మనిషి  మితి మీరకూడదు. షరీతయతు విధించిన హద్దుల ను అతిక్రమించకూడదు. వాటిని మనిషి కొరకు ఆకర్షవంతంగా, మనోజ్ఞమైనవిగా చేయడం అన్నది కూడా దేవుని తరఫు నుంచి ఓ పరీక్షే. ”మేము మనుషులను పరీక్షించే నిమిత్తం భూమిపై ఉన్నవాటిని మనోజ్ఞమయినవిగా చేశాము”. (అల్‌ కహఫ్‌: 7)

ఇస్లాం కోరికల దాస్యాన్ని మంచి దృష్టితో చూడదన్న విషయం నిజమే. అది మనిషిపై కళ్ళెం లేని కోరికలు, భావేద్రేకాలు అధికారం చెలాయించే వరకు వీటికై అర్రులు చాచడానికి వీలు పడదు అం టుంది. ఎందుకంటే కళ్లెం లేని కోరికలు మనిషిలోని శక్తిసామర్థ్యాల కేంద్రాన్ని సర్వనాశనం చేసి వేస్తాయి. మనిషిని పశు స్థాయికి దిగ జార్చుతాయి. ఈ విషయమై ఇస్లాం వ్యక్తిపై కొన్ని ఆంక్షలు విధించ డానికి కారణం అతను తన స్వేచ్ఛ దుర్వినియోగం చేసి తన స్వయాని కి, కుటుంబానికి, సమాజానికి ఎలాంటి హాని కలుగజెయ్యకుండా ఆనంద మకరందాన్ని గ్రోల గలగాలన్నదే. మనోనిగ్రహంకై చేసే సూచన నిర్బంధ శాసనం కాదు. దీని వెనక ఎంతో నిగూఢ వివేచన దాగి ఉంది. ప్రపంచ సుఖాలను జీవితాశయానికి తగినట్లుగా మలచు కోవడం. ఏ జాతి ప్రజలయితే తమ మనోకాంక్షల్ని, భావోద్రేకాలను తమ అధీనంలో ఉంచుకోలేరో, మరెవరైతే అవసరం ఏర్పడినా తమకు ప్రియమైన వాటిని వదులుకోవడం ఇష్టపడరో అలాంటి జాతి నాయ కత్వపు హోదాను పొందజాలదు. అలాగే అంతర్జాతీయ సంఘర్షణల్లో ఏ జాతి జనులయితే కష్టాలను, ఆపదలను భరించే సామర్థ్యం కలిగి ఉంటారో, ఎవరయితే అవసరం కలిగినప్పుడు తమ మనోభిరామమ యిన కోరికల్ని గంటలు, దినాలే కాదు సంవత్సరాల తరబడి త్యజించి నిబ్బరం చూపగలరో అలాంటి దృఢ సంకల్పులకే, ఉత్తములకే, పురుషోత్తములకే విజయశ్రీ కాళ్ళు పడుతుంది. ఇక పిచ్చి స్వేచ్ఛ కోసం మనసిచ్చిన  మనిషి, ఒక ఉన్నతాశయం కోసం కొన్ని గంటల యినా తన మనోకాంక్షల పొగరుబోతు గుర్రాన్ని కళ్ళెం వెయ్యలేని మనిషి కూడా ఒక మనిషేనా? ఇటువంటి కాంక్ష దాసులు మానవాళికి ఎన్నడూ ఎలాంటి సెవనూ చెయ్యలేరు. తనకు ప్రియమైన విలాసాలను త్యాగం చేసే సాహసించలేరు.    ఇస్లాం సాధించిన మహత్కార్యాల్లో, మహాద్భుతాల్లో, అలనాటి అరబ్బు ఆటవిక, అనాగరిక, మొరటు ప్రజల్ని సంస్కారవంతులయిన మానవుల సంఘంగా, ఓ ఉత్తమ జాతిగా తీర్చిదిద్దడం ఒకటి. అది వారికి కేవలం రుజుమార్గం మాత్రమే చూపలేదు. కేవలం వారిని పాశవిక స్థాయి నుండి లేవనెత్తి వారికి మానవత్వపు ఉన్నత విలువల ను పరిచయం చెయ్యడమే కాదు, వారిని ఇతరులకు మార్గదర్శకుల గా, దైవ ధర్మధ్వజవాహకులు, ప్రచారకులుగా కూడా తీర్చిదిద్దింది.

మచ్చుకు కొన్ని సంఘటనలు: ఉహద్‌ సంగ్రామం అనంతరం హజ్రత్‌ హమ్జా (ర) గారి మృత దేహం ముక్కలు ముక్కలుగా ఖండించబడి, చెవులు, ముక్కు కోయ బడి ఎంతో భయంకరంగా, కడు దయనీయంగా ఉంది. దాన్ని చూడగానే దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరి గాయి. ఆవేదనాభరితమైన ఆయన హృదయం నుంచి సన్నగా (ఈ క్రింది) శబ్ద తరంగిణి జాలువారింది. ‘అబ్బా! ఇంతటి దారుణమైన దృశ్యం నేనింత వరకు చూడలేదు. హమ్జా సోదరి సఫియా మనసు బాధ పడుతుందన్న భయమే గనక లేకపోయి ఉంటే, ఈ పని నా అనంతరం అనవతర ఆచారంగా మారుతుందేమోనన్న భయమే గనక లేకపోయి ఉంటే నేను హమ్జా దేహాన్ని ఇలాగే గద్దలకు, మృగాలకు, క్రీమికీటకాలకు వదిలి పెట్టేవాడ్ని. ప్రళయ దినాన తాను ఆయా ప్రాణుల పొట్టల నుండి లేప బడేవాడు . (అబూ దావుద్‌, తిర్మిజీ)

పై సంఘటనలో భావోద్రేకాల వెల్లువ కట్టులు తెంచుకోబొతుండగా వెలువడి మాటలు అవి. అయితే మహా ప్రవక్త ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు భావోద్రేకాల ప్రవాహంలో కొట్టుకుపోలేదు. న్యాయానికి, కరుణకి కట్టు బడ్డారు. ఆయన హమ్జా మృతదేహాన్ని ఖననం చేశారు.

హజ్రత్‌ అలీ (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) వారు కొందరిని సైనిక చర్యల నిమిత్తం పంపిస్తూ, వారికి నాయకునిగా ఒక అన్సారు వ్యక్తిని నియమించి, అతని పట్ల విధేయత కనబర్చవలసిందిగా పుర మాయించారు. (ప్రయాణం మధ్యలో ఏదోక కారణంగా) ఆ వ్యక్తి అగ్ర హోదగ్రుడయ్యాడు. (కోపంతో ఊగిపోతూ) ‘ఏమీ! నా పట్ల విధేయత కనబర్చమని ప్రవక్త(స)వారు చేసిన హితవు   నిజం కాదా?’ అన్నాడు. అందరూ నిజమే అన్నారు ముక్తకంఠంతో. అలాగయితే నా ఆజ్ఞ  మేరకు కట్టెల్ని ప్రోగు చేయండి. వారు మారు మాట్లాకుమడా కట్టెల్ని ప్రోగు చేశారు. వాటికి నిప్పంటించండి అని మళ్ళి గర్జించాడు. నిప్పం టించడం జరిగింది. అవి బాగా కాలాక-అందరినీ ఉద్దేశ్యించి ‘నేనాదే శిస్తున్నాను మిమ్మల్ని మీరు ఈ అగ్నికి ఆహుతి చేసుకోండి’ అని అరిచాడు. అందరూ అయోమయంలో పడ్డారు.

ఒకరు మరొకరిని పట్టి లాగనారంభించారు. ఈ అగ్నికి ఆహుతి అవ్వడంకన్నా ప్రవక్త (స) వారి కారుణ్య సన్నిధికి పారిపోడం మేలని భావించారు. నిప్పు పూర్తి ఆరిపోయేంత వరకు వారి స్థితి అలానే ఉంది. చివరికి మంటా చల్ల బడింది, అతని కోపమూ తగ్గింది. ఈ విషయం తర్వాత కారుణ్యమూర్తి(స) వారి కర్ణపుటాలకు చేరింది. సాంతం విన్న కారుణ్యమూర్తి (స) ఇలా అభిప్రాయపడ్డారు:  ”ఒకవేళ వారు అతని మాటననుసరించి అగ్నికి ఆహుతి అయ్యుంటే ప్రళయం వరకు దాన్నుండి బైటకు రాగలిగేవారు కాదు. విధేయత అన్నది మంచి కార్యాల్లో మాత్రమే సుమీ!” అని మందలించారు.  (బుఖారీ, ముస్లిం)

పై సంఘటనలో మనసు ప్రవక్త (స) వారి ఆజ్ఞను గౌరవిస్తూ నాయకుని మాటకు విధేయత చూపాలని పదే పదే చెబుతున్నా, మేలిమి మెదడు దాన్ని నిరాకరిస్తోంది. ప్రేమకు నిలయమైన, కరుణకు ఆలయమైన ఇస్లాం ధర్మంలో మేధకు మింగుడు పడని విషయానికి విధేయత చూపాలన్న ఆజ్ఞ  ఎలా ఉండగలదు? అని ప్రశ్నిస్తోంది. కాబట్టి అట్టి సందర్భాలు ఎవరికి ఎప్పుడు, ఎక్కడ ఎదురయినా భావోద్రేకానికి లోనయి ధర్మం కోరని త్యాగానికి పూనుకోవడం మాని ధర్మం అంగీకరించిన మేలిమి మేధ చూపే న్యాయానికి కట్టుబడాలని దైవప్రవక్త (స) సెలవిచ్చారు.

ఇస్లాంలో ఆరాధనా గృహాన్ని నేలమట్టం చేయడం, అటువంటి కట్టడానికి నష్టం చేకూర్చడం, అందులో ఆరాధన నుండి, దైవనామ స్మరణ నుండి జనులను ఆపడం, షరీయతు ఆదేశాలను పాటించ కుండా నిరోధించడం ఇత్యాదివన్నీ నిషిద్ధం. అయితే ఆరాధన కోసం కాక కేవలం ముస్లింల మధ్య గల ఐకమత్యాన్ని నీరుగార్చే దురుద్దేశ్యం తో నిర్మించబడే మస్జిద్‌ను విద్వాంసులు ‘మస్జిదె జిరార్‌’గా అభివర్ణిం చారు. కాబట్టి ముస్లింలలోని చీలికను నివారించడానికీ, వారి సంఘ టిత వ్యవస్థకు విఘాతం కలుగకుండా ఉండటానికి అటువంటి మస్జిద్‌ లను కూల్చివేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఖుర్‌ఆన్‌లోని ఓ ఆయతు ద్వారా రూఢీ అవుతుంది. సాధారణంగా ఇటువంటి వాటిని మస్జిద్‌ పట్ల మర్యాద గల మనసు అంగీకరించదు. అయితే మేలిమి మేధ చూపే న్యాయానికి అనుగుణంగానే అల్లాహ్‌ా ఈ  ఆదేశాన్ని అవ తరింపజేశాడు: ”(కపటులలో) మరికొంత మంది కూడా ఉన్నారు – కీడు కలిగించే, అవిశ్వాసం కూడిన మాటలు చెప్పుకునే ఉద్దేశ్యంతో, విశ్వాసుల మధ్య చీలికను తెచ్చే లక్ష్యంతో, అంతకు మునుపు అల్లాహ్‌ాను, ఆయన ప్రవక్తను వ్యతిరేకించిన వ్యక్తికి ఆసరా ఇచ్చే ఆలోచనతో వారు ఒక మస్జిదు నిర్మించారు. (ఈ కట్టడాన్ని నిర్మించటంలో) తమ ఉద్దేశ్యం మేలు చేయడం తప్ప మరొకటి కాదని వారు ప్రమాణాలు చేస్తారు. వారు అబద్దాలకోరులన్న విషయానికి అల్లాహ్  సాక్షి”. (అత్‌ తౌబా: 107)

వివరాల్లోకెళితే-కపటులు ఒక మస్జిదు నిర్మించారు. వర్షాలు కురుస్తున్నప్పుడు, చలి గాలులు వీస్తున్నప్పుడు, తీవ్రమైన ఎండ పడుతన్నప్పుడు తమలోని బలహీనులు, వృద్ధులు దూరం నుంచి మస్జిదె నబవీ వరకూ రావడం కష్టంగా ఉందనీ, వారి సౌలభ్యం కోసమే తాము మరొక మస్జిదును కట్టామని వారు దైవప్రవక్త (స) వారిని నమ్మబలకడంతోపాటు, తమరు గనక ఒకసారి వచ్చి అందులో నమాజు చేస్తే ఎంతో శుభం చేకూరు తుందని విజ్ఞప్తి కూడా చేశారు. కాని ఆ సమయంలో ప్రవక్త (స) తబూక్‌ యుద్ధానికి బయలుదేరుతున్నారు, ప్రయాణ నుంచి తిరిగి వచ్చాక, అక్కడికి వచ్చి నమాజు చేస్తానని వాగ్దానం చేశారు. అయితే తబూక్‌ నుండి తిరిగి వస్తున్నప్పుడు అల్లాహ్ , వహీ ద్వారా ఆ మస్జ్జిద్‌ వెనుక ఉన్న దురుద్దేశాలను బట్టబయలు చేశాడు. ముస్లింల మధ్య మనస్పర్థలను సృష్టించడం, అవిశ్వాసాన్ని వ్యాపింపజేయటం, దైవానికి, దైవప్రవక్తకు శత్రువుగా వ్యవహరిస్తున్న వారి కోసం ఆసరాను సమ కూర్చడం వారి ఉద్దేశ్యం అని తెలియజెయ్యడమేకాక లోగడ నువ్వు చేసిన వాగ్దానాన్ననుసరించి ఆ మస్జిద్‌కు వెళ్ళకు అని ఆదేశించాడు కూడా: ”నువ్వు ఎన్నడూ అందులో నిలబడకు. అయితే తొలినాటి నుంచే దైవభీతి-తఖ్వా పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిల బడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్ట పడేవారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్దతను పాటించేవారిని అల్లాహ్‌ా ప్రేమిస్తాడు”. (తౌబా:108)

ముస్లింల మధ్య మనస్పర్థల్ని సృష్టించే ఉద్దేశ్యంతో నిర్మితమైన ఎలాంటి విగ్రహ ప్రతిమలు లేని మస్జిద్‌లలోనే నిలబడకూడదు, వాటిని కూల్చేయాలని అల్లాహ్‌ా అదేశిస్తున్నప్పుడు, నేడు ముస్లింల విశ్వాసానికి తూట్లు పొడవాలన్న, వారి పురోభివృధ్దిని అసలు కారక మైన తౌహీద్‌ను అడుసులో తొక్కెయ్యాలన్న ఉద్దేశ్యం పునాదిగా కుత్సిత మతుల కుయుక్తులతో నిర్మించబడిన శవాలు పూడ్చబడిన దర్గాల గురించి ఇస్లాం ఎలాంటి ఆదేశాలు కలిగి ఉంటుందో సుమతులైన సమాలోచనాపరులు సునిశితంగా ఆలోచించాలి. అలాగే పాక్షికమైన కొన్ని విభేదాలను ప్రధానమయినవిగా చిత్రీకరిస్తూ కేవలం దైవారాధన కోసం నిర్మించబడే మస్జిద్‌లను కూల్చడం, కాల్చడం ఎంతటి భయం కర నేరమో యోచించాలి. అదే పని ఒక ముస్లిమేతరుడు చేస్తే కాఫిర్‌ (అవిశ్వాసి-తిరస్కారి), నరకవాసి అని ఫత్వాలు జారీ చేసే పండిత మహాశయులు ఆయా సమాధుల్లో గల వ్యక్తుల పట్ల అభిమానంతో భావోద్రేకాలకు లోనవ్వకుండా ధర్మం చెప్పే తీర్పుకి, చూపే న్యాయాని కి తల వంచాలి. అలా వంచిన నాడే మళ్ళీ ముస్లిం సమాజం నిండు స్వేచ్ఛతో తలెత్తుకుని పురోగమనం వైపు సాఫీగా అడుగెయ్యగలదు. ఇహంలో విజేతగా నిలిచి, పరంలో స్వర్గవాసిగా నీరాజనాలందుకొ గలదు.

ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ‘ఓ అజ్ఞానుల్లారా! అల్లాహ్ ను వదలి ఇతరుల ను పూజించమని మీరు నాకు ఆజ్ఞాపిస్తున్నారా?’ అని ఓ ప్రవక్తా వారిని అడుగు. నిశ్చయంగా నీ వద్దకు, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం ఇది: ”ఒకవేళ నువ్వు గనక బహు దైవారాధన (షిర్క్‌)కు పాల్పడితే నువ్వు చేెసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయిన వారిలో చేర్తావు. కాబట్టి, నువ్వు మాత్రం (ఒక్కడైన) అల్లాహ్ నే ఆరాధించు. అనంతరం అనవతరం కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో”. (జుమర్‌: 64-66)

Related Post