పేరు మానవీయం తీరు దానవీయం

peru

సయ్యద్  అబ్దుస్సలామ్ ఉమ్రీ 

సన్నిహితంగా ఉండాల్సిన మానవ సంబంధాలు కాస్త పురుషాహంకార ధోరణి పుణ్యమా అని సమాజం లోనూ, వివాహ వ్యవస్థలోనూ, ఇద్దరు సమ ఉజ్జీల మధ్య, సహ భాగస్వాముల మధ్య ఉండాల్సిన బాంధ వ్యానికి బదులు యజమాని, బానిస లాంటి వాతావరణం నెలకొని ఉండటం బాధాకరం!

గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఆకుకు అందని, పోకుకు పొందని పత్రిపాదనలతో స్వేచ్ఛ పేరుతో పమ్రి దల పరువును పాశ్చాత్య దుష్కృతి పాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప స్తీక్రి సంబంధించిన సమస్య మూలాలను శోధించి సరైన పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పయ్రత్నించడం లేదు నాయక శీల్రు. తన పాణ్రం, తన మానం విలువైనదనీ, ఎదుటి వారి పాణ్రం విలువ లేనిదని భావించే నాయ కులు, అధికారులు ఉన్నంత కాలం పజ్రలకు న్యాయం జరగడం అనేది నేతి బీరలో నెయ్యి చందమే.

తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. అది మనిషి లింగం, వర్ణాన్ని బట్టి ఉండదు. పత్రిభా సంపత్తిని మనిషి లింగాన్ని బట్టి నిర్ణయించడానికి వీల్లేదు. మేధాశక్తి ఒక లింగానికి, వర్ణానికే సొంతం కాదు. సీ్తలను కించ పరిచే, న్యూనతకు లోను చేసే పాతల్రు, సంభాషణలు ఇటు సాహిత్యంలోనూ, అటు సినిమాల్లో నూ ఎక్కువే. ఎక్కువ మగ సంతానమే ఉండాలన్న విష భావం మనిషి నరనరాల్లో నాటుకుపోతోంది. ఆడ బిడ్డ దేనికి తక్కువని మగ బిడ్డంటే ఎక్కడ లేని మక్కువ? లింగ వివక్షకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్య మాలు పుట్టాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి కూడా. కాని జన సామాన్యంలో ఆడ సంతానం పట్ల మమకారాన్ని పోద్రి చేయలేకపోయాయి. అప్పుడే పుట్టిన శిశువుని సయితం లింగాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి నిర్ణయించే దుర్మార్గం మన సమాజంలో అమలులో ఉంది.

చట్ట సభల్లో  33/ రిజర్వేషన్ల కోసం పోరాటం సాగుతూంది. మహిళలు దేశాన్ని పరిపాలిస్తున్నారు కూడా. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాతమ్రే. నేటికీ దేశ వ్యాప్తంగా ఆచారాల పేరుతో పభ్రుత్వం ఎప్పుడో నిషేధించిన జోగిని దురాచారం కొనసాగుతూనే ఉంది. ఒక మన రాష్ట్రంలోనే 24 వేల మంది జోగీనులున్నారంటే ఇక దేశమంతా కలిపితే? ఈ వ్యవస్థ మన దేశంలో రకరకాల పేర్లతో కొనసాగుతోంది. కెరళాలో ‘మహారి’ అని, అస్సాంలో ‘నాటి’ అని, మహారాష్ట్రలో ‘మురళి’ అని, తమిళ నాడులో ‘దేవరడియార్‌’ అని, కర్ణాటక మరియు రాయలసీమ కొన్ని జిల్లాల్లో ‘బసవి’ అని పిలుస్తుం టారు. ఈ వ్యవస్థను గూర్చి తెలుసుకోవడం అంటే ఎందరో అమాయక అబలల కన్నీటి గాధలు తెలుసుకోవడమే.

ఎక్కడోగాని కనిపించని మానవీయం గురించి పెదవి విప్పాలా? ఎక్కడ చూసిన తాండవిస్తున్న దావీయం  గురించి మాట్లాడాలా? భూణ్రహత్యలు గురించి మాట్లాడాలా? పుట్టాక ముక్కు, చెవులు మూసేసి చంపే అమానవీయత గురించి మాట్లాడాలా? వావి వరసల్ని ఖాతరు చెయ్యని వింత పశువుల గురించి మాట్లాడాలా? సొంత విద్యార్థినిని చెరిచే ఉపాధ్యాయుల గురించి మాట్లాడాలా? పెళ్లయితే హింస, పెళ్ళి కాకపోతే  హింస, గల్లీలో హింస, ఢిల్లీలో హింస, యుద్ధహింస, మతహింస ఏ హింస గురించి మాట్లాడాలి? ఎంత కాలం మాట్లాడాలి?

శిశువు తెల్లగా ఎరగ్రా ఉంటే పరవాలేదంటారు. నల్లగా ఉంటే అయ్యో పాప కరిద్రే అని పెదవి విరుస్తారు. ఆడ శిశువు పుట్టింది మొదలు రకరకాల ఈసడింపులను ఎదుర్కొంటుంది.  బిడ్డ పుట్టిన సంతోషంకన్నా ఆడ బిడ్డ పుట్ట్టిందన్న పుట్టెడు దుఃఖమే అధికంగా ఉంటుంది. స్తీగ్రా పుట్టడం ఒక అనర్హతగా, ఒక నేరంగా పరిణమిస్తుంది. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పెర్కొంటుంది: ”వారిలో ఎవరికయినా కూతురు పుట్టిందన్న శుభవార్తను విన్పిస్తే, వాడి ముఖం నల్లగా మారి పోతుంది. లోలోపలే కుతకుతలాడిపోతాడు. ఈ దుర్వార్త విన్న తరువాత (ఇక లోకులకు ముఖం ఎలా చూపేది? అని) అతడు నక్కి నక్కి తిరుగుతుంటాడు. ఈ అవమానాన్ని ఇలానే భరిస్తూ బిడ్డను అట్టి పెట్టుకోవాలా? లేక దానిని మట్టిలో పూడ్చి పెట్టాలా? అని (పరిపరి విధాలుగా) ఆలోచిస్తాడు. చూడు! ఎంత జుగుప్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు!”  (అన్‌ నహ్ల్‌ా: 58,59)

దేవుని దృష్టిలో ఆడ-మగ వివక్ష  లేదు. లింగ పాత్రిపదికపై నిమ్నోన్నతా భేదభావాలు కూడా ఆయన వద్ద చెల్లవు. ఒకటే జననం, ఒకటే మరణం. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరం కలిసి కట్టుగా ముందడుగేయాలి. ఏ ఒక్కరో కాదు, ఒక జాతి, ఒక కులమో కాదు…మనమంతా ఏకమవ్వాలి. అన్యాయాన్ని అడ్డుకోవడానికి, అధర్మాన్ని నిలదీయడానికి, అకమ్రాలను నిలువరించడానికి మానవతా మార్గంలో అడ్డు తగులుతున్న పత్రిదాన్ని తొలగించడానికి కంకణం కట్టాలి. ఈ ఉద్యుమం మరింత ఉధృతం అవ్వాలి. కొన్ని రొజులు కాదు, నిరంతరం సాగాలి. ఇది కేవలం స్తీజ్రాతి అభ్యున్నతికై ఆరాటం మాతమ్రే కాదు. ఇది మానవాళి మనుగడగై పోరాటం! అలుపెరగకుండా సాగిపోవడమే మనందరి తక్షణ కర్తవ్యం!!

Related Post