ఓ మనిషీ! నిన్ను నువ్వు తెలుసుకో

Originally posted 2013-06-03 08:08:02.

  thinking-man
– మౌలానా వహీదుద్దీన్‌ ఖాన్‌
  ఈ మీ జీవితం అత్యంత సుదీర్ఘమైనది, నిరంతరాయమైనది. మరణం ఈ జీవి తానికి ఆఖరి అంచు కాదు. పైగా అది మరో యుగానికి – నవ యుగానికి నాంది. మరో మాటలో చెప్పాలంటే మృత్యువు జీవిత థల మధ్య ఒక విభ జన రేఖ వంటిది. ఉదాహరణకు ఒక రైతు చేనులో నారు వేస్తాడు. నీరు పెడ తాడు. పంట కోసం పెట్టుబడి పెడతాడు. అది పండే వరకూ శ్రమిస్తాడు. పంట పండిన తర్వాత కోత కోస్తాడు. ఎందుకు? పంటను నూర్చి ఏడాది వరకూ తనకు కావలసిన ఆహారధాన్యాన్ని సమకూర్చు కునేందుకు! పంట కోతకు వచ్చిందంటే, దాని అర్థం ఒక థ ముగిసింది. రెండవ థకు లేక రెండవ యుగానికి ఆ కోత నాంది అయింది. అంతకు ముందు నారు వేయటం, పంటను తయారు చేయటం, కోత కోయటం-ఇదంతా ఏమిటి? తన అవసరాన్ని తీర్చుకోవడానికి చేసే నిరం తర సాధన. పంట ముందు వరకూ కేవలం శ్రమ తప్ప, ధన వ్యయం తప్ప మరేదీ అతనికి లభించలేదు. అయితే పంట కోసిన తరువాత ఆ రైతు తన శ్రమకు తగ్గ ఫలితం పొందాడు. తాను పెట్టిన పెట్టుబడికి తగ్గ లాభాన్ని – దిగుబడిని – ఆర్జించాడు.
  మన జీవన పరిస్థితి కూడా సరిగ్గా ఇంతే. మనం ఈ ప్రపంచంలో పరలోకం యొక్క పంటను తయారు చేస్తున్నాము. మనలో ప్రతి ఒక్కడూ పరలోకంలో తన కంటూ ఒక పంట పొలాన్ని కలిగి ఉన్నాడు. ఆ పంటపొలాన్ని అతను సేద్యం అన్నా చేెస్తున్నాడు లేదంటే బంజరుగా నైనా వదలి పెడుతున్నాడు. ఆ చేనులో అతను మేలు జాతి విత్తనాలయినా చల్లాడు లేదంటే నాసిరకం విత్తులయినా వేశాడు. విత్తనాలు వేసిన మీదట పొలాన్ని గాలికి వదిలేయడమైనా చేెశాడు లేదా విత్తనాలు చల్లిన   క్షణం  నుంచి   దాన్ని కంటికి రెప్పలా కాపలా కాయటమైనా చేశాడు. అతను నాటితే ముళ్ళ మొక్కల యినా నాటాడు లేదా మంచి మంచి పూలు పండ్లయినా పండించాడు. అతను తన శక్తియుక్తులన్నింటనీ పంట చేను మెరుగు కోసం ధారబోయడమైనా చేశాడు లేదా పొలాన్ని ఏ మాత్రం పట్టించుకో కుండా ఇతరత్రా వ్యాపకాల్లోనయినా నిమగ్నుడయ్యాడు. చావు దాపురించే దాకా ఆ పంట తయారవదు. చావు వచ్చిందంటే పరలోక పంట పొలం కోతకు వచ్చిందన్న మాటే! ఈ ప్రపంచంలో మన కన్ను మూత బడిందంటే మరో ప్రపంచంలో మన కన్ను తెరుచుకుందన్న మాట!  జీవితమంతా శ్రమించి సిద్ధం చేసిన పంట చేను అక్కడ మన ముందు ప్రత్యక్షమవుతుంది.
  గుర్తుంచుకోండి – సాగు చేసిన రైతు మాత్రమే కోత కోస్తాడు. ఏ విత్తనాన్ని వేసు కుంటాడో దాని పంటనే కోస్తాడు. అలాగే ప్రతి వ్యక్తికీ ఈ లోకంలో అతను మర ణానికి ముందు చేసుకున్న దాని ప్రతి ఫలమే లభిస్తుంది. రైతుకు వ్యవసాయోత్ప త్తుల అంచనా ఉంటుంది. తాను పెట్టిన పెట్టుబడిని బట్టి, పడిన శ్రమను బట్టి అతనికి ఇంచుమించు ఎన్ని బస్తాల ధాన్యం ఇంటికి వస్తుందో లెక్క ఉంటుంది. అదే విధంగా మనిషి ఈ ప్రపంచంలో ఏ మేరకు పాటుపడతాడో ఆ మేరకే పర లోకంలో అతనికి ప్రాప్తమవుతుంది. దేని కోసం ప్రయత్నించాడో అదే లభిస్తుంది. కష్టార్జితాన్ని పొందే స్థలం పరలోకం. మరణం తరువాత మళ్ళీ కష్టపడే అవ కాశం ఉండదు. అలాగే పరలోకానికి ఒక పరిమితి అంటూ ఉండదు. అది అనంత మైనది, శాశ్వితంగా ఉంటుంది.ఎంత  సున్నితమైన     విషయమిది! మరణానికి ముందే మానవుడు ఈ యదార్థాన్ని గ్రహిస్తే ఎంత బావుండు!! ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే మరణించిన తరువాత అతను యదార్థాన్ని . అర్థం చేసుకుని ప్రయోజనమేమీ ఉండదు. చనిపోయిన తరువాత యదార్థాన్ని గ్రహిం చాడంటే గత కాలంలో తన వల్ల జరిగి పోయిన పొరబాటుపై విచారిస్తున్నాడన్న మాట. కాని అది ఎటువంటి పొర బాటంటే ఇప్పుడది ఏ విధంగానూ సరిదిద్ద బడదు.
  మానవుడు తన పర్యవసానం పట్ల ఏమరుపాటుకు, అజాగ్రత్తకు లోనై ఉన్నాడు. కాని నిజం ఏమిటంటే కాలం అతన్ని అత్యంత శీఘ్రంగా కోతకోసే స్థలానికి లాక్కు పోతోంది. మరి ఇతనేమో ప్రాపంచిక అల్ప వస్తువుల కోసం అర్రులు చాస్తున్నాడు. పైగా తనేదో గొప్పగా పాటు పడుతున్నట్లు భావిస్తున్నాడు. ఘనకార్యం చేస్తున్నట్లు ఊహించుకుని, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. యదార్థానికి అతను, తన సమయాన్ని వృధా చేస్తు న్నాడు. అతని ముందు ఒక మహదావ కాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసు కోవటం ద్వారా తన కోసం ఉజ్వలమైన భవిష్యత్తును తయారు చేెసుకోగలడు. కాని అతనేమో నిశ్చింతగా ఉన్నాడు. అనంత మయిన సుఖాలకు, అపూర్వ  ఆదరణకు నిలయమైన స్వర్గం వైపునకు అతని ప్రభువు అతన్ని పిలుస్తున్నాడు. కాని అతనేమో మూన్నాళ్ళ ముచ్చటలో, విషయ లాలసలో మునిగి తేలుతున్నాడు. తానేదో సంపాదిస్తున్నానని అతను తలపోస్తు న్నాడు. కాని వాస్తవానికి అతను జార విడుస్తున్నాడు. ప్రపంచంలో ఇల్లు కట్టి జీవితాన్ని నిర్మించుకున్నానని అతను భావిస్తున్నాడు. అది నిర్మితమయ్యేది ఏదో ఒకనాడు కూలిపోవడానికే.
ఓ మనిషీ! నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు చేెయవలసిన దేమిటి? చేస్తున్నదేమిటి?

Related Post