పుస్తకం మస్తకం

Originally posted 2013-06-01 15:18:49.

 పుస్తకం మస్తకం
 ”నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టి లో, రేయింబవళ్ళ రాకపోకలలో విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి.”  (ఆల్‌ఇమ్రాన్‌;190)
ప్రకృతిని కాసేపు తదేకంగా పరిశీలిస్తే మనకు అప్పటి దాకా తెలియని వేనవేల విషయాలు బోధపడతాయి, ఎంత మంది ఎంత లోతుగా పరిశీలించి ఎన్ని సత్యాలను వెలికి తీసి చెప్పినా, ఇంకా ఎన్నో తరాలకు సరిపడే జ్ఞానం ప్రకృతిలో నిక్షిప్తమయి ఉంటుంది.
కొన్ని కోట్ల సముదాయాల సముదాయం మనిషి మస్తకం. దాన్ని ఎలా వాడుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. కొందరి మస్తకం చరిత్ర సృష్టించ గలిగే అద్భుత జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. కొందరి మస్తకం రేయింబవళ్ళు పుస్తకంలోని చరిత్రని చదవాలనే ఇష్టాన్ని కలిగి ఉంటుంది.  తెలివంటే అనుకున్న పనిని తొందరగా సాధించడానికి మెదడుని ఉపయో గించగలిగే సామర్థ్యం! బద్ధకమంటే అవసర మైన పనిని మానేసి ఇష్టమైన పనితో కాలయా పన చేస్తూ తర్వాత బాధ పడటం! తెలివి మస్త కానికి సంబంధించినదయితే, బద్ధకం మనసు కు సంబంధించినది. పోతే,
 పుస్తకం అన్నది రెండు అట్టల మధ్య కుట్టిన కొన్ని కాగితాల బొత్తిగా భౌతికంగా మనకు కనబడవచ్చు. కానీ, నిజంగా పుస్తకం ఆంటే మనిషి మస్తకం. మనిషి పొందగలిగిన సకల అనుభవాలు,ఎదుర్కో గలిగే సకల సమస్యలు, ఎదురు నిలిచే సకల చిక్కుముడులు, మనిషిని ఊపేయగలిగే సకల ఉద్వేగాలు-అన్నీ పుస్తకం లో నిక్షిప్తమయి ఉంటాయి. యావత్తు నాగరిక ప్రపంచం ఒక ఎత్తు; పుస్తకం మరో ఎత్తు. ఆధునిక ప్రపంచం మొత్తాన్ని పుస్తకాల ద్వారా పునర్నిర్మించవచ్చు!
మానవ జాతి తన కోసం రాసుకుని, తనకే సమర్పించుకునే చారిత్రక పత్రం పుస్తకం.
నిప్పు వాడకం, నాగలి, చక్రం తర్వాత మన పూర్వీకులు చేసిన మహోతృష్ణ ఆవిష్కరణ పుస్త కం. సర్వలోక సృష్టికర్త, కరుణాప్రదాత మనిషి కి చేసిన మహోపకారాల్లో మహిమాన్విత ఉప కారం అక్షరాభ్యసత. ”ఆయన కలం ద్వారా  జ్ఞానబోధ చేశాడు. ఆయన మనిషికి, అతడు ఎరుగని దానిని నేర్పాడు”.(అల్‌ అలఖ్: 4,5)
 కలం, పుస్తకం చరిత్ర మనిషి మస్తకంకన్నా ప్రాచీనమయినది అంటే ఎంత మాత్రం అతిశ యోక్తి కాదు. ”కలము సాక్షిగా! వారు (దైవ దూతలు వ్రాసే వ్రాత సాక్షిగా!”. (అల్‌ ఖలమ్: 1,2) అన్న ఈ ఆయతును వ్యాఖ్యానిస్తూ పండి తులిచ్చిన వివరణలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ఓ ప్రవచనం గమనా ర్హం! ”అల్లాహ్‌ మొదట కలమును సృష్టిం చాడు. సృష్టి మొదలు అంతమయ్యేంత వర కూ వచ్చే ప్రాణుల విధివ్రాతను వ్రాయమని అల్లాహ్‌ కలానికి ఆజ్ఞాపించాడు. అప్పుడది ఆది నుండి అంతం వరకు జిరిగే విషయాల న్నింటినీ లిఖించింది”. (తిర్మిజీ)
 సకల జీవరాసుల విధిరాతలు ఉన్న ఆ పుస్త కాన్నే ‘లౌహె మహ్ఫూజ్‌’ అంటారు. ఆ లౌహె మహ్ఫూజ్‌ నుండే అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్‌ఆన్‌ అవతరించింది.దయాసాగరుడయిన అల్లాహ్‌ మనిషికి మస్తకాన్ని సదా జాగృత పర్చే సుగ్రంథాన్ని ప్రసాదించి మహా గొప్ప మేలే చేశాడు.
 ”కరుణామయుడయిన అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌ను నేర్పాడు. ఆయన మనిషిని పుట్టించాడు. ఆయన అతనికి మాట్లాడటం నేర్పించాడు”.  (అర్రహ్మాన్: 1-4)
 పుస్తకం మనిషి మనసుకి,మస్తకానికి మంచి నేస్తం. ‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో… మంచి పుస్తకం కొనుక్కో’ అన్నది హితోక్తి. ఉత్తమ గ్రంథాల విలువ అలాంటిది మరి. భాష బాగా రావాలన్నా, భావం బాగా ఉండా లన్నా పుస్తకమే మార్గం. అపార జ్ఞాన సము ద్రాన్ని ఆపోశన పట్టడానికి పుస్తకానికి మించి న సాయుధం మరొకటి లేదు.  పుస్తక పఠనం మస్తక పురోభివృద్ధికి పూబాట వేస్తుంది పుస్తక ప్రయోజనం మస్తకంలో చైతన్య స్థాయిని పెం చడమే కాదు…ఊరట కలిగించడం, దిశా నిర్దేశం, అలసిన మనసుల సేద తీర్చడం.ఈ కారణంగానే –
”నేను ఏదయితే నేర్చుకున్నానో, అదంతా పుస్తకాల నుంచే నేర్చుకున్నాను” అన్నాడు అబ్రహమ్‌ లింకన్‌. ”నువ్వు ఒక సంస్కృతిని నాశనం చేయాలనుకుంటే (ఆయా జాతుల జ్ఞాన సంపద) పుస్తకాలను కాల్చేయనక్కర్లేదు; వాటిని చదవనీయకుండా చేస్తే చాలు” అం టాడు రె బ్రాడ్బరీ. ”వ్యక్తులు, సమూహాలు, సమాజాలు, తరాల మధ్య జరిగే అత్యుత్తమ సంభాషణా రూపాలు పుస్తకాలు”.   మనం మంచి పుస్తకాలు చదివే గుణాన్ని పెంచుకున్నట్లయితే, ఆ గుణం మనల్ని మన మూలాల్లో వెళ్లడం నేర్పిస్తుంది. మన ఊహా శక్తిని పెంపొందిస్తుంది. పద సంపదను వృద్ధి పరచి మనల్ని (బాతోఁ కే బాద్షా) మాటల మాంత్రికుల్ని చేెస్తుంది. మనకు తెలియని ప్రపంచంలో మనల్ని  విహరింప జేస్తుంది. మానసికంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికం గా మనల్ని అగ్ర భాగంలో నిలబెడుతుంది.
 మంచి పుస్తకం పఠనం మన జీవితాన్ని దీపంలా మారుస్తుంది. మనలో,మనసులో, మస్తిష్కంలో మార్పుకు నాంది పలుకుతుంది. అది ఎప్పుడు, ఏ సమయంలో, ఏ పుస్తక రూపంలో మన మస్తక ప్రపంచాన్ని మనం ఊహించనంత అద్భుతంగా మార్చి వేస్తుందో తెలియదు. అప్పుడు మనం సాధ్యం కాదను కున్న కార్యాల్ని సాధించే దిశకుమనల్ని నడు పుతుంది.ఏమో మనల్ని  సమూలంగా మార్చే ప్రక్రియలో ప్రస్తుతం మీ చేతుల్లో ఉన్న ఈ నెలవంక పత్రికే ఓ అంకురం కావొచ్చు. ఆ విషయానికొస్తే మానవ చరిత్రలో అక్షర విప్ల వం తీసుకొచ్చిన మార్పు అంతాఇంతా కాదు; ఎవరూ చెప్పలేనంత. స్వాతంత్య్ర ఉద్యమం లో ప్రజల్ని రగుల్గొలిపిందీ పుస్తకమే. ప్రపంచ కార్మిక పోరాటాల్లో కార్మికుల సంఘటిత పర్చిందీ పుస్తకమే.
 ఈజిప్టు నుండి మొదలు ఇరాన్‌ వరకు, అరేబియా నుండి మొదలు అమెరికా వరకు, ఆసియా నుండి మొదలు ఆస్ట్రేలియా వరకు, సామాన్యుల నుండి మొదలు సాహసవంతుల వరకు, పామరుల నుండి మొదలు పండితా గ్రేసరుల వరకు అందరినీ అన్ని విధాల జాగ రూకుల్ని చేసింది, వారిలో అజ్ఞానాంధకారాల ను తీరం దాటించింది, సర్వశక్తిమంతుడ యిన అల్లాహ్‌ా సమస్త మానవాళికి అందిం చిన అద్వితీయ, అనితరసాధ్య అక్షర సంపద కలిగిన   గ్రంథరాజం ఖుర్‌ఆన్‌ ఓ పుస్తకమే!
 అనన్యమైన రచనాశైలి, అపురూపమయినా భావప్రకటనా విధానం, అనిర్వచనీయమ యిన భావధార, అసమానమయిన విషయ నిర్ధారణా కౌశలము, అఖండనీయమయిన చర్చాపటిమ, అనితరసాధ్యమయిన కవనపు ఉరవడి ఖుర్‌ఆన్‌ స్వంతం. ఖుర్‌ఆన్‌ సత్యాన్ని అన్వేషించేందుకు, యదార్థాన్ని గుర్తించేం దుకు, వాస్తవాన్ని తెలుసుకునేందుకు మానవ మేధను చైతన్యవంతం చేస్తుంది.ఆలోచనాశక్తి ని, అనుశీలనా బలాన్ని పరిపుష్టం చేస్తుంది. హెతు బలాన్ని     ఉపయోగించమంటుంది.
ప్రశ్నించమంటుంది. చర్చించమంటుంది. నిజాన్ని నిగ్గు తేల్చి మరి నిర్థారించుకోమం టుంది.
 దివ్యఖుర్‌ఆన్‌, ప్రపంచంలో మానవాళి పోషి స్తున్న విభిన్న పాత్రల్ని చిత్రిస్తుంది. ఆ చిత్ర రణలో ప్రతి మానవుణ్ణి, ప్రతి జాతిని సంబోధి స్తుంది. ”ఇందులో మీ ప్రస్తావన ఉంది” (అన్బియా:10) అంటూ జాగురూక పరుస్తుం ది. మానవ శరీర నిర్మాణం మొదలుకుని అతని మానసిక ఆధ్యాత్మిక బలాల వరకు అన్నింటినీ చర్చిస్తుంది. గాలిలో పయనించే గాలి రేణువులు మొదలుకుని అంతరిక్షంలో తేలియాడే మహా స్థూల గోళాల వరకూ అన్ని ంటినీ పరిశీలించాలని బోధిస్తుంది. అందులో మన పాత్ర ఎక్కడ ఉందో వెదుక్కోవడం ‘ఆత్మ చేతన’ ఉన్నవారికే సాధ్యం.  మరో గొప్ప విష యమేమిటంటే  ఖుర్‌ఆన్‌ చదవకుండా ప్ర పంచంలో ఒక్క క్షణం కూడా గడవదు. కేవ లం ఉదయం సాయంత్రం ప్రార్థనల్ని తీసుకు న్నా ఏదోక చోట, ఏదోక రూపంలో అను నిత్యం ఖుర్‌ఆన్‌ పఠనం సాగుతూనే ఉం టుంది. ఇంత విరివిగా చదవబడే గ్రంథం ప్ర పంచంలో మరొకటి లేదు.
 మానవ శరీరంలో అన్నీ అంగాలకూ వాడే కొద్దీ అరగుదల ఉంటుంది. కానీ మస్తకం మాత్రం వాడేకొద్దీ రాటు తేలుతుంది, మస్తక వికాశానికి మంచి సాధనం పుస్తకం.పాఠశాల లోనో, కళాశాలలోనో విద్యార్జన పూర్తయి పోతుందనుకోవడం పొరమాటే! విద్యార్జన నిరంతరం కొనసాగాల్సిన నిరత సాధన. అయితే ఓ విషయం గమనార్హం! చదువు లేకపోతే జ్ఞానం రాదు అన్న మాట నిజమే. కానీ; జ్ఞానం రావడానికి కేవలం చుదువు మాత్రమే సరిపోదు. అందుకే
చదివి చదివి కొంత చదవంగ చదవంగ
చదువు చదివి యింకఁ జదువు చదివి
చదువు మర్మములను చదువలేఁడయ్యెను అన్నాడు వేమన.
”తౌరాతు గ్రంథ ప్రకారం ఆచరించాలని ఆదే శించిబడినప్పటికీ, దానికిఅనుగుణంగా ఆచరిన్చని వారిఉపమానం ఎన్నో (గంథాలు (వీపు పై) మోసే గాడిదతో సమానం”. (జుమా:5)
 చదవ నేర్చినవారు మంచి పుస్తకాలు చదవ కపోతే చదువు రానివారికీ వచ్చినవారికి తేడా ఉండదు.చాలా మంది మంచి పుస్తకాలు చదువుతారు. కాని కేవలం పఠనమే గొప్ప విషయం కాదు; చదివిన విషయాల్ని ఆకళిం పు చేసుకొని, ఆచరణ ఛాయను ఇవ్వ  గలిగి నప్పుడే, వాటి ఆధారంగా సరికొత్త సూత్రీకర ణలు చేసే స్థాకి ఎదిగినప్పుడే  దానికి సిసల యిన సార్థకత చేకూరుతుంది.
 ఈ నేపథ్యం చెప్పి కొన్ని మాటల్ని ఇక్కడ పొందు పరుస్తున్నాము –
– మనం ఎప్పటకీ గుర్తుండిపోవాలంటే చదవ దగిన మంచి పుస్తకాలు వ్రాయాలి, లేదా, వ్రాయదగిన మంచి పనులు చేయాలి.
– పుస్తకం లేని ఇల్లు మస్తకం లేని మనిషితో సమానం.
– అక్షర రూపం దాల్చిన ఓ సిరా చుక్క లక్ష  మెదళ్ళను కదిలి స్తుంది.
– చదువరి తాను చనిపోయేలోగా వెయ్యి జీవితాలు జీవిస్తాడు; చదవని వ్యక్తికి ఒకటే జీవితం.
– ప్రతి రీడర్‌ లీడర్‌ కాకపోవచ్చు; కానీ ప్రతి లీడర్‌ రీడరే!
– పడక మీద చేయదగిన మూడో మంచి పని..చదవడం.
– చదువు అనేది మనిషిలోని మంచిని వెలికి  తీయడానికి చేసే ప్రయత్నం.
– దొంగలు ఎత్తుకు పోనిది, దొరలు దోచుకు పోనిది, దాయాదులు పంచుకోలేనిది, దాన ధర్మం చేస్తే తరిగి పోనిది విద్య, విజ్ఞానం.
  పరికరం ఏదీ చెడ్డది కాదు. దాన్ని ఉపయో గించుకునేవారిపై అది ఆధార పడి ఉంటుంది, ఏ అంతర్జాలాన్నయితే మనం బూచిగా చూపి స్తున్నామో, అదే చదవడాన్ని సులభతరం చేెసింది. మనం చేసే సేర్చ్‌లో ప్రపంచ ప్రశస్త పుస్తకమేదయినా దొరకవచ్చు కదా!

 

Related Post